బుల్లితెర మాహాత్మ్యం
- T. V. L. Gayathri
- Apr 17
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #బుల్లితెరమాహాత్మ్యం, #BulliteraMahatmyam

Bullitera Mahatmyam - New Telugu Poem Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 17/04/2025
బుల్లితెర మాహాత్మ్యం - తెలుగు కవిత
రచన: T. V. L. గాయత్రి
బుల్లితెర మాహాత్మ్యం బుద్ధిలో వైకల్యం
కళ్ళకెంతో హానికరం కళ్ళనీళ్ల పర్యంతం
ఆత్తాకోడళ్ల సఖ్యత్వం అరక్షణంలో మాయం
చెత్త కథల సమాహారం ఛిద్రమౌ మిత్రత్వం
బలహీనులపై నిత్యం ప్రతీకారాల క్రోధత్వం
కలిసి పనులు చేయటం కలల్లోనే సుసాధ్యం
చింతలో మునిగిపోతాం చివరకదే పర్యవాసనం
సుంతైనా దక్కని ఆనందం చూడటమే మానేద్దాం!
సీరియళ్ళే భరించలేని శిరోభారానికి కారణం
తీరికగా వెతుక్కుందాం దివ్యమైన కాలక్షేపం
పుస్తకాలను చదవటం బుద్దిమంతుల లక్షణం
మస్తకంలో పేరుకున్న మన్నునంతా తొలిగిద్దాం!
జ్ఞానసముపార్జనమే సకల శుభపరిణామం
కానిపనులను మానేసి కార్యోన్ముఖులమవుదాం!
చక్కని విద్యలు నేర్చి సంతోషంతో జీవిద్దాం!
ప్రక్కదారులెందుకు? పదుగురికి నేర్పిద్దాం!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Commenti