top of page

అరటి చెట్టు వేదన

Writer's picture: Bhallamudi NagarajuBhallamudi Nagaraju

#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #అరటిచెట్టువేదన, #AratiChettuVedana, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Arati Chettu Vedana - New Telugu Poem Written By Bhallamudi Nagaraju

Published In manatelugukathalu.com On 29/12/2024

అరటి చెట్టు వేదన - తెలుగు కవిత

రచన: భళ్లమూడి నాగరాజు


దుంప మొక్క  తెచ్చావు 

పెరటిలో నాటావు 

పాదు కట్టి నీరు పోసి 

ఏపుగా  పెంచావు 

గాలి వానలకు

రక్షణ కవచంలా నిలిచేవు 


నిన్ను మించి ఎదుగుతుంటే 

పరవశించి పోయావు 

ఆదివారం అరటి గెల వేసింది 

సోమవారం మొగ్గ తొడిగింది అని 

పద్యాలు రాసేవు 


నే రాల్చిన  పువ్వుతో 

పులుసు చేసుకొని 

జుర్రుకున్నావు 


అప్పుడే పుట్టి 

లే లేత  ఆకులతో 

నా చుట్టూ అల్లుకుంటున్న 

నా చిన్నారులను 

నిర్దయగా నరికేసి 

శుభాకార్య వేళ 

నీ ఇంట ముంగిట 

తాళ్ళతో కట్టేసావు 


గుత్తుగా  పెరుగుతున్న 

పెడను చూసి 

కనక వర్షం కోసం 

కలలు కన్నావు 


కత్తితో కుత్తుక కోసి 

నిర్దాక్షిణ్యంగా 

నన్నూ నరికేసావు 

ముక్కలు ముక్కలు చేసేసావు 


గుండెల్లో కత్తులు దించి 

నా చర్మం ఒలిచి 

దవ్వ..మువ్వ అంటూ 

అవలీలగా పెకిలించి 

వంటలు వండుకున్నావు

ఎంత కఠిన్నాత్ముడవయ్యా 

జాలి లేని మానవా 🙏




..భళ్లమూడి నాగరాజు

రాయగడ.






76 views0 comments

Comentários


bottom of page