అమ్మ కోసం
- Bulusu Ravi Sarma
- Jan 23
- 1 min read
Updated: Jan 29
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #AmmaKosam, #అమ్మకోసం

Amma Kosam - New Telugu Poem Written By - Bulusu Ravisarma
Published In manatelugukathalu.com On 23/01/2025
అమ్మ కోసం - తెలుగు కవిత
ఒడియా మూలం: శ్రీ దిలీప్ బలవంత రాయ్
తెలుగు సేత: రవి శర్మ
అబద్ధాలు నిజాలు
నిండిన ప్రపంచం
నీ వొడి వీడిన తర్వాతే తెలుసుకున్నా!
ఆనందం విషాదం
నిండిన సమాజం
నీ చేయి వీడిన తర్వాతే
అవగతం చేసుకున్నా!
వీనుల విందు
అంటే ఏమిటో
నీ పిలుపు విన్న తరువాతే
తెలుసుకున్నా!
అనీర్వచనీయమైన
అనుభూతి ఏమిటో
నీ స్పర్శ తర్వాతే
తెలుసుకున్నా!
రక్షణ కి మారు పేరు
ఏమిటో
నీ కొంగు వీడిన తర్వాతే తెలుసుకున్నా!
కదిలే దేవత
నీవేనని
నీ పాద స్పర్శ తర్వాతే తెలుసుకున్నా!
నీ వినా జీవనం మరణం
ఒక్కటే నని ఈ బ్రతుకంతా
వ్యర్థ మని కూడా
తెలుసుకున్నా!
ఇంక పదాలే లేవు
సాహిత్యంలో అని
నీ గురించి రాసిన తర్వాతే తెలుసుకున్నా !
-బులుసు రవి శర్మ
"అమ్మ కోసం": బులుసు రవి శర్మ గారి కవిత కు జోహార్. ... పచ్చి నిజాల కవిత.
ప్రతి మనిషికి దేవుడు ఒక నిస్వీవార్ధపు సేవకురాలు - శ్రేయోభిలాషి ను ఇచ్చాడు.
అదే అమ్మ.
అమ్మ ను మించిన దైవం లేదు.
పి.వి. పద్మావతి మధు నివ్రితి