top of page

పల్లె పిలిచింది - 35

Updated: Aug 7

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #కందం

ree

Palle Pilichindi - 35 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 05/08/2025

పల్లె పిలిచింది - 35 - తెలుగు కావ్యము తృతీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


వీరేశుడు వనములను కూల్చెడి దుర్మతులకు మంచిని బోధ చేయుట


12.

తేటగీతి.


వరద ముప్పును తొలగించు వనములెల్ల

వర్షధారను కురిపించి వాయు వొసగి 

జీవజాలము కెల్లను చేవనిడుచు 

భువిని స్వర్గంబుగా జేసి జవము నిలుపు.//


తాత్పర్యము.


ఈ అరణ్యాల వలన వరదలు తగ్గుతాయి. వర్షం కురుస్తుంది. మంచిగా చల్లని గాలి వీస్తుంది. అడవులు జీవాన్ని నింపుతూ భూమిని స్వర్గంగా మారుస్తాయి.//


13.

తేటగీతి.


ఔషధంబుల కోసమీ యుర్వియందు 

వృక్షజాతిని బెంచిన విరివిగాను 

జనుల కుపయోగ పడుచుండి సంపదలిడు 

చెట్లు విలసిల్ల పృథ్విపై సిరులు పండు.//


తాత్పర్యము.


చెట్లను పెంచితే ఎన్నోఆయుర్వేద ఔషధాలను తయారు చేసుకోవచ్చు!జనులకు ఎల్లప్పుడూ సంపదల నిస్తాయి.//


14.

తేటగీతి.


వనములన్ గాల్చి ధరలోన భవనరాశి 

కట్టుచుండుట వలననీ కాలమందు 

పొగలు క్రక్కుచు భూమాత భుగభుగయని 

మండుచుండగా జీవుల మనుగడెట్లు?//


తాత్పర్యము.


వనములను కాల్చి వేసి కాంక్రీటు భవనాలు కట్టడం వలన భూమి మీద వేడి పెరిగి పోతుంది. ఇలా  భూమి పొగలు గక్కుతూ ఉంటే ప్రాణులు ఎలా జీవిస్తాయి?//


15.

తేటగీతి.


బ్రతుక జాలక యాశను పణము పెట్టి 

జీవమంతయు నశియింప జీర్ణ దశకు 

చేరుకొనుచుండగా  జనుల్ దారి వెదకి 

మొక్కలను బెంచి పోషింప పుడమి మిగులు!//


తాత్పర్యము.


ఇప్పటికే జీవరాశికి నశించిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయాన జనులందరూ మంచిమార్గమును వెదకి చెట్లను పెంచితే ఈ భూమి మిగులుతుంది.//


16.

తేటగీతి.


తినుటకాహార మొసగెడి దివ్యమైన

ఫలములందించు వృక్షాలఁ వరుస బెట్టి 

నాటు చుండిన మన జాతి నవ్యగతిని 

పయనమగుచుండు వైళమ ప్రగతి పథిని.//


తాత్పర్యము.


జీవులన్నిటికీ ఆహారమైన మంచి పండ్లను ఇచ్చే చెట్లను వరసగా నాటుతూ ఉంటే మన మానవజాతి వేగంగా ప్రగతి బాటలో పయనిస్తుంది.//


17.

తేటగీతి.


మాట వినరండి !చెలులార!మనసుపెట్టి!

పాదపంబులఁ బ్రేమింప వలయు నెపుడు 

పచ్చదన మొక వస్త్రమై పరుచుకొనగ

వింత శోభతో నీధర వెలుగు చుండు.//


తాత్పర్యము.


ఓ మిత్రులారా!నా మాట వినండి!ఎప్పుడూ చెట్లను ప్రేమించండి!పచ్చదనము అంతటా  పరుచుకుంటే ఈ భూమికి చీర కట్టినట్లుగా ఉండి ఎంతో అందంగా మెరుస్తూ ఉంటుంది.//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page