పల్లె పిలిచింది - 28
- T. V. L. Gayathri
- Jul 9
- 2 min read
Updated: Jul 12
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

Palle Pilichindi - 28 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 09/07/2025
పల్లె పిలిచింది - 28 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
54.
తేటగీతి.
హైమ నెయ్యమున్ వీడుము!హాని తెచ్చు
పనులు చేయకు పుత్రుడా పసిడికొండ!
కట్నకాన్కలు తెచ్చెడి కలికి తోడ
పెండ్లి చేసెద మయ్యరో ప్రియము మీర!//
తాత్పర్యము.
బంగారుకొండా!ఆ హైమతో స్నేహం మానుకో!నీకు హాని తెచ్చి పెట్టే పనులు చేయకు!చక్కగా కట్నకానుకలు తెచ్చే అమ్మాయితో నీకు పెళ్లి చేస్తాము!"
55.
తేటగీతి.
ఇట్లు పల్కిన తల్లితో నిరవుగాను
శ్రీనివాసుడు బదులిడె చెంతచేరి
ధనము కోర్కెలు తీర్చునీ ధరణి యందు
ధర్మమొక్కటే సత్యమౌ దారిచూపు!//
తాత్పర్యము.
ఇట్లా పలికిన తల్లితో నెమ్మదిగా శ్రీనివాసుడు ఈ విధంగా బదులు చెప్పాడు.
"ఈ భూమిలో ధనము ఒక్కటే కోర్కెలు తీర్చుతుందా? ధర్మము మాత్రమే మనకు నిజమైన దారి చూపుతుంది.//
56.
తేటగీతి.
ఇహపరంబులఁ వెలిగించి యీశుఁ జేర్చు
ధర్మమార్గమున్ వీడుట తప్పు తప్పు!
పరుల మేలుకై నిత్యము పరితపించు
జన్మలన్ గోరగవలయు జనులు సతము.//
తాత్పర్యము.
ఇహానికి,పరానికి వెలుగునిచ్చి ఆ పరమేశ్వరుడిని చేర్చెడి ధర్మమార్గమును వీడుట చాలా తప్పు!పరుల మేలు కోరుతూ ఉండే జన్మలు కావాలని మనుజులు కోరుకోవాలి!//
57.
తేటగీతి.
వలచి యుంటిని హైమను పత్ని వలెను
పసిడి రాసులన్ మించిన ప్రతిభ కలదు
విలువ లెన్నియో కలిగిన వెలది యామె
ప్రేమ చూపించు తరుణి యీ పృథ్విఁగలదె?//
తాత్పర్యము.
నేను హైమను ప్రేమించాను. భార్యగా భావిస్తున్నాను. ఎన్నో ధనరాసుల కంటే హైమలో ఎంతో ప్రతిభ ఉంది. విలువలు ఎన్నో ఉన్నాయి. నా మీద ప్రేమ చూపించు మంచి పిల్ల. అటువంటి అమ్మాయి ఈ భూమ్మీద దొరుకుతుందా? //
(తరువాతి భాగంతో అన్వయం )

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments