top of page
Original.png

అందాల తెలుగు పదాలు

Updated: Dec 26, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AndalaTeluguPadalu, #అందాలతెలుగుపదాలు


Andala Telugu Padalu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 09/12/2024

అందాల తెలుగు పదాలు - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


పెద్దల మాటలు

ప్రగతికి బాటలు

తావులు రువ్వే

పూవుల తోటలు


బడిలో గురువులు

గుడిలో వేల్పులు

పచ్చని తరువులు

నిలుపును అసువులు


గొప్పది స్నేహము

చేయకు ద్రోహము

నోటికి తాళము

వేస్తే లాభము


వితండ వాదము

చివరికి ఖేదము

మదిలో ధ్యానము

పెంచును జ్ఞానము


కోయిల గానము

పంచును మోదము

అందెల నాదము

దోచును హృదయము


వేళాకోళము

మొదటికి మోసము

దేశం కోసము

నిలుచుట ధర్మము


ఎదలో ద్వేషము

హరించు శాంతము

మిక్కిలి కోపము

చూస్తే సర్పము


ఉంటే సహనము

తెచ్చును విజయము

ముఖమున హాసము

ఎంతో అందము


-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page