'Aa Roju Rathri - Part 3/3' - New Telugu Story Written By Shilpa Naik
Published In manatelugukathalu.com On 28/06/2024
'ఆ రోజు రాత్రి 3/3' పెద్ద కథ
రచన: శిల్పా నాయక్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
యుట్యూబర్ నాగవల్లిక తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటూ ఉంటుంది.
అనుకోకుండా ఆ పార్టీకి వాసు అనే యువకుడు వస్తాడు. అతను ఆకర్షణీయంగా ఉన్నా అనుమానాస్పదంగా కూడా ఉంటాడు. అతన్ని తమ ఛానల్ కోసం ఉపయోగించుకోవాలనుకుంటుంది నాగవల్లిక.
తాను చెప్పిన రూల్స్ ప్రకారం ‘ట్రూత్ ఆర్ డేర్’ ఆడుదామంటాడు వాసు. అభి చేత గోపాల్, మైన లను చంపిస్తాడు. అభి ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు. ఆ నేరాన్ని నాగవల్లిక పైన మోపి జైలుకు వెళ్లేలా చేస్తాడు వాసు.
ఇక ఆ రోజు రాత్రి - పార్ట్ 3 చదవండి..
3 నెలల తర్వాత
వల్లి జైలు లో ఉంటుంది. తన ఫ్రెండ్స్ ని గ్లాస్ ముక్కతో హత్య చేసినందుకు తనకి జీవిత ఖైదు పడింది. వల్లి కిచెన్ లో కూర చేస్తున్నప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్ ‘నిన్ను కలవడానికి ఎవరో వచ్చా’రని చెప్పడం తో వల్లి ఆలోచనలో పడింది. ఎందుకంటే ఈ సంఘటన జరిగినప్పటి నుంచి తనని చూడడానికి తన పేరెంట్స్ కూడా రాలేదు. ఇప్పుడు ఎవరు వచ్చారో అని ఆత్రుతగా విసిటింగ్ హాల్ కి వెళ్తుంది. అక్కడ ఒక పాతికేళ్ళ అబ్బాయి వెనెక్కి తిరిగి నిలుచొని ఉంటాడు. వల్లి ఎవరని అడగడంతో ఆ అబ్బాయి వల్లి వైపు తిరుగుతాడు. తాను మరెవరో కాదు.
తను వాసు.
వాసుని చూడగానే వల్లికి ఎంత కోపం వస్తుందో అంతే భయం కూడా వేస్తుంది.
వాసు వెకిలిగా నవ్వుతూ, "సెలబ్రేషన్ పార్టీ లో నీకు, మైనా కి గొడవ జరిగింది. ఎందుకంటే మీ ఇద్దరు గోపాల్ నే ప్రేమిస్తున్నారు. ఆ విషయం తెలిసిన మైన కోపం లో యూట్యూబ్ లో ఒక పోస్ట్ చేస్తుంది, వీడియోస్ అన్నీ ఫేక్ అని. దీంతో నువ్వు ముందు గోపాల్ ని నేరుగా అడిగావ్ అసలు తన మనసులో ఎవ్వరు ఉన్నారని.
గోపాల్ మైన పేరు చెప్పడం తో గోపాల్ తలను కోపం తో బాటిల్ తో పగలగొట్టావ్. ఆ తర్వాత మైన ఫస్ట్ ఎయిడ్ చేసింది. మైన ని వన్ సైడ్ లవ్ చేస్తున్న అభి కి మైన చేస్తున్న పనులు నచ్చట్లేదు. అందుకే గోపాల్ ఫోన్ లాక్కొని మైన కి తన వీడియో చూపించాడు.
అయినా మైన గోపాల్ ని ప్రేమిస్తున్నాని చెప్పడంతో నువ్వు మీ అమ్మ కి కాల్ చేసి ‘ఈ రాత్రికి అందర్నీ చంపేస్తున్నా’ అని చెప్పి ముందు మైనా, తర్వాత గోపాల్, అడ్డొచ్చిన అభి ని చంపేశావ్. నీ ఆవేశం గురించి మీ అమ్మగారి కి ముందే తెలుసు కాబట్టి అక్కడ ఎటువంటి దుర్ఘటన జరగకూడదని పోలీస్ కి కాల్ చేసింది.
కాని పోలీస్ వచ్చేలొపు నువ్వు అందర్నీ చంపడంతో మీకు లైఫ్ టైం ఇంప్రిసన్మెంట్ శిక్ష పడింది. ఇదే కదా పోలీస్ ప్రకారం అక్కడ జరిగింది." అని మళ్ళీ నవ్వుతాడు.
వల్లి ఏడుస్తూ, "నీ వల్ల నా లైఫ్ మొత్తం నాశనం ఐయ్యింది" అని చెప్తుంది.
వాసు కోపంగా, "లైఫ్ మొత్తం కాదు, లైఫ్ తర్వాత కూడా నీకు టార్చర్ ఏంటో చూపిస్తా" అని చెప్పడంతో వల్లి వాసు వైపు చూస్తోంది.
నల్లగా ఉండే తన కళ్ళు ఎర్రగా నిప్పులాగా మండుతూ ఉంటాయి. తన చేతి గోళ్ళు పెద్దగా నల్లగా మారుతాయి. తన ముఖం పైన నరాలు నల్లగా కనబడతాయి. వల్లి, అతను అసలు మనిషేనా లేకపోతే.. అని ఆలోచిస్తున్న టైం లో వాసు మారిన గొంతుతో, "కాదు. నేను మనిషి మాత్రం కాదు. అలాగని ఆత్మనో లేక పిశాచినో కూడా కాను" అని చెప్తాడు.
వల్లి అప్పుడే ఘోస్ట్ టౌన్ గురించి ఆలోచిస్తుంది. అక్కడ వున్న వారందరూ ఆత్మలు ఉన్నాయి జాగ్రత అని చెప్పారు, ఒక ముసలావిడ తప్ప.
వాసు, "ఆ ముసలావిడ చెప్పినప్పుడైనా జాగ్రత పడాల్సింది" అని నవ్వుతాడు.
ఆ మాటలు విన్న వల్లి భయంగా, "అయితే ను.. ను.. జి.. " అని చెప్పలేక తడబడుతుంది.
వాసు మళ్ళి నవ్వుతు, "నా రూపాన్ని చూసిన తర్వాత కూడా ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా నాగ" అంటాడు.
వల్లి కి ఆ ముసలావిడ మాటలు గుర్తుకొస్తాయి.
"చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ టౌన్ లో నిప్పు అంటుకుని 100 మంది పైగా చనిపోయారు. ఆ తర్వాత అప్పటినుంచి అది అలా నిర్జీవంగా ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆ చోటులో ఎవరో ఒక ఫకీర్ చేతబడి చేస్తూ ఉండగా ఊరి జనం వాడికి పట్టుకొని కొట్టి చంపేశారు. ఆ తర్వాత నుంచి ఆ టౌన్ లో ఏవేవో ఆకారాలు కనిపిస్తూ జనాన్ని భయపెట్టేవి.
అసలు అక్కడ ఏం ఉంది అని కొంతమంది ధైర్యం చేస్కొని ఆ టౌన్ ని పరిశీలించారు. అప్పుడే వారికి ఆ ఫకీర్ ఎక్కడైతే చేతబడి చేసాడో అక్కడే ఒక అరబిక్ మంత్రం బొగ్గుతో రాసి ఉండడం గమనించారు. దాని అర్ధం తెల్సుకోవాలని ఊరి పెద్ద మసీదు నుంచి ఒక బాబా ని పిలిపించి ఆ మంత్రాన్ని, ఆ చోటుని చూపించారు.
దానిని చూసిన ఆ బాబా కళ్ళలో ఒక్కసారిగా భయం కనిపించింది. కాసేపు తర్వాత ఆ బాబా ఆ మంత్రనికి అర్ధం ఏంటో వివరించి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి అక్కడికి వెళ్లడానికి పూర్తిగా నిషేధించారు. "
వాసు ఆ అరబిక్ మంత్రాన్ని గట్టిగ చెప్తూ, "ఇదే మంత్రాన్ని ఆ ఫకీర్ బొగ్గుతో రాసాడు. దీని అర్ధం ఏంటో తెలుసా? " అని మళ్ళి ఆ మంత్రాన్ని చెప్తాడు. వల్లి భయంగా, "ఈ మంత్రం ‘ఇఫ్రిత్ జిన్’ ని ఆహ్వానించడానికి రాస్తారు.. " అని ఏడుస్తుంది. వాసు కళ్ళు ఈసారి నీలంగా మారుతాయి.
"నేను నా కుటుంబంతో ఉంటున్న నా ప్రాంతానికి వచ్చి, అరిచి, ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి బొమ్మలు గీసి, బీర్ బాటిల్ పగలకొట్టి, అసలు దెయ్యాలు, జిన్ అనేవి లేవని, ఉంటే మా ఇంటికి వచ్చి తన బలమేంటో చూపించమని ఛాలెంజ్ చేస్తే నేను రాకుండా ఎలా ఉంటాను నాగ?.
అసలు నాకు వచ్చిన కోపానికి మిమ్మని అక్కడే చంపేద్దామనుకున్నా కాని నువ్వు వేసుకున్న రెడ్ డ్రెస్, పెర్ఫ్యూమ్, నీ చేతిలో ఉన్న దేవుడి తాయత్తు అన్నీ నన్ను ఆపాయి. కానీ మీరు ఛాలెంజ్ చేసారు కదా ఇంటికి రమ్మని.. అందుకే పార్టీ రోజు మధ్యాహ్నమే అభి ఆత్మని నా లోకానికి పంపించి నా శక్తితో తనని రాత్రి వరకు సృహలో ఉంచాను" అని చెప్తాడు.
వల్లి తల దించుకుని ఏడుస్తూ ఉండగా తనకి గోపాల్, మైన, అభి అరుపులు వినిపిస్తాయి. వల్లి తల ఎత్తి వాళ్ళ అరుపు ఎక్కడ నుంచి వస్తుందో అని వెతుకుతుంది. వాసు తన పాకెట్ నుంచి చిన్న బాటిల్ తీసి వల్లి కి చూపిస్తాడు. అందులో 3 రకాల లైట్స్ తిరుగుతూ అరుస్తున్నాయి.
వాసు ఆ బాటిల్ ని చూస్తు, "నెక్స్ట్ నువ్వే.. " అని నవ్వుతూ మాయం ఐపోతాడు. వల్లి ఇంకా అక్కడే ఏడుస్తూ ఉంటుంది.
=======================================================================
సమాప్తం
=======================================================================
శిల్పా నాయక్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు శిల్ప. నేను రచయిత్రిని అని చెప్పలేను. కానీ అప్పుడప్పుడు ఫాంటసీ, భయం కల్పించే కథలు రాస్తుంటాను. కథలు రాయడం ఇప్పుడే నేర్చుకుంటున్నా.
Σχόλια