top of page

అభిలాష

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న#Abhilasha, #అభిలాష


Abhilasha - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 15/11/2024

అభిలాష -  తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


ఆకసానికి నిచ్చెన వేసి

చుక్కల పూలు తెచ్చేస్తాను

దేవువి మెడలో వేసేసి

దీవెనలిమ్మని ప్రార్ధిస్తాను


సాహస కార్యాలు చేపట్టి

గుండె ధైర్యము చూపిస్తాను

దేశాభిమానము చూపెట్టి

అందరి మనసులు దోచేస్తాను


తల్లిదండ్రులను పూజించి

మల్లెపూవులా వికసిస్తాను

అల్లరి పనులే మానేసి

ఎల్లరి మన్నన పొందేస్తాను


అమ్మ బాటలో పయనించి

నాన్న మాటను గౌరవించి

వారి ఋణమును తీర్చుకుంటాను

ఆశీస్సులు అందుకుంటాను



-గద్వాల సోమన్న




Comentários

Não foi possível carregar comentários
Parece que houve um problema técnico. Tente reconectar ou atualizar a página.
bottom of page