పల్లె పిలిచింది - 53
- T. V. L. Gayathri

- Nov 2
- 3 min read
Updated: Nov 4
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #మత్తకోకిల

Palle Pilichindi - 53 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 02/11/2025
పల్లె పిలిచింది - 53 - తెలుగు కావ్యము చతుర్థాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
47.
వచనము.
ఇటుల కాలము సాగుచుండ,పెద్దలైన మల్లనార్యుడు మరియు గోవిందుడు ఒకరినొకరు సంప్రదించుకొని వాణితో వీరేశుని వివాహము జరుపుటకు నిశ్చయించిరి.
గ్రామములోని జనులెల్ల సంతసించి వివాహవేడుకలు సంబరంబుగా జరిపిరి.//
48.
తేటగీతి
సుందరుడగు వరుని సరిజోడు వాణి
ముగ్ధయౌ నా తరుణి గౌరి పోలికనుచు
పెద్దలెల్లరు దీవించ ప్రీతిమీర
వైభవంబుగ జరిగె వివాహమపుడు. //
తాత్పర్యము.
అందమైన వీరేశునికి వాణి చక్కని జోడి. ఆ సుందరాంగి సౌశీల్యంలో పార్వతీదేవిని పోలి ఉందని పెద్దలందరు ప్రేమగా దీవిస్తూ ఉండగా వివాహం వైభవంగా జరిగింది.//
49.
తేటగీతి.
వధువుకు తగిన ధీమణి వరుడు దొరికె
చెలిమికానితో పెండ్లికి సిగ్గుపడుచు
వరుని క్రీగంట గాంచెడి వాణిని గని
సఖులు మేలమాడ నెగసె సంబరములు.//
తాత్పర్యము.
వధువుకు తగిన వరుడు దొరికాడు. స్నేహితునితో వివాహం జరుగుతుంటే వాణి సిగ్గుపడుతూ ఉంటే ఆమె స్నేహితురాండ్రు పరిహాసాలాడుతూ ఉన్నారు.//
50.
ఉత్పలమాల.
జల్లిరి సేసలన్ జనులు చల్లని దీవెనలందచేయుచున్
బిల్లలు పెద్దలున్ గలిసి విందులతో గడుపంగ కాలమున్
మెల్లగ వీరుడౌ పతిని ప్రీతిగ గాంచుచు వాణి వచ్చెనా
మల్లయ గేహమందు కడు మన్నన జేయగ నత్తమామలన్.//
తాత్పర్యము.
పెద్దలు దీవించారు. అందరూ విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ప్రేమగా భర్తను చూస్తూ వాణి మల్లనార్యుని ఇంటికి వచ్చింది.ఆమె ఎల్లప్పుడూ అత్తమామలను చాలా గౌరవిస్తూ ఉంటుంది.//
51.
మత్తకోకిల.
పాలుమాలిక చూపదెన్నడు భక్తిశ్రద్ధల తోడుతన్
వేళ తప్పక సేవ చేయుచు పెద్దలందరి చాటునన్
బాల వాణి గృహంబునన్ దన బాధ్యతల్ నెరవేర్చుచున్
శీలసంపద కల్గి తృప్తిగ చిల్కు చుండును నవ్వులన్.//
తాత్పర్యము.
ఆ వాణి ఎప్పుడూ బద్ధకం చూపదు. పెద్దవాళ్ళను గౌరవిస్తూ ఆ గృహంలో సంతోషంగా బాధ్యతలను చేస్తూ ఉంది.//
52.
తేటగీతి.
మాతృభూమిని ప్రాజ్ఞులు మరువరెపుడు
మన్ను ఋణమును దీర్చుటే మనుజతతికి
విధిగ తల్చతథ్యంబుగ విజయలక్ష్మి
వేల్పుటావుగ నడుచును వెనుక ముందు.//
తాత్పర్యము.
బుద్ధి మంతులు మాతృభూమిని మరచిపోరు. మన దేశము యొక్క ఋణము తీర్చే వారికి కామధేనువు వలె విజయము ఎప్పుడూ తోడుగా ఉంటుంది.//
53.
వచనము.
ఇట్లు పిన్నలు, పెద్దలు సంతసంబుగా కాలము గడుపుచుండగా హైమకును, శ్రీనివాసుకు కలిగె నొక మగబిడ్డడు.గృహమున పౌత్రుడుదయించగా శ్రీకరుడు, శ్రీలతమ్మ పాపనికి జాతకకర్మలు నిర్వహించిరి.//
54.
తేటగీతి
శ్రీకరంబగు ముద్దుల శిశువు కలిగె
హైమకును శ్రీనివాసున కధికమైన
ముదముఁ గూర్చుచు నుండెనా ముద్దుబిడ్డ
శ్రీలతమ్మను మురిపించె చిఱుత నగవు.//
తాత్పర్యము.
ఆ ముద్దుల శిశువును చూసుకుంటూ పెద్ద వాళ్ళందరూ సంతోషిస్తున్నారు.//
55.
తేటగీతి.
పౌత్రుని గనుచు తాతలు పరవశించ
బాలచంద్రుడై బాలుండు వర్థిలంగ
దీవెనలు కురిపించిరా దివిజ వరులు
చిన్న పాపని నగవులే సిరులు కదర!//
తాత్పర్యము.
మనుమణ్ణి చూస్తూ తాతలు మురిసి పోతున్నారు. దేవతలు దీవెనలతో ఆ చిన్ని బిడ్డ బాలచంద్రుని వలె పెరుగు తున్నాడు. చిన్న పిల్లల నవ్వులే సిరులు కదా మనకు!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:




Comments