top of page
Original.png

భర్త విరహవేదన - చకోర పక్షులు

చకోర పక్షులు, భర్త విరహవేదన, తెలుగు హాస్య కథ, పౌరాణిక కథ, వ్యంగ్య కథ, చంద్రకాంతి, భార్యాభర్తల అనుబంధం, తెలుగు చిన్న కథ, Telugu Humorous Story, Mythological Fiction

పౌర్ణమి వెన్నెలలో చంద్రుడి వైపు ఆశగా చూస్తున్న చకోర పక్షులు, ఆకాశంలో కమలాసనంపై ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు, నేపథ్యంలో పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న మహిళలు మరియు మొబైల్ ఫోన్‌లో నిమగ్నమైన ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించే హాస్యభరిత పౌరాణిక తెలుగు కథా దృశ్యం.
పౌర్ణమి వెన్నెలలో చంద్రుడి వైపు ఆశగా చూస్తున్న చకోర పక్షులు, ఆకాశంలో కమలాసనంపై ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు, నేపథ్యంలో పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న మహిళలు మరియు మొబైల్ ఫోన్‌లో నిమగ్నమైన ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించే హాస్యభరిత పౌరాణిక తెలుగు కథా దృశ్యం.

Bhartha Virahavedana - Chakora Pakshulu - A Mythological Satirical Telugu Humorous Story | Kulakarni Pavana Dattasai

భర్త విరహవేదన - చకోర పక్షులుపౌరాణిక హాస్య వ్యంగ్య తెలుగు కథ | కులకర్ణి పవన దత్తసాయి

Published in manatelugukathalu.com on 05/07/2026


చకోర పక్షులు చంద్రకాంతిని ఆహారంగా స్వీకరిస్తాయనే ప్రసిద్ధ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని, భార్యాభర్తల అనుబంధం, విరహవేదన, పుట్టింటి సంప్రదాయం, నేటి మొబైల్ వ్యసనాన్ని హాస్యభరితంగా మేళవించిన వినూత్న తెలుగు కథ "భర్త విరహవేదన - చకోర పక్షులు." కల్పిత పౌరాణిక నేపథ్యంతో సాగుతూ, చివర్లో చిరునవ్వు తెప్పించే చమత్కార ముగింపుతో ఈ కథ పాఠకులను అలరిస్తుంది.


ఒకసారి చకోర పక్షులన్నీ కలిసి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాయి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. అప్పుడు చకోర పక్షులన్నాయి, "స్వామి! మాకెందుకు అన్ని పక్షుల్లాగా ఎప్పుడూ దొరికే ఆహారం పండ్లు, కీటకాలు, ఆకులు లాంటివి కాకుండా, ఎప్పుడో కానీ దొరకని చంద్రుడి కాంతిని ఆహారంగా ఇచ్చావు? మా జీవితంలో ఎక్కువ భాగం చంద్రుడి కోసం ఎదురుచూడడంలోనే గడిచిపోతుంది" అని అడిగాయి.


అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ బదులిచ్చాడు, "ఇది నా సృష్టి కాదు. సతీవ్రతుడైన ఒక పురుషుడి శాప ఫలితం." 


చకోర పక్షులు ఆశ్చర్యంతో చూస్తుండగా కథను కొనసాగించాడు బ్రహ్మదేవుడు.

"మీరందరు మీ పూర్వ జన్మలలో ఆడవాళ్లు. పెళ్లిళ్లు చేసుకొని, కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళొస్తామని వాళ్ల భర్తలకు చెప్తారు. రోజులు కాస్త నెలలవుతాయి. వాళ్ల భర్తలు అలా ఎదురుచూస్తూనే ఉంటారు. అప్పుడు అందులో ఒక ధర్మబద్ధుడైన భర్త ఒకడు శపిస్తాడు. ఎదురుచూడడంలో ఉన్న వేదన మీకు తెలియాలంటే, చంద్రుడి కోసం ఎదురుచూసే చకోర పక్షుల్లా పుట్టాలని శపించా”డని వాటి శాప వృత్తాంతం చెప్పాడు బ్రహ్మదేవుడు.


ఇది విన్న చకోరాలు తమ పాపాలకు నిష్కృతి లేదా అని అడిగాయి.

అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, "మీరు పౌర్ణమి రోజు చంద్రకాంతి కోసం వెళ్తున్నప్పుడు, పుట్టింటికి వచ్చిన ఆడపిల్లల ఇళ్లను గమనించండి. ఒక పక్షం రోజుల తర్వాత వాళ్ల ఇంటి మీద వాలండి. మిమ్మల్ని చూసినప్పుడు ఆ ఆడవారికి వాళ్ల అత్తగారింట్లో వాళ్లకోసం ఎదురుచూస్తున్న భర్తలు గుర్తుకొచ్చి, తొందరగా వాళ్ల భర్తల దగ్గరికి వెళ్తారు. ఇదే మీకు నిష్కృతి" అని వివరిస్తాడు.


అప్పుడు పక్షులకు ఒక సందేహం వచ్చి బ్రహ్మదేవుడిని అడుగుతాయి.

"స్వామి! ఈ కాలం ఆడపిల్లలకు ఎంతసేపు తలదించుకొని ఫోన్ చూసే అలవాటుంది కానీ, తలెత్తి ఆకాశంలో పక్షులను చూసే అలవాటు ఎక్కడుంది? ఇలా అయితే వాళ్లు మమ్మల్ని చూసేదెలా? తర్వాత వాళ్లకు భర్తల గురించి గుర్తొచ్చి వాళ్లింటికి పోయేదెలా?"


ఇంకా సమాధానం రావట్లేదని పైకి చూస్తే, వాటికి అర్థమైంది బ్రహ్మదేవుడు మాయమై చాలా సేపైందని. చేసేదేం లేక, మళ్ళీ తపస్సు చేసే ఓపికా లేక పక్షులు వెళ్లిపోయాయి 😀😜

ఈ చమత్కారమైన కథ మీకు నచ్చితే, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి హాస్య, వ్యంగ్య, పౌరాణిక తెలుగు కథల కోసం ManaTeluguKathalu.com ను తరచూ సందర్శించండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ కథను పంచుకుని చిరునవ్వులు పంచండి.

***

కులకర్ణి పవన దత్తసాయి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కులకర్ణి పవన దత్తసాయి
కులకర్ణి పవన దత్తసాయి

రచయిత పరిచయం: కులకర్ణి పవన దత్తసాయి

నమస్కారం.. నేను కులకర్ణి పవన దత్తసాయి.

వృత్తి రీత్యా  AG office Hyderabad లో auditor గా పని చేస్తున్నాను.  ప్రవృత్తి రీత్యా సాహితీ ప్రియుడిని.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page