ఈ ఒక్కసారికి క్షమించమ్మ తల్లీ!
- Sairam Allu

- Nov 2
- 2 min read
#AlluSairam, #అల్లుసాయిరాం, #EeOkkasarikiKshaminchammaThalli, #ఈఒక్కసారికిక్షమించమ్మతల్లీ, #తెలుగుకవిత, #TeluguPoem

Ee Okkasariki Kshaminchamma Thalli - New Telugu Poem Written By Allu Sairam Published In manatelugukathalu.com On 02/10/2025
ఈ ఒక్కసారికి క్షమించమ్మ తల్లీ! - తెలుగు కవిత
రచన: అల్లు సాయిరాం
నీ అంతాన్ని కొనితెచ్చుకోవడానికి
ఏం ముహూర్తంలో మానవ బిడ్డని కన్నావో కానీ
కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన నీ ఉనికి
కేవలం కొద్ది కాలంలోనే నామరుపాలు లేకుండా మారిపోయింది!
అరణ్యాలు కనిపించకుండా మట్టుబెట్టడంతో
నీ కొప్పు సిగ లాంటి ప్రకృతిలో
పచ్చదనం ఏనాడో కనుమరుగైపోయింది!
బ్రతకడానికి సమానమైన హక్కులున్న
నీ జీవనాడులైన మిగతా జీవరాశులు
ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నాయి!
అనంతమైన వస్తు సంపద కొలువున్న
నీ నుంచి కాలుష్యం, కల్తీ లేని వస్తువు
అనేది దొరక్కుండాపోయింది!
ఎన్నో తరాల జీవరాశుల బరువులు మోసి మోసి
నీ ఒళ్లు హూనం అయిపోయింది!
టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్ధాలు తిని తిని
నీ జీర్ణవ్యవస్థ ఏమైపోయిందో!
ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే
ఆవిర్లు కక్కుతూ నీకు వేడితో జ్వరాలు వచ్చేస్తున్నాయి!
మనిషి చేస్తున్న వికృత చేష్టలకు
నీకు కంపరం వచ్చినట్లు భూకంపాలు వస్తున్నాయి!
నీ ఒంటి మీద కురుపులు లాంటి
అగ్నిపర్వతాలు పేలి చీము లాంటి లావా బయటికి వస్తుంది!
నీ రక్తమైన చమురు, మాంసమైన ఖనిజాల కోసమని
యంత్రాలతో పొడిచేసరికి నీ ఒళ్లంతా తూట్లు పడిపోయాయి!
బిడ్డలం అని చెప్పుకోవడమే కానీ
నీ ఓర్పు, సహనం లాంటి గుణాలు
ఏమాత్రం ఒంటబట్టలేదు!
రోజురోజుకూ మా పాపాలు పెరిగిపోతున్నా
తల్లిగా నువ్వు మౌనంగా భరిస్తుంటే
నీ నిశ్శబ్ద కేకలు ప్రకృతి విలయతాండవాలుగా మారి
నీ బాధలు చెప్తుంటే కానీ
అర్ధం చేసుకోలేకపోయామమ్మ!
తప్పయిపోయింది. ఈ ఒక్కసారికి క్షమించమ్మ తల్లీ!!
***
అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం
హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన
ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.
ఐదు బహుమతులు గెలుచుకున్నాను.




Comments