top of page

దెయ్యం చేసిన సాయం


'Deyyam Chesina Sayam' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 06/11/2023

'దెయ్యం చేసిన సాయం' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


దెయ్యం అంటే అందరికీ భయమే. కానీ, రాజు అనే ఒక యువకుడు చాలా ధైర్యవంతుడు. దేనినైనా.. తెలివితేటలతో ఎదురుకుంటాడు. రాజు చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన జీవితాన్ని సాగిస్తున్నాడు. ఎంత చేసినా, తను సంతోషంగా బతకడానికి కావాల్సిన డబ్బులు సంపాదించలేకపోతున్నాడు. మహారాజు గారి దగ్గర మెప్పు పొంది.. మంచి కొలువు సంపాదించాలని అనుకుని బయల్దేరాడు. ఊరిలో తన స్నేహితుడు రాము తో కలిసి బయల్దేరాడు.


చాలా దూరం నడిచిన తర్వాత.. అలసిన ఇద్దరూ.. ఒక చెట్టు నీడ కింద కాసేపు విశ్రాంతి కోసం ఆగారు. రాము ఒక గొప్ప గాయకుడు కావాలని కోరిక. ఎక్కడ కొంచం సమయం దొరికినా.. తన గొంతు విప్పి పాటలు అందుకుంటాడు. అలాగే, కొంత సేపు విశ్రాంతి తర్వాత.. కొంచం హుషారు వచ్చి.. చెట్టు కింద గొంతు సవరించాడు.


ఆ పాట కి ముందు చెట్టు మీద ఉన్న పక్షులు భయపడి ఎగిరిపోయాయి, జంతువులు బెదిరిపోయి పారిపోయాయి. రాము తన గొంతు ఇంకా పెంచాడు. పక్కనే ఉన్న రాజు కు తప్పక, ఇదంతా భరిస్తున్నాడు. ఆ గొంతు విని, చెట్టు పైన ఉన్న ఒక దెయ్యం ఉలిక్కి పడింది.


"ఎవడ్రా! నా నిద్ర చెడగొట్టింది?" అని దెయ్యం కిందకు చూసింది. కింద రాము పాట పాడడం చూసింది.. కొంతసేపటికి దెయ్యం ముక్కు, చెవి నుంచి రక్తం కారడం మొదలైంది. అలసిపోయిన రాము మళ్ళీ పడుకున్నాడు. ఈలోపు చెట్టు పై నుంచి దెయ్యం కిందకు వచ్చింది.


"ఆ పడుకున్నది నీ స్నేహితుడా? మళ్ళీ పాట పాడొద్దని చెప్పు.. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. మా దెయ్యాల సమావేశం కుడా ఉంది ఇప్పుడు"


దెయ్యాన్ని చూసి రాజు భయపడక.. దెయ్యంతో..


"నా స్నేహితుడు పాట ఆపుతాను.. దానికి బదులుగా.. నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి!"


"నువ్వు ఏది అడిగినా చేస్తాను.. కానీ నీ స్నేహితుడిని మాత్రం ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపో!"


"అలాగే! నేను మహారాజు గారి దగ్గరకు వెళ్తున్నాను. నాకు ఏదో ఒకటి చేసి.. మంచి పారితోషకం వచ్చేలా చెయ్యాలి"


"అలాగే! నేను మహారాజు గారి అమ్మాయిని ఆవహిస్తాను.. అప్పుడు నువ్వు వచ్చి.. ఈ మంత్రం 'చెవిలో రక్తం' చెబితే.. నేను వెళ్ళిపోతాను. అప్పుడు మహారాజు గారి దగ్గర.. నీకు మంచి పారితోషకం లభిస్తుంది"


రాజు తన స్నేహితుడు రాము కు నచ్చ చెప్పి.. అక్కడ నుంచి తీసుకుని వెళ్ళాడు. రాము కు పక్క ఊరిలో పని ఉండడం చేత.. అక్కడకు వెళ్ళిపోయాడు.


చెప్పినట్టే, దెయ్యం మహారాజు కూతురిని ఆవహించింది. నయం చేయడానికి.. ఎక్కడ ఎక్కడ నుంచో చాలా మంది వచ్చి ప్రయత్నించారు.. కానీ నయం కాలేదు. మహారాజు గారు దిగులు చెంది.. ఎవరైతే యువరాణి కి నయం చేస్తారో.. వారికి ఉహించలేని పారితోషకం ఇస్తానని ప్రకటించాడు"


అప్పుడు రాజు యువరాణి కి నయం చేస్తానని... ఒక అవకాశం ఇవ్వమని వచ్చాడు. దెయ్యం చెప్పినట్టే, ఆ మంత్రం యువరాణి చెవి లో చెప్పాడు. వెంటనే, దెయ్యం బయటకు వెళ్లిపోయింది. మహారాజు సంతోషించి.. తాను చెప్పిన ప్రకారం పారితోషకం తో పాటు యువరాణి తో వివాహం జరిపించాడు.


తన స్నేహితుడు రాము కు కుడా ఆ రాజ్యం లో మంచి కొలువు ఏర్పాటు చేసాడు రాజు.


*****

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


62 views0 comments
bottom of page