top of page

ఓం శ్రీ గురుభ్యో నమః

  • Writer: Neeraja Prabhala
    Neeraja Prabhala
  • Jul 24, 2021
  • 2 min read

ree

'Om Sri Gurubhyo Namaha' written by Neeraja Hari Prabhala

రచన : నీరజ హరి ప్రభల

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ! నమో వైబ్రహ్మ నిధయే వాసిష్టాయ నమోనమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే సర్వ లోకానామ్ భిషజే భవ రోగిణామ్ ! నిధయే సర్వ విద్యానామ్ దక్షిణామూర్తయే నమః శివుని అంశ దక్షిణామూర్తి కాగా, ఆ దక్షిణామూర్తి ప్రతిరూపమే గురువులు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించి దారి చూపే సద్గురువులు. జననీ జనకుల అవ్యాజప్రేమకు మరో రూపం గురువు. పామరులను సైతం పండితులను చేసి, నిర్మలమైన, స్వఛ్ఛమైన ప్రేమాప్యాయతలు చూపే దైవం గురువు. నిస్వార్థంగా విద్యాదానం చేసి కన్న వారి ప్రేమను మరిపించేది గురువే . ఉన్నత స్థాయిలో శిష్యులు ఉండాలని వాళ్ళ ప్రగతికి పాటుపడి దారి చూపే జ్ణానజ్యోతి గురువు. వట వ్రృక్షంలా ఎంత ఉన్నతికి ఎదిగినా ఆ వ్రృక్షంబు తొలి బీజం గురువే. వేయేల పలుకులు ? ఆ దేవుని ప్రతిరూపమే గురువు. పత్రం- ఫలం - తోయం ఇచ్చినా తీర్చ లేని మీ ఋణం ఏమిచ్చి తీర్చుకోగలము? ఏ సేవలతో మిమ్మల్ని సంత్రృప్తి పరచగలము? ఆమూలాగ్రము విద్యనభ్యసించి అపూర్వమైన ప్రజ్ణ చూపటం తప్ప. ఎన్ని సత్కార్యాలు చేసినా మీకు చేసే సన్మానము లోనే సంత్రృప్తి, ఆనందము కలుగును మిన్న. వ్యాస పౌర్ణమి, గురుపౌర్ణమి సందర్భంగా గురువులకు నా నమస్సుమాంజలులు. సాష్టాంగ ప్రణామములు. 🙏🙏 ......నీరజ హరి ప్రభల.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

ree

రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏




 
 
 
bottom of page