top of page
Original.png

అమ్మ చెప్పిన నీతి

Updated: Jan 21, 2025

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaCheppinaNeethi, #అమ్మచెప్పిననీతి


Amma Cheppina Neethi - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 09/01/2025

అమ్మ చెప్పిన నీతి - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


చెరువుకు రక్షణ గట్టు

ప్రాణం పోయును  చెట్టు

ఆత్మవిశ్వాసం మనిషి

విజయానికి తొలి మెట్టు


చీమలు నేర్పును పొదుపు

కలసి ఉంటేనే గెలుపు

చరిత్ర బాగా చదివిన

ఈ సత్యం మనకు తెలుపు


సంస్కారమిచ్చును చదువు

చదువులో మేలులు కలవు

విద్యాలయాలు మహిలో

విజ్ఞానానికి నెలవు


చెడు వ్యసనాలే చేటు

అభివృద్ధికవే పోటు

జీవితంలో ఎప్పుడూ

ఇవ్వకూడదోయ్! చోటు


-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page