అందం
- Mohana Krishna Tata
- Mar 15
- 1 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #అందం, #Andam, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Andam - New Telugu Poem Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 15/03/2025
అందం - తెలుగు కవిత
రచన: తాత మోహనకృష్ణ
అమ్మాయిలే అందం
వారికి అలంకరణ..మరింత అందం
సంప్రదాయమైన ముస్తాబు..
అదే సరైన అందం
విశాలమైన నుదురు..
చిన్న సైజు బొట్టు అందం
పల్చనైన కనుబొమ్మలు..
నల్లటి పెన్సిల్ అందం
అందమైన నేత్రాలు..
రవ్వంత కాటుక అందం
అందమైన ఆ ముక్కు..
మెరిసే ముక్కుపుడక అందం
అందమైన చెవులు..
లక్షణమైన దుద్దులు అందం
సుతిమెత్తని బుగ్గలు..
మెత్తని పౌడర్ అందం
మృదువైన పెదాలు..
లేత రంగు అందం
తలనుంచి నడుము వరకు..
సాగే ఆ జడ అందం
పిడికెడు నడుము..
మెరిసే వడ్డానం అందం
కందిపోవు పాదాలు..
సవ్వడి చేసే మువ్వలు అందం
ఇంపైన ఆకృతికి..
చీరకట్టు అసలైన అందం
ఇలాంటి అమ్మాయి..
సొంతమైన జీవితమే ఆనందం
******
-తాత మోహనకృష్ణ
Commenti