top of page


కచదేవయాని - పార్ట్ 46
నహుష చక్రవర్తి తన పరివారంతో దానవరాజ్యానికి బయలుదేరుతాడు. యయాతి విజయగాథతో రాజ్యం అంతా ఆనందంలో ఉంది. శర్మిష్ఠ వివాహం గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ దేవయాని మాత్రం శర్మిష్ఠపై ఈర్ష్యతో మండిపోతోంది. పౌర్ణమి రోజు దగ్గరపడుతుండగా అందరి జీవితాలు మారబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

T. V. L. Gayathri
Mar 175 min read


గయాసురుడు
పురాణ కాలంలో అసుర వంశంలో జన్మించినా దైవ చింతనతో మెలిగిన ధన్యుడు గయాసురుడు. త్రిపురాసురుని కుమారుడైన ఈయనకు బాల్యం నుంచే ధర్మంపై అమితమైన అనురాగం ఉండేది. ఇతర అసురుల వలె క్రూరత్వం ప్రదర్శించకుండా లోకహితాన్ని కాంక్షించేవాడు. శ్రీమహావిష్ణువుపై అచంచలమైన భక్తిని పెంచుకున్న గయాసురుడు కోలాహల పర్వతంపై ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. ఆహార పానీయాలు విసర్జించి వాయుభక్షణ చేస్తూ వేల సంవత్సరాల పాటు సాగించిన ఆ తపస్సు తీవ్రతకు ముల్లోకాలు కంపించాయి.

Ch. Pratap
Mar 164 min read


అప్డేట్
బామ్మ కథలు - 44
ఇదంతా గమనిస్తున్న బామ్మ మెల్లగా అక్కడికి వచ్చి, "ఏమైందిరా అర్జున్? ఆ లాప్టాప్ ఎందుకు అలా ఆగిపోయింది? అప్డేట్ అవుతోందా?" అని అడిగింది.
"అవును బామ్మా, దీన్ని అప్డేట్ చేస్తున్నాను. కొత్త ఫీచర్లు రావాలన్నా, ఇది వేగంగా పనిచేయాలన్నా ఇలా అప్డేట్ చేయాలి. లేకపోతే ఇది పాత వెర్షన్ లోనే ఉండిపోయి, కొత్త సాఫ్ట్వేర్లను గుర్తుపట్టదు. అందుకే స్లో అయిపోయింది" అని వివరించాడు అర్జున్.

Munipalle Vasundhara Rani
Mar 153 min read


త్రిపురాసుర సంహారం
“వెయ్యి సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే క్షణం…
ఒకే బాణంతో మూడు నగరాలను నాశనం చేసిన శివుడు!
అదే త్రిపురాసుర సంహారం.”
సి.హెచ్.ప్రతాప్ గారి ఉత్కంఠ భరితమైన కథలో లీనమవ్వండి.

Ch. Pratap
Mar 154 min read


ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 19
శివగామి హ్యాపీ మూడ్ లో ఉంది. జాగు చేస్తే అటువంటి మూడ్ ఆమెకు మళ్ళీ రాదు. ఈ వయసులో బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసరు పోస్టుని అందుకోవడం అంటే మాటలా? ఇటువంటి ఉత్తేజకరమైన సమయంలో ఆహ్లాదకరమైన ఆమె మూడ్ పాడవటానికి తను కారకుడు కాకూడదనుకుంటూ శివగామి అందించిన టీ కప్పు అందుకుని ఆ తరువాత దుస్తులు వేసుకుని వచ్చాడు.

Pandranki Subramani
Mar 156 min read


చాయ్ తాగే భూతం
ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. రాము చాలా ధైర్యవంతుడు. కానీ, ఒక చిన్న సమస్య ఉంది. రాత్రి చీకటి పడితే కొంచెం భయపడేవాడు.
ఒక రోజు రాత్రి అతను తన స్నేహితులకి చెప్పాడు.
"నేను భూతాలు ఉంటాయా, లేదా అని చూడటానికి పాత శ్మశానానికి వెళ్తాను."
Chai Thage bhutham - Telugu Comedy Story | చాయ్ తాగే భూతం - తెలుగు హాస్య కథ | Manasa Reddy Chichili

Manasa Reddy Chichili
Mar 142 min read
bottom of page
