top of page

అనురాగ దేవత అమ్మ

Updated: Nov 25, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న#AnuragaDevathaAmma, #అనురాగదేవతఅమ్మ


Anuraga Devatha Amma - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 16/11/2024

అనురాగ దేవత అమ్మ -  తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


అమ్మ పేరు అనురాగము

ఆమె తీరు అపురూపము

కుటుంబాన మణిదీపము

గగనాన ఇంద్ర చాపము


అమూల్యమే అమ్మ ప్రేమ

ఆమె ఉన్న స్వర్గ సీమ

సరిచేయును కుటుంబము

చూపించును ఆదర్శము


సదనానికి వెన్నెముక

సహనానికి మచ్చుతునక

గృహ కోవెలలో దేవత

నిర్వర్తించునూ బాధ్యత


మహిలో అమ్మ అదృష్టము

మదిలో సదా స్మరించుము

మారు పేరు త్యాగానికి

ఆసరా  కుటుంబానికి



-గద్వాల సోమన్న




コメント


bottom of page