అమ్మ సందేశం
- Gadwala Somanna
- Jan 11
- 1 min read
Updated: Jan 21
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaSandesam, #అమ్మసందేశం

Amma Sandesam - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 11/01/2025
అమ్మ సందేశం - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
విహరించే పక్షుల్లో
విరబూసిన పువ్వుల్లో
ఎన్నెన్నో అందాలు
చిన్నారుల నవ్వుల్లో
ప్రవహించే యేరుల్లో
ప్రకాశించే దివ్వెల్లో
పరోపకారమే ఉంది!
పండించే రైతుల్లో
ప్రార్తించే పెదవుల్లో
పూజించే చేతుల్లో
దైవభక్తి ఇమిడి ఉంది
ధ్యానించే మనసుల్లో
సరిహద్దు సైనికుల్లో
భారతమ్మ సేవకుల్లో
దేశభక్తి ఉద్భవించు
త్యాగధనుల పలుకుల్లో
-గద్వాల సోమన్న
Comments