top of page

అమర వీరుడు

Updated: Jan 29

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #AmaraVeerudu, #అమరవీరుడు

Amara Veerudu - New Telugu Poem Written By - Bulusu Ravisarma

Published In manatelugukathalu.com On 20/01/2025

అమర వీరుడుతెలుగు కవిత

రచన: బులుసు రవి శర్మ


ఊహ వచ్చిన దగ్గర నుండి

ఏదో చేద్దామన్న తాపత్రయం

సూదిలా గుండెల్ని గుచ్చుతుంది


ఏది చేద్దాం 

ఎవరికోసం చేద్దాం

అన్న స్పష్టత లేకుండా

చీకటి పొదల్లాంటి 

ఆలోచనలతో విహరిస్తూ

పెళ్లి సంసారం అనే

ఉచ్చుల్ని తనకుతానే వేసుకుని

ఉరితీయబడతాడు


బాధ్యతల ఉరికంబం మీద

వ్రేలాడతాడు

పిల్లా పిచ్చుక

చదువులు పెళ్లిళ్లు అంటూ

రోజు చస్తూ బ్రతుకుతుంటాడు


పదవీవిరమణ చేసి

వార్తా పత్రికకి వాలుకుర్చీకి

పరిమితమై

తాను ఖననం చేసుకున్న

కలల గోతిలో పడి మరణిస్తాడు


ఆశయాలు అతని 

మస్తిష్కంలోంచి బయల్పడి

మట్టిని ఛేదించి

సమాధిచుట్టు గడ్డిపూలై

తలలూపుతాయి


చూసిన ఎవరో ఒకరి

గుండెల్లో ప్రకంపనలు

రేపుతాయేమో


-బులుసు రవి శర్మ 




Comentarios


bottom of page