top of page

దీపావళి… దీపావళి..

Updated: Nov 10, 2024

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #Deepavali, #దీపావళి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


'Deepavali Deepavali' - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 31/10/2024

'దీపావళి… దీపావళి..' తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) 


దివ్వెల  వెలుగుల  దీపావళి.

ప్రతి  ఇంట  ఆనంద దీపావళి.

మన  ఇంట  వైభోగ  దీపావళి.

వెలుగు దివ్వెల  దీపాల  ఆవళి  దీపావళి.

పూజాదికాలతో  ధనలక్ష్మిని  ఆహ్వానించే  దీపజ్యోతుల  దీపావళి.

నిశిరాతిరిలో  పండువెన్నెల  కాంతులు  విరజిమ్మే  దీపావళి.

భామా  విజయ దరహాస  దివిటీల దీపావళి. 

స్త్రీ శక్తి  ఘనత  విశదమైన  దీపావళి. 

అజ్ఞానాంధకారాన్ని  పారద్రోలి  జ్ఞానజ్యోతిని  ప్రసాదించే  దీపావళి. 

చెడుపై  మంచి  సాధించిన  విజయోత్సవ  దీపావళి.  

వయోభేదాన్ని మ‌రిచి  ఆబాలగోపాలము   సంతోషంతో  పండుగ  జరుపుకునే  దీపావళి.

కాకరపువ్వొత్తులు, మతాబులు, భూచక్ర, విష్ణు చక్రాలతో  సంబరాల దీపావళి.

 అదిరిపోయే  ధ్వనితో  జుయ్యిమని  ఆకాశంలోకి  దూసుకుపోయే  లక్ష్మీరాకెట్ ల  దీపావళి.  

ఇంటింటా  ఠీవిగా  నిలబడి  నవ్వుల వెలుగులు  విరజిమ్మే  చిచ్చుబుడ్ల  దీపావళి.

పోటాపోటీగా  పటాసుమోతలు  కొని    డబ్బుల   లాసుల  ఖాతాను  చూసి  నిరాశపడక   అమితమైన  సంతోషఖాతాను  చూసే  ఆనంద  దీపావళి.

అమావాస్య నాడే  వెన్నెల వెలుగుల  దీపావళి.

దుష్ట సంహారం  కోసం  గోగునారకు  నిప్పెట్టి  ఊరంతా  త్రిప్పే   దీపావళి.

మళ్లీ మళ్లీ  రావాలనే  వేయిపున్నమి దివ్వెల దీపావళి. 


……నీరజ  హరి  ప్రభల.


Comments


bottom of page