top of page

పల్లె పిలిచింది - 24

Updated: Jun 30

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #పంక్తి

ree

Palle Pilichindi - 24 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 26/06/2025

పల్లె పిలిచింది - 24 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



33.

తేటగీతి.


సుంత గోవిందుడు పలుకు సూక్తులు విని

పట్టణంబున చదువుకో వలయుననుచు 

చిన్నవాడగు వీరుండు చెడునడతను 

వీడుచుండి తా మెల్గెను విబుధమతిగ//


తాత్పర్యము.


గోవిందుడు చెప్పే మంచి మాటలు విని చిన్నవాడగు వీరేశునిలో మార్పు మొదలయింది. చెడు స్నేహాలు వీడాలని అనుకున్నాడు.//


34.

తేటగీతి.


పట్టణంబున చదువుకు పైకమిపుడు 

పెరిగి పోవగా సమయము జరుగుటెట్లు?

ధనము తరిగిన మిత్రులు తప్పుకొనుచు 

నెడముగా జూడ నా బాధ నెఱుగ రెవరు.//


తాత్పర్యము.


పట్టణములో చదువుకోవాలంటే ఎక్కువ డబ్బు కావాలి. స్నేహితులతో తిరిగితే ఎలాగా? డబ్బు లేకపోతే చెడ్డ మిత్రులు ముఖం కూడా చూడరు.//


35.

తేటగీతి 

ఇటుల శోచించి వీరుండు నెఱుకతోడ 

దురిత మతులగు మిత్రుల చరితగనుచు 

వారి నెయ్యంబు వీడుచు వాంఛితముగ 

మసలుకొనుచు పెద్దల పైన మమతజూపె.//


తాత్పర్యము.

ఇలా ఆలోచించి వీరేశుడు చెడ్డ స్నేహితులకు దూరంగా ఉంటూ పెద్దవాళ్ళను ప్రేమగా గౌరవించటం నేర్చుకున్నాడు.//


36.

పంక్తి.

భ. భ. భ. గ.

యతి -7.


హైమయు చిత్రయు నాప్తులుగన్ 

నీమముగాచని నిష్ఠగ వే 

జాములు గంటలు సమ్మతిగన్ 

ప్రేమగ నేర్చిరి విద్యలటన్.//


తాత్పర్యము.

హైమ, చిత్ర ఎంతో స్నేహంగా ఉంటూ, చాలా శ్రద్ధగా గంటలు గంటలు చదువుతూ గడిపారు.//


37.

తేటగీతి.


శ్రీనివాసవికాసులు చెలిమితోడ 

సర్వవిద్యలు నేర్చిరి సమధికముగ

పట్టణంబున తమ కీర్తి పరిఢవిల్ల 

మెల్గుచుండిరా ఛాత్రులు మేలు పొంద.//


తాత్పర్యము.


శ్రీనివాసుడు, వికాసుడు కూడా చక్కగా చదువులన్నిటిలో ముందుండి మంచి పేరు తెచ్చుకున్నారు.//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page