#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChinnaruleMukhyam, #చిన్నారులేముఖ్యము, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 12
Chinnarule Mukhyam - Somanna Gari Kavithalu Part 12 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 01/02/2025
చిన్నారులే ముఖ్యము - సోమన్న గారి కవితలు పార్ట్ 12 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
పసి పిల్లల హృదయాలు
పవిత్రమైన ఆలయాలు
వారితో కోలాహలం
కళకళలాడు సదనాలు
వారుంటే ఆనందము
గుండెల్లో ఆహ్లాదము
క్రమశిక్షణతో పెంచిన
అభివృద్ధినొందు దేశము
బాలలే దేశానికి
ముఖ్యులే అభివృద్ధికి
లేకపోతే లోకము
వికసించుట దుర్లభము
ముసిముసి నవ్వుల బాలలు
కాంతులీనే భానులు
బాధ్యతగా పెంచాలి
సంస్కారము నేర్పాలి

నాకెంతో ఇష్టము
----------------------------------------
పల్లెటూరి బాసలు
మాట్లాడే యాసలు
నాకెంతో ఇష్టము
ప్రేమలొలుకు మనసులు
పల్లెసీమ సొగసులు
ప్రవహించే యేరులు
నాకెంతో ఇష్టము
స్వచ్ఛమైన ప్రేమలు
పొలంలోని పైరులు
నీరుండిన చెరువులు
నాకెంతో ఇష్టము
ఫలాలిచ్చు తరువులు
పల్లె పిండి వంటలు
ఒలకపోయు మమతలు
నాకెంతో ఇష్టము
మాయలేని మనుషులు
చెట్టు క్రింద కబురులు
గట్టు మీద నడకలు
నాకెంతో ఇష్టము
అందమైన పల్లెలు

ఇంటి జ్యోతులు ఇంతులు
----------------------------------------
వెలుగులీను జ్యోతులు
సదనంలో వనితలు
వెలవెల పోవునోయి
వారు లేక గృహములు
స్త్రీలుంటే కళకళ
తారల్లా మిలమిల
అనురాగ దేవతలు
అగును ఇల్లు కోవెల
అసమానము త్యాగము
అపురూపము సేవలు
గాజులాంటి హృదయము
కాకూడదు ముక్కలు
ఇవ్వాలి గౌరవము
ఇలలోన మహిళలకు
చూడరాదు చులకన
చేయరాదు హేళన
మగువలు ఆధారము
వారున్న కుటుంబము
చూడాలి ప్రేమగా!
ఎంచాలి గొప్పగా!

జనాభా నియంత్రణ ప్రాముఖ్యం!
----------------------------------------
అందరికీ చదువు సాధ్యము
ఉద్యోగం మాత్రము కష్టము
పెరుగుతున్న జనాభాను
అరికట్టనిచో నష్టము
వనరులేమో బహు తక్కువ
దేశ జనాభేమో ఎక్కువ
అందరికీ సమాన న్యాయము
జరుగుటన్నది గగన కుసుమము
ప్రభుత్వ ఉద్యోగాలైతే
అందరికీ దొరకపోవచ్చు!
స్వయం ఉపాధి మార్గాలైతే
స్వయం కృషితో పొందవచ్చు!
జనాభా నియంత్రణ అవసరము
లేకపోతే సౌకర్యాలు
అందరికీ అంతంత మాత్రమే!
ఇది అక్షరాల సత్యమే!

అంతర్మథనం
----------------------------------------
గురువింద మచ్చ చూసి
గర్వాన్ని మానుకుంటా!
లోపాలు సహజమనే
సత్యాన్ని తెలుసుకుంటా!
గులాబీ ముళ్ళు చూసి
అందంవెనుక అపదనే
విషయాన్ని నినదిస్తా!
జాగ్రత్తలు తీసుకుంటా!
వాడే పూలను చూసి
నీటి మీద బుడగ చూసి
'బ్రతుకంటే ఇంతేనని'
బుద్ధిగా మసలుకుంటా!
శిథిలమైన కోట చూసి
పాడుబడిన బావి చూసి
గతించే వైభవాన్ని
సదా గుర్తు చేసుకుంటా
జారిపడితే ముక్కలాయె
అద్దాలను పరికించి
మనసులూ ఈ విధమున
ఉంటాయని యోచిస్తా!
సృష్టిలో ఎన్నెన్నో
నేర్పుతాయి పాఠాలు
'అంతర్మథనం' మంచిది
చక్కబడును జీవితాలు

నలుగురికి సాయపడతా!
---------------------------------------
కంటి మీద కునుకునై
జుంటితేనె ధారనై
నలుగురికి సాయపడతా!
చంటి పాప నవ్వునై
మల్లెలోని తావినై
పల్లెలోని సౌరునై
నలుగురికి సాయపడతా!
వల్లివంటి మనసునై
ముద్దబంతి పూవునై
శుద్ధమైన జలమునై
నలుగురికి సాయపడతా!
పెద్ద వారి వాక్కునై
మువ్వలోని నాదమై
బువ్వలోని బలమునై
నలుగురికి సాయపడతా!
దివ్వెలోని కాంతినై
కుక్కలోని నమ్మకమై
చుక్కలోని సొగసునై
నలుగురికి సాయపడతా!
మొక్కలోని ప్రగతినై
బుర్రలోని తెలివినై
ఎర్ర రంగు త్యాగమై
నలుగురికి సాయపడతా!
మర్రి చెట్టు నీడనై

తెలుగు మాస్టారు హితవు
---------------------------------------
మాట తప్పిన వాడు
ఓడిపోయిన రేడు
ఇద్దరూ సమానము
తీరని అవమానము
చమురు లేని దీపము
వెలుగు లేని రూపము
కొరగానివి పరికింప
కరుణ లేని హృదయము
గురువు లేని చదువులు
గానిలోని రాతలు
స్థిరంగా ఉండవోయ్!
ఉపయోగం లేవోయ్!
ప్రేమలేని మనసులు
చూడ ఎండమావులు
నీరు లేని బావులు
అమావాస్య రాత్రులు

సహృదయము కావాలి!
---------------------------------------
హృదయ వీణ మీటితే
ఎన్నెన్నో రాగాలు
అనిర్వచనీయమైన
అద్భుతమైన భావాలు
సున్నితమైనది హృదయము
కాకూడదోయ్! కఠినము
సూటిపోటి మాటలతో
చేయరాదోయ్! గాయము
హృదయమే దేవాలయము
పదిలంగా ఉంచుకొనుము
దైవ నామ స్మరణతో
పవిత్రం చేసుకొనుము
ఆపదలో స్పందించే
అమ్మలా ఆదరించే
ప్రేమతో హత్తుకొనే
హృదయమే కావాలోయ్!
అమ్మలా ఆదరించే

చేతులు జోడించి మ్రొక్కెద!
---------------------------------------
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు
జ్ఞానమిచ్చిన గురుదేవులకు
చేతులు జోడించి మ్రొక్కెద!
కడుపునింపు అన్నదాతలకు
ఇల పారిశుద్ధ్య కార్మికులకు
వెలలేని వారి సేవలకు
చేతులు జోడించి మ్రొక్కెద!
మంచి చేసే మహనీయులకు
నిస్వార్ధ దేశభక్తులకు
సాటిలేని వారి సేవలకు
చేతులు జోడించి మ్రొక్కెద!
భారతమ్మ ముద్దు బిడ్డలకు
ప్రాణవాయువు నిచ్చు తరువులకు
దాహార్తి తీర్చు చెరువులకు
చేతులు జోడించి మ్రొక్కెద!
సరిహద్దుల్లో సైనికులకు

హానికరము కోపము
---------------------------------------
శత్రువు ప్రతిరూపము
మితిమీరిన కోపము
అదుపులో ఉంచితే!
ఎంతైనా మంచిదే!
చెరుపును ఆరోగ్యము
హరించు ఆనందము
జాగ్రత్త లేకుంటే
వాట్టిల్లును నష్టము
అగ్నిజ్వాల క్రోధము
భరించుట కష్టము
మేలు మేలు శాంతము
అదే కదా స్వర్గము
హానికరము రౌద్రము
నియంత్రణే ముఖ్యము
అలాగైతే దొరుకు
జీవితాన సౌఖ్యము
***
-గద్వాల సోమన్న
Comments