top of page

అనివార్యం!!

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Anivaryam, #అనివార్యం, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 60


Anivaryam - Somanna Gari Kavithalu Part 60 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 18/04/2025

అనివార్యం!! - సోమన్న గారి కవితలు పార్ట్ 60 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అనివార్యం!!

----------------------------------------

ఫలములుంటే తరువులకు

విలువలుంటే మనుషులకు

ఉండదోయ్! లోటెప్పుడు

గౌరవ మర్యాదలకు


సమాజ చీడపురుగులకు

వెన్నుపోటు దారులకు

విలువెక్కడ! ఉంటుంది!

ఇల నమ్మక ద్రోహులకు


సరిహద్దు సైనికులకు

భువిలో అన్నదాతలకు

చేతులెత్తి మ్రొక్కాలోయ్!

కనిపించే గురువులకు


ఆదరించే మనసులకు

ఆదుకునే మిత్రులకు

సదా రుణపడి ఉండాలి

కృతజ్ఞతలు చెప్పాలి

ree












చెట్టు మనిషి ఆయువు పట్టు

----------------------------------------

తల్లిలాంటిది తరువు

మనిషికది ఆదరువు

నరకొద్దు పెద్దయ్య!

నేడే కళ్ళు తెరువు!


కడుపులు నింపుతుంది

అసువులు నిలువుతుంది

స్వచ్ఛ వాయువు పంచి

ఆయువు పెంచుతుంది


కాలుష్యం తరుమును

వానలు కురిపించును

జీవకోటి ఆశ్రయము

చెట్టు వలన క్షేమము


ప్రాణమున్నది చెట్టు

వద్దు గొడ్డలిపెట్టు

స్వార్థాన్ని కట్టిపెట్టు

త్యాగాన్ని చూపెట్టు

ree












చూడ చక్కని దృశ్యాలు

----------------------------------------

ఎగురుతున్న కపోతాలు

విశ్వశాంతి చిహ్నాలు

ఎత్తైన ప్రదేశాల్లో

ఉంటాయి నివాసాలు


హరివిల్లు నింగిలోన

మోదమే మనసులోన

కనువిందు చేయునోయి!

పాఠాలు నేర్పునోయి!


చుట్టు ఉన్న పచ్చదనము

మదిని దోచు చక్కదనము

పదిమందికి పంచితే!

ఎంతైనా మంచిదే!


ప్రకృతిలోని అందాలు

మనిషితో బహు బంధాలు

కాపాడుకుంటేనే ఇల

మిగులునోయ్! జీవితాలు


చూడ చక్కని మేఘాలు

చాలవోయి! నయనాలు

ఖగోళమే అద్భుతము

నిజముగా ఆశ్చర్యము


ఎన్నెన్నో దృశ్యాలు

అవి అగమ్యగోచరాలు

వెల్లడించు మానవునికి

ఆసక్తికర విషయాలు

ree















పొత్తం చెప్పిన సత్యాలు

----------------------------------------

గుండెలోన గాయము

కంటిలోన కారము

ఎవ్వరికి కారాదు

బ్రతుకులోన భారము


కొండలాంటి ధైర్యము

ఘనతనిచ్చు రోషము

ఎన్నడు వీడరాదు

నిప్పులాంటి సత్యము


బ్రతుకులోన వేషము

మనసులోన ద్వేషము

ఎప్పుడు ఉండరాదు

మిగుల అహంకారము


స్నేహితులకు ద్రోహము

కలనైనా మోసము

ఎక్కడ చేయరాదు

ఆప్తులకు అన్యాయము

ree














చిన్నారి అభిలాష

----------------------------------------

సీతాకోకచిలుకలా

స్వేచ్చగా విహరిస్తా!

తెలుగులోని మాధుర్యము

దాని వోలె గ్రోలుతా!


అందరికీ ఆనందము

పువ్వులా పంచిపెడుతా!

అవనిలో కాలుష్యము

తరువులా తరిమికొడుతా!


భువిలో మొక్కలు నాటి

పచ్చదనం అందిస్తా!

మానవత్యాన్ని చాటి

మనిషి విలువ పెంచుతా!


పంచభూతాల మాదిరి

పదిమందికి సాయపడుతా!

తెలుసుకుంటే చదువరి

ప్రపంచమే కుటుంబము


-గద్వాల సోమన్న


Comments


bottom of page