'Asalaina Srimanthudu' - New Telugu Story Written By Pitta Gopi
'అసలైన శ్రీమంతుడు' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ధనవంతుల పిల్లలే తప్ప పేదోళ్ళు పిల్లలు చదువుకోని కొన్ని గ్రామాలు ఉంటాయి కదా..
అలాంటి గ్రామమే మన సీతాపురం. గ్రామం మద్య లో ఒక మర్రిచెట్టు నీడ లో పిల్లలందరూ గోళీ పిక్కలాట ఆడుతుంటే.. ప్రభాకర్ పెద్ద డబ్బా నిండా గోళీలు పట్టుకుని కూర్చున్నాడు.
ఆటలో కోటేశ్వర్ కి ఎక్కువ రాగా ఒక్కడికి తప్ప మిగతవారికి సమానంగా వచ్చాయి. ఓడిపోయిన సుశాంత్ పక్కకు తప్పుకున్నాడు..
"రేయ్ ప్రభా చాలా పిక్కలు ఉన్నాయి కదా! ఆడుతావా.." అన్నాడు కోటి.
"ఎక్కువ ఉంటే మాత్రం ఓడిపోతే తరిగిపోవా.. నేను ఆడను వీటిని దాచుకుంటా" అన్నాడు ప్రభా.
"ఒరేయ్ గెలిస్తే ఎక్కువ వస్తాయి కదరా.. వీడు వాళ్ళ నాన్నలా పిసనారి వెదవేరా” నవ్వుతూ..
“రేయ్ సుశాంత్! నేను కొన్ని పిక్కలు నీకు ఇస్తాను. నాకు తిరిగి ఇవ్వవల్సిన అవసరం లేదు. ఆడురా.. మాతో గెలిస్తే నువ్వే తీసుకో" అంటు తన దగ్గర కొన్ని పిక్కలు ఇస్తాడు.
"ఎందుకురా వాడికిస్తున్నావ్.." అంటాడు మరొకడు.
"పోనిలేరా.. ఉన్నదాంట్లో పక్కోడికి ఇస్తే తప్పేముంది.. పోతే మనకు కొన్ని పోతాయి కానీ మరలా గెలుచుకోవచ్చు. ఒకడి ఆనందం ముందు ఇవన్నీ ఎందుకు రా.. మన కోసం బతికితే దాన్ని బతుకు అనలేం రా. పదిమంది కోసం బతికితే దాన్ని బతుకు అంటారు" అంటు పిక్క విసురుతాడు.
ఆ మాటకు ప్రభా కోటి వైపు అదేపనిగా చూస్తాడు..
కాలం గడుస్తుంది.
చదువు సంధ్యలు లేని కోటి తో సహా ఆటలు ఆడిన అందరూ వ్యవసాయం తో పాటు చిన్నా చితక పనులు చేసుకుంటు కుటుంబాలను పోషించుకుంటు కాలం వెళ్ళదీస్తున్నారు.
కోటి 5 వరకు చదివి మానివేయటంతో ముక్కో ముక్కన్నరో చదువు తెలిసినోడు, మరియు తెలివైన వాడు, మంచివాడు.
ఇక ప్రభా జాతకం తెలిసిందే..
ఎంత ఉన్నా దాచుకోవటమే తప్పా.. పరులకు పంచటం, సహాయం చేయటం అనేవి లేవు అతనికి.
ప్రభా తండ్రి తనకున్న ఫ్యాక్టరీలతో అప్పట్లో వేలల్లో సంపాదిస్తే, అవే ఫ్యాక్టరీలు కంపెనీలు గా మార్చి ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు ప్రభా. తన ప్రమేయం కూడా లేకుండా మేనేజర్ లు, సూపర్వైజర్ లు చూసుకునేలా చేశాడు ప్రభా.
ప్రభా పిసనారి యే కావచ్చు కానీ ఎవరి మీద అసూయ లేదు. తెలివితక్కువ వాడు కూడా కాదు.
ఒకనాడు తాను కారులో వస్తుండగా.. కొందరు నమస్కారం పెడతారు. అయితే అది తనకు కాదని, పక్కనే సైకిల్ పై పోతున్న కోటేశ్వరరావుకి అని అర్థం అయింది.
అప్పుటినుండి ప్రజలను, కోటి ని గమనించటం మొదలెట్టాడు ప్రభా.
తాను అరకతో వస్తున్నా.. ,
పని చేసి బురద మయం అయి వస్తున్నా.. ,
లేదా సాధారణంగా వస్తున్నా..
ప్రజల నుండి ఆ గౌరవం మాత్రం ఆగటం లేదు.
దీంతో ప్రభాకి ఎప్పుడు అదే ఆలోచన..
రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టేది కాదు.
ఎందుకంటే
లక్షల్లో సంపాదిస్తూ.. కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కారులో తిరిగే నాలాంటి వాళ్ళకి ఇవ్వని గౌరవం వ్యవసాయం చేసుకుని సైకిల్ మీద తిరిగే కోటికి లభించటం..
ఇదిలా ఉంటే ఒకరోజు సాయంత్రం అలా మర్రిచెట్టు నీడలో కూర్ఛున్నాడు ప్రభా. చుట్టూ చాలామంది ఆ నీడలో సేద తీరుతున్నారు.
ఇంతలో అటుగా కోటి వస్తుండటం చూసి ప్రభా తప్ప అందరూ నిలబడి నమస్కారిస్తారు.
కోటి వెళ్ళిపోయాక కూర్చుని ఎవరి ఆలోచనలో వాళ్ళు పడిపోయారు.
ప్రభా ఉండబట్టలేక వాళ్ళతో "నేను ఈ ఊరిలో లక్షాధికారిని. పని చేయకుండా కాలు మీద కాలు వేసుకుని సంపాదించే వాడిని. అలాంటి నన్ను ఒక్కరు కూడా గౌరవించటం లేదు..
కోటి కేవలం తమ కుటుంబం కోసం అది కూడా ఖాళీ గా ఉంటే పూట గడవదని పని చేసుకుంటూ బతికే కోటికి లేచి నిలబడేంత గౌరవం ఎందుకు ఇస్తున్నారు" అని అడిగాడు.
"హ.. హ.. హ.."అందరూ నవ్వుతూ..
అందులొ ఒకడు "కోటి మా శ్రీమంతుడు"
అందులో మరొకడు "నీవు - కోటికి అందనంత దిగువలో ఉన్నావ్."
ఆందులో ఇంకోకడు "పిచ్చోడా.. లక్షల్లో సంపాదించుకుని ఇంట్లో దాచుకునే నువ్వు ఎక్కడా.. కష్టపడుతు కుటుంబానికి కష్టం రానియకుండా చూసుకోవటమే కాదు, రోజువారీ సంపాదనలో ఊరి లో పని చేయలేని, సంపాదన లేని వారికి దానం చేసే కోటేశ్వరరావు ఎక్కడ" అంటాడు.
"హో.. హో.. అయితే మీకు కూడా దానం చేశాడా" ఆసుయతో ప్రశ్నించాడు వాళ్ళని.
"కొద్దో గొప్పో సంపాదించుకునే మాకంటే కోటీ చాలా కష్టపడే తత్వం కలవాడు. ఎండ, వాన, కష్టం నష్టం ఆకలి అనకుండా నిజాయితీగా పని చేసుకునేవాడు ఎప్పుడూ ఏమి ఇవ్వకున్నా గౌరవించబడతాడు. అది మాతోనే కాదు ఈ సమాజంతోను కూడా" ఆంటాడు ఇంకొకడు.
వాళ్ళ మాటలకు ప్రభాకు చిన్ననాటి గోళీ ఆట దగ్గర కోటి మాటలు గుర్తు వస్తాయి.
తనలో తాను ఊహించుకుంటు..
"కూలిపనులు చేసుకున్నోడు కూడా పదిమంది తో గౌరవించబడ్డాడు అంటే అది లక్షలతో కాదని, లక్షణంతోనే సాధ్యమని, కష్టపడితే వచ్చే గౌరవం కోట్లు సంపాదించినా రాదని కోటి నాకు అర్థం అయినట్లు చెప్పాడు. నిజంగా నా దృష్టిలో కోటినే కోటీశ్వరుడని, అతనే శ్రీమంతుడు అని, కోటిలా ఉండటానికి ప్రయత్నం చేద్దామని మనసులో అనుకుంటు ముందుకు పోతున్నాడు ప్రభా.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comentários