top of page

పల్లె పిలిచింది - 29

Updated: Jul 13

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

ree

Palle Pilichindi - 29 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 12/07/2025

పల్లె పిలిచింది - 29 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


58.

తేటగీతి.


కట్నకాన్కల కాలంబు కరిగిపోయె 

ప్రేమ కల్గిన చాలునీ పృథ్వి పైన 

జీవితంబులు నిల్చును చింత కనక 

ధర్మగతిలోన నడుచుటే ధనము మాకు.//


తాత్పర్యము.


కట్నాలు, కానుకలు తీసికొనే కాలం ఇప్పుడు లేదు. ప్రేమ ఉంటే చాలు జీవితాలు చక్కగా గడిచిపోతాయి. మాకిద్దరికీ ధనము మీద కంటే ధర్మంగా నడవటమే ఇష్టము.//


59.

తేటగీతి.


తల్లి!నీ విట్లు పల్కుట ధర్మమౌన?

పసిడి కొండలన్ మించిన వైద్యవృత్తిఁ

గౌరవంబుగ సల్పుచు గ్రామ ప్రజల 

బాగుకోరుచు సాగెడు బాట మేలు.//


తాత్పర్యము.


తల్లీ!నీవిట్లా చెప్పటం ధర్మమౌతుందా? ధనరాసులను సంపాదించటం కంటే గౌరవంగా పల్లెలో వైద్యవృత్తిని చేస్తూ ప్రజల బాగు కోరుకోవటం  చాలా ఉత్తమం.//


60.

కందం.


తలచను ధనమును కలలో 

నిలుతును గ్రామమున సేవ నిష్ఠగ సలుపన్ 

వలచితి హైమను మదిలో 

చెలిమిని విడువక జరింతు జీవనమందున్ ".//


తాత్పర్యము.


నేను కలలో కూడా డబ్బు గురించి ఆలోచించను. గ్రామంలోనే ఉంటాను. నన్ను ప్రేమించిన హైమను వదిలి పెట్టను. ఇలాగే జీవితాంతం ఉంటాను."//



61.

తేటగీతి.


సుతుని పల్కుల నాలించి చోద్యమనుచు 

భర్త కడకేగి శ్రీలత బాధనొంద

శ్రీకరుండు నగుచు తాను జేరఁ దీసి 

పత్ని నూరడించుచు నిట్లు బదులు పలికె.//


తాత్పర్యము.


ఇలా పలికిన కుమారుని మాటలను విని శ్రీలతమ్మ బాధపడి భర్తతో చెప్పుకుంది. శ్రీకరుడు నవ్వుతూ భార్యను దగ్గరకు తీసికొని, ఆమెను ఊరడిస్తూ ఇలా పలికాడు.//


(సశేషం)


ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page