top of page

చూడు! చూడు! చందమామ

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #చూడు! చూడు! చందమామ, #Chudu Chudu Chandamama, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 40

Chudu Chudu Chandamama - Somanna Gari Kavithalu Part 40 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 20/03/2025

చూడు! చూడు! చందమామ - సోమన్న గారి కవితలు పార్ట్ 40 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


చూడు! చూడు! చందమామ

----------------------------------------

ఆకసాన చందమామ

అందమైన చందమామ

అందనట్టి చందమామ

అందరికీ మేనమామ


మబ్బుల్లో దాగుతాడు

దోబూచలాడుతాడు

చెలకత్తెలు చుక్కలతో

సరదాగా ఉంటాడు


నిండు పున్నమి వేళలో

పండు వెన్నెల ఇస్తాడు

వెండి గిన్నెలా మారి

అందాలే రువ్వుతాడు


నెలరేడు అని కూడా

మారుపేరు ఉన్నోడు

కొలనులో కలువమ్మలకు

సన్నిహితుడవుతాడు


బొజ్జ నింపు సమయంలో

అమ్మకు గుర్తోస్తాడు

నింగిలో కన్పిస్తూ

వెన్నెల కురిపిస్తాడు


బలే బలే చందమామ

ఇష్టమైన చందమామ

చంద్రయాన్-2 కు ఘన

స్వాగతమనిన చందమామ

ree














అరటాకు గొడుగు

----------------------------------------

కొంతమంది పిల్లలు

పొలంలో ఉన్నారు

ఆటలెన్నో ఆడి

ఆనందమొందారు


ప్రకృతి మాత ఒడిలో

పరవశించి పోయారు

గట్లపై,చెట్లపై

నాట్యమే చేశారు


పచ్చదనాన్ని చూసి

పులకించిపోయారు

కేరింతలు కొడుతూ

గంతులే వేశారు


ఇంతలో వర్షమే

జోరుగా కురిసింది

అరటాకు బాలలకు

గొడుగుగా మారింది


వారి చిన్న కనుదోయి

అందాలు చూడగా

పిల్లలెంతో హాయి

పొందారు గొప్పగా


పచ్చదనం విలువను

తెలుసుకున్న మంచిది

మొక్కలను,తరువులను

పెంచుకున్న ఘనమది

ree










పెద్దయ్య ప్రబోధ గీతిక

----------------------------------------

పచ్చని కాపురాల్లో

పోయరాదోయ్! నిప్పులు

సుతిమెత్తని గుండెల్లో

గుచ్ఛరాదోయ్! మేకులు


నూరేళ్ళ జీవితాల్లో

రేపరాదోయ్! మంటలు

చక్కని కుటుంబాల్లో

పెట్టరాదోయ్! చిక్కులు


కత్తిపోటు మాటలతో

కల్గించరాదోయ్!బాధలు

వేధించే చూపులతో

విరువరాదోయ్! మనసులు


పనికిరాని పనులతో

చెరుపరాదోయ్!బ్రతుకులు

హాని చేయు దుష్టులతో

పెట్టుకోరాదోయ్! పొత్తులు

ree











అమ్మ ప్రేమ గొప్పది

----------------------------------------

నవ మాసాలు మోస్తుంది

భద్రంగా గర్భంలో

కనుపాపలా చూస్తుంది

పుట్టిన పిదప లోకంలో


సేవలెన్నో చేస్తుంది

పసి బిడ్డకు బాల్యంలో

తొలి గురువుగా ఉంటుంది

ప్రేమగా సదనంలో


ఆకాశమే చిన్నది

అమ్మ చూపు త్యాగంలో

ఆమె మనసే పెద్దది

చూడగా అనురాగంలో


నెత్తిమీద పెట్టుకుని

చూచును అమ్మ అవనిలో

ఆమెకెవరు సాటి లేరు

తీర్చిదిద్దే విషయంలో

ree























ఘనులు ఉన్నవారు ఆప్తులు

----------------------------------------

దిద్దుకున్న తప్పులు

బాగుపడును బ్రతుకులు

పదే పదే చేస్తే

తప్పులగును నిప్పులు


మితిమీరిన వాంఛలు

పెంచుకున్న కక్షలు

నష్టమే బ్రతుకులో

సుఖముండదు మనసులో


కఠినమైన మాటలు

నీచమైన తలపులు

గాయపరచు మనసులు

చేయునోయి! ముక్కలు


కాదోయ్! గొప్పదనము

అమితమైన ఆస్తులు

జీవితంలో ఘనులు

కలిగియున్న ఆప్తులు


-గద్వాల సోమన్న


Comments


bottom of page