top of page

అక్షరమే అండగా'Aksharame Andaga' New Telugu Story


Written By Pitta Gopi(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

టెక్నాలజీ రాజ్యమేలే ఈ రోజుల్లో నాయుడు తోట గ్రామం ఇంకా పురాతన కాలంలోనే ఉంది. కారణం ఆ గ్రామ భూస్వామి తన స్వలాభం కోసం గ్రామస్తులు అందర్ని తన కింద పని చేయించుకోవటమే. అందులోను రామయ్య అనే వ్యక్తి తనకు చదువు , ఆస్తిపాస్తులు లేకపోవటంతో భూస్వామి వద్ద పాలేరుగా పని చేస్తు కొడుకు,కూతుళ్ళను చూసుకుంటున్నాడు.


అయితే పదేళ్ళ కొడుకు వెంకన్న తెలివైనవాడనే విషయం అక్షర జ్ఞానం లేని రామయ్య కు తెలియదు.ఎంత చెప్పినా.. అర్థం చేసుకోడు. తన తండ్రి పాలేరుగా ఉండటం వెంకన్నకు నచ్చేది కాదు. పైగా బడికి పంపకుండా అప్పుడప్పుడు తనను కూడా పనిలోకి పంపేవాడు.దీంతో భూస్వామి పై వెంకన్నకు పగ.ఒకరోజు వెంకన్న ఇంటివద్ద చదువుకుంటున్నాడు.


“ఒరేయ్ రామయ్యా..!” అని అరుస్తు భూస్వామి వస్తాడు. “ఏంటయ్యా ఇలా వచ్చారు..”

"ఇలా వచ్చానంటావేంట్రా..దొడ్లో పనులన్ని ఎక్కడివక్కడ ఉండిపోతేను” అంటాడు భూస్వామి.

"అయ్యా! కూతురు ఆరోగ్యం బాలేదు. కొద్దిగా ఆలస్యం అవుతుందయ్యా.. వచ్చేస్తాను” అని బతిమాలుతాడు రామయ్య.


''ఆలస్యం అయితే ఈ ఎంకడిని అయినా పంపురా.. చిన్నప్పటినుండి చేస్తే పనిలో ఆరితేరుతాడు” అన్నాడు భూస్వామి.


''నేను వెళ్ళను చదువుకుంటాను” అన్నాడు వెంకన్న.


''ఒరేయ్ రామయ్యా.. మీకు చదువెందుకురా...చెప్పరా నీ కొడుక్కి”

''నాన్నా! మేము చదువుకుంటే..వీడంతటి వాళ్ళం అవుతాం. అందుకే మమ్మల్ని చదువుకోనీయట్లే..” అన్నాడు వెంకన్న.


''రేయ్..రామయ్యా.. నన్ను అంత మాట అంటాడా నీ కొడుకు.. చెప్తా… అని వెళ్ళిపోతాడు భూస్వామి.


"ఏరా ..పెద్దోళ్ళ పై అలా అరుస్తావా..”అని కోప్పడతాడు రామయ్య .


ఇంతలో పాఠశాల ఉపాధ్యాయుడు సుందరం వచ్చి “రామయ్యా! నీ కొడుకుని బడికి పంపితే నిన్ను బాగా చూసుకుంటాడు” అన్నాడు.

“అవున్రయ్య.. నన్ను చదివిస్తే.. భూస్వామి కంటే మంచిగా బతకగలం” అని నచ్చజెప్పుతాడు వెంకన్న.

రామయ్య వినకుండా “నోర్మూసుకుని వెళ్ళి దొడ్లో పనులు చేసుకుని రా. లేకపోతే తిండిపెట్టేది లేదు” అన్నాడు.


"ఛ... నాయన మారడు మాష్టారూ! పూటో పూటన్నరో వస్తాను. మీరే మంచి చదువు చెప్పాల” అని చెప్పి భూస్వామి ఇంటికి బయలుదేరి వెళ్తాడు వెంకన్న.


పని చేస్తున్న వెంకన్నని చూసి కోపం పట్టలేకపోతాడు భూస్వామి.

“అయ్యా..పనులన్ని చేశాను. ఇంక నేను ఇంటికి వెళ్తా”నంటాడు.

“ఒరేయ్ ఎంకా..బడికి వెళ్ళిపోవాలనే కదరా నీ ఉద్దేశ్యం.. ఆవులు, దూడలను మేతకు ఎవడు తోలుతాడనుకున్నావ్..”


''మా అయ్య వస్తాడు కదండి…”


''ఈలోగా నువ్వు తోలుకుని వెళ్ళురా.. ఆకలితో చస్తున్నాయి. నీకు ఇంకా చెప్పలేం. మీ అయ్యకు తిండి పెట్టేది చాలక జీతం కూడా దొబ్బుతున్నాడు.నువ్వేమో పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్” అన్నాడు భూస్వామి.


రామయ్య వస్తూ “అదేంటయ్యా అలా అంటావ్… మా తాతల కాలం నుంచి పని చేస్తున్నాం కదా.. ఎంక.. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తోలుతా” అన్నాడు.

''సరే ఎవడో ఒకడు తోలం”డని చెప్పి వెళ్ళిపోతాడు భూస్వామి.

''ఓరయ్య.. ఈ పూట బడికెళ్తాను రా..” అన్నాడు వెంకన్న.

“ఆ సరే.. చెప్పింది చేసినావు కాబట్టి ఈ పూట బడికెళ్ళు. జాగ్రత్త”

మరుసటిరోజు మంచం పై ఆరు బయట రామయ్య సేద తీరుతుంటాడు.వెంకన్న గుమ్మం వద్ద చదువుతున్నాడు.


“ఒరేయ్ రామయ్యా” అంటు చేతిలో ఏదో కాగితం పట్టుకుని భూస్వామి వస్తాడు.

“ఏంటయ్యా…” ఆత్రతగా అడుగుతాడు రామయ్య.


"డబ్బులు తీసుకున్నావ్ కదరా.. ప్రాంశారీ నోట్ రాసి తెచ్చాను సంతకం కోసం”

''హో..అలాగే” అంటూ బొటనవేలు తన పంచెకు రుద్దుతూ “ఎక్కడ పెట్టాలయ్యా” అంటాడు రామయ్య.

ఇంతలో వెంకన్న “ఓరయ్య ఆగురా…” అని ఆ పేపరు తీసుకుని చదువుతూ....

''ఓరయ్య.. ఇక్కడ 15000వేలు రూపాయలు తీసుకున్నట్లు రాశాడు…” అన్నాడు వెంకన్న వెంకన్న

"ఏంట్రా ఎంకా నువ్వనేది.. నేను 1500మాత్రమే తీసుకున్నాన్రా. పైగా ఇది ఇంగ్లీషు లో రాయించి తెచ్చాడు రా” అన్నాడు రామయ్య.

తరువాత ఆవేశంతో భూస్వామి షర్ట్ పట్టుకుని “ఏరా.. నాకు చదువు రాదని ....1500 ని 15000 గా మార్చి, మా బతుకులు బజారుకీడ్చాలని చూస్తావా.. నీ సొమ్ముతో నువ్వు తృప్తి పడకుండా మాలాంటి చదువులేనోళ్ళని మోసం చేసి సంపాదిస్తావా” అని కొడతాడు.


సుందరం పోలీసు ఆఫీసర్ ని తీసుకురావటంతో రామయ్య భూస్వామిని వదిలేస్తాడు. పోలీసులు భూస్వామిని అరెస్ట్ చేసి తీసుకుపోతారు.

"ఒరేయ్ ఎంకా..ఒక్క పూట బడికి వెళ్తే నీకు ఇన్ని వచ్చాయి. రేపటి నుండి నువ్వు బడికెళ్ళురా.. భూస్వామిది కాకుండా ఊరిలో వారి పనికి వెళ్ళి నేను సంపాదిస్తాను. అక్కను కూడా బడికి పయనం అవ్వమనురా. ఎంత చదువు చదివితే నేను అంత సంపాదిస్తా..” అని తన కండబలం చూపిస్తూ.. తలపాగా కట్టుకుని పౌరుషంగా బయటకెళ్తాడు రామయ్య. ఆనందం తో ఎగిరి గంతులేస్తాడు వెంకన్న.

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం.
42 views0 comments
bottom of page