నచికేతుడు
- Pratap Ch
- Jun 26
- 2 min read
#Ch.Pratap, #నచికేతుడు, #Nachikethudu, #TeluguDevotionalArticle

Nachikethudu - New Telugu Article Written By Ch. Pratap
Published In manatelugukathalu.com On 26/06/2025
నచికేతుడు - తెలుగు వ్యాసం
రచన: Ch. ప్రతాప్
నచికేతుడు కథ కఠోపనిషత్‌లోని అత్యంత ప్రబోధాత్మకమైన ఉపాఖ్యానం. బాలుడే అయినా, అతనిలో ఉండే ధైర్యం, ధర్మజిజ్ఞాస, జీవన పరమార్థంపై చింతన అతన్ని అసాధారణ వ్యక్తిగా తీర్చిదిద్దాయి. తండ్రి వజశ్రవసుడు యజ్ఞంలో తనను దానం చేయగానే, "నన్ను ఎవరికి ఇస్తావు?" అని నిలదీసి, చివరకు యమధర్ముని లోకానికి వెళ్లడం అతని ధైర్యాన్ని సూచిస్తుంది. అక్కడ యముడు నచికేతుడిని అనేక పరీక్షలకు లోను చేసి, చివరకు అతని అర్హతను గుర్తించి బ్రహ్మవిద్యను బోధిస్తాడు.యావత్ మానవాళికి ఈ ఉదంతం ఒక ఆదర్సంగా నిలుస్తుంది.
యమధర్మరాజు అంటే సాధారణంగా భయానికి ప్రతీక. ఎందుకంటే ఆయనే మరణదేవుడు, కర్మానుసారం నిష్పక్షపాతంగా శిక్ష విధించే న్యాయాధికారి. కానీ యముడు కేవలం శిక్షాపురుషుడే కాక, ధర్మానికి, న్యాయానికి నిలువెత్తు రూపం. నచికేతుడి ప్రశ్నలను ఆయన నిర్లక్ష్యం చేయలేదు. నిత్యము-అనిత్యము, ఆత్మ-శరీర భేదం, మోక్ష సాధన వంటి గాఢమైన అంశాలపై అతనికి జ్ఞానాన్ని బోధించాడు.
నచికేతుడు స్థిరమైన మనస్సు, ప్రశ్నించే స్వభావం, తన నిర్ణయాలపై నమ్మకంతో ఒక అద్భుతమైన శిష్యునిగా నిలిచాడు. "సస్యమివ మర్త్యః పచ్యతే, స యమివాజాయతే పునః" అన్న శ్లోకం ద్వారా – మనిషి సస్యంలా నశించి మళ్లీ పుట్టుతాడని యముడు చెప్పిన తత్త్వం, నిత్యజీవితంపై మన దృష్టిని మార్చుతుంది. జీవితం శాశ్వతం కాదు. మరణం అనివార్యం. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరణం మానవ జీవచక్రంలో ఒక సాధారణ దశ మాత్రమే.
ధర్మరాజ దశమి నాడు నచికేతుడి కథను వినడం వల్ల మరణ భయం తొలగుతుందని విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈ కథ మనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధర్మపరంగా జీవించాలన్న సంకల్పాన్ని పెంచుతుంది.
నచికేతుడు మనకు ఒక ప్రేరణాత్మక పాత్ర అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అతని వయస్సు చిన్నదైనా, ఆలోచనలు విశాలమైనవి. అతని ప్రశ్నలు మౌలికమైనవి. అతని ధైర్యం ప్రశంసనీయమైనది. జీవిత పరమార్థాన్ని, నిజమైన ధర్మాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి నచికేతుడు ఒక మార్గదర్శకుడు. సత్యానికి అడుగులు వేసిన ప్రతి అడుగుకీ అతని కథ స్పూర్తిదాయకంగా నిలుస్తుంది
నచికేతుడు చిన్నవాడైనప్పటికీ, అతని కథ ద్వారా వినిపించే సందేశం – జీవితానికీ, మానవతకు, ధర్మానికీ అద్దం పడుతుంది.
***
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.
コメント