top of page

చిలుక చెప్పిన సత్యాలు

Updated: Mar 11

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChilukaCheppinaSathyalu, #చిలుకచెప్పినసత్యాలు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 26

Chiluka Cheppina Sathyalu - Somanna Gari Kavithalu Part 26 - New Telugu Poem Written By Gadvala Somanna Published In manatelugukathalu.com On 06/03/2025

చిలుక చెప్పిన సత్యాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 26 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


చిలుక చెప్పిన సత్యాలు


పూలలోని తావులను

భాస్కరుని కిరణాలను

ఎవరు ఆపగలరోయి!

భువిని నీతిమంతులను


జనయించే తలపులను

పరిభ్రమించే భూమిని

ఎవరు నిలువరించగగరు!

కదిలిపోయె మేఘాలను


గడిచిపోయిన కాలాన్ని

గతించిన ఆత్మీయుల్ని

ఎవరు తిరిగితేగలరు!

అమూల్యమైన బాల్యాన్ని


కరిగిపోయిన యవ్వనాన్ని

ఆగిపోయిన గుండెను

ఎవరు మరల పొందగలరు!

వృథా అయిన జీవితాన్ని


అందుకే ఓ మానవా!

గర్వాన్ని ఇక మానవా!

అసాధ్యమైనవి సృష్టిలో

ఎన్నో కలవు!గ్రహించవా!











చెట్టు చెప్పిన సంగతులు!

----------------------------------------

పిరికితనము వదులుకొని

ధైర్యాన్ని నింపుకొని

ఆశయాన్ని సాధించు!

నమ్మకాన్ని పెంచుకొని


గర్వాన్ని మానుకొని

వినయాన్ని ఆనుకొని

మొక్కలాగ జీవించు!

చుక్కలాగ ప్రకాశించు!


చిక్కులన్ని ఎదుర్కొని

హక్కులన్ని కాచుకొని

స్వేచ్చగా విహరించు!

న్యాయముకై నినదించు!


వినోదము పంచుకొని

వికాసము ఎంచుకొని

జగతిలో తేజరిల్లు!

జీవితాన వర్ధిల్లు!


మంచి దారి ఎన్నుకొని

సుగుణాలను పుచ్చుకొని

ఆదర్శము చూపించు!

నడవడిని దిద్దుకొని


గురువులను తలచుకొని

వ్యక్తిత్వం మలచుకొని

పదిమందికి బోధించు!

ప్రగతి బాట నడిపించు!


మనిషితనం చాటుకొని

దేశభక్తి నాటుకొని

దేశకీర్తి ప్రకటించు!

గొప్ప స్ఫూర్తి అందించు!


చిరు నవ్వులు పులుముకొని

అందరినీ కలుపుకొని

దేశాభివృద్ధి కాంక్షించు!

దీక్షను కొనసాగించు!

















కాదు మేలు వైరము!

----------------------------------------

జీవితాన వైరము

కాటేసే సర్పము

పోగొట్టును నెమ్మది

దూరమున్న మంచిది


హెచ్చినచో వైరము

బంధాలకు భంగము

రేపుతుంది కలహము

నలిగిపోవు హృదయము


వైరము పెట్టుకోకు

చెలిమిని చెరుపుకోకు

జగడాల కొలిమిలో

నేస్తం! కాలిపోకు


అందరితో స్నేహము

ఎంతైనా క్షేమము

వైరాన్ని వదిలేసి

అనుభవించు! నాకము










పిచ్చుక ఉపదేశము!

----------------------------------------

పెద్ద వారి ఉపదేశము

ప్రేమ గల ఆదేశము

ఆలకిస్తే క్షేమము

వారి ఘన సందేశము


పెద్దలపై గౌరవము

పిల్లలపై అనురాగము

చూపిస్తే మంచిది

నిజమైన అభిమానము


పెద్ద వారి అనుభవము

అందరికి ఆదర్శము

స్వీకరిస్తే గనుక

మితిలేని ఉపయోగము


పెద్దలను గౌరవించు!

చక్కగా ప్రవర్తించు!

వారే మన సంపద

కాసింత ఆలోచించు!
















అక్షర ప్రబోధం

----------------------------------------

ఎక్కువైతే నష్టము

పొలమున కలుపు మొక్కలు

చిన్న చిన్న లోపాలు

బ్రతుకున ప్రమాద ఘంటికలు


నెమలమ్మ అందమే!

కాళ్లే వికారమే!

కోకిల గొంతు తీపి!

రంగు చూడ నలుపు!


చూడు గురువిందకు మచ్చ

ఇక గులాబీకి ముల్లు

లోపాలు సహజమే!

వాటి వాటి నైజమే!


జీవితాన మచ్చలు

దిద్దుకుంటే మాన్యులు

లేదంటే మాత్రము

అవుతారోయ్! పుచ్చులు


-గద్వాల సోమన్న


Comentarios


bottom of page