top of page

పల్లె పిలిచింది - 26

Updated: 1 day ago

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #ద్విరదగతిరగడ, #కందం

Palle Pilichindi - 26 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 02/07/2025

పల్లె పిలిచింది - 26 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


45.

ద్విరదగతిరగడ 


జనమధికమై పోవ శైలముల కూల్చగన్ 

వనములను కాల్చగన్ భవనాలు కట్టగన్ 


నగరాలు నిర్మించ నలుసంత చోటెచట?

పగలు రేయనక పడు బాధలకు సెలవెచట?


వాన కురిసిన చాలు వరదలో మున్గగన్ 

ప్రాణములు కడబట్టి ప్రజలు భయమొందగన్ 


నీటి కష్టములతో నిత్య సంఘర్షణము 

కాటు వేయ రుజములు కలత చెందెడి జనము 


నగర జీవనమిట్లు నరకప్రాయంబాయె 

దిగులొందిన జనులకు దిక్కు తోచక పోయె 


చెట్టు చేమను పెంచి చింతలను తొలగించ 

కట్టుబాటును కలిగి కలిమితో జీవించ 


పల్లె జీవన మిపుడు బంగారు స్వప్నమై 

చల్లంగ నీ జాతి సాగునే దివ్యమై 


పోవలెను పల్లెలకు భోగములు కల్గునట 

జీవనము మెరుగౌను  చింతమర పించునట //


భావము సులభంగా ఉంది.//


46.

తేటగీతి.


అధికమౌ జనవాహిని యదుపుతప్పి 

పట్టణంబుల నివసించ బరువు పెరిగె 

కలత చెందిన భూమాత కనలుచుండ 

పౌరులివ్విధి బాధలు పడుచునుంద్రు.//


తాత్పర్యము.


పల్లెలు వదిలి ప్రజలు పట్టణాలకు వలస వస్తున్నారు.పట్టణాల్లో జనాభా పెరిగి పోవటం వలన ఇలాటి సమస్యలు వస్తున్నాయి. దానితో ప్రజలు బాధపడుతున్నారు.//


47

తేటగీతి.


విద్య లుద్యోగముల్ చూపి వివిధగతుల 

పల్లెటూర్లకు కలిగించ వసతులెల్ల

వలస పౌరులు మరలంగ పల్లె వెలుగు 

పెరుగు చుండును భవ్యమౌ వృద్ధి సతము.//


తాత్పర్యము.


విద్య, ఉద్యోగ సౌకర్యాలను పల్లెటూర్లలో పెరిగితే వలస వచ్చిన వాళ్ళు పల్లెలకు మరలి వెళితే దేశములో చక్కని ప్రగతి కలుగుతుంది.//



48.

కందం.


పదివర్షంబులు గడిచెను 

సదమల హృదితోడ యువత చదువగ శ్రద్ధన్ 

బదిలంబుగ మళ్ళిరి కడు 

ముదమొందుచు పల్లెటూరి ముంగిట వ్రాలన్.//


తాత్పర్యము.


ఇలా పది సంవత్సరాలు గడిచాయి. పిల్లలు అందరూ చదువులు పూర్తి చేసుకొని తమ పల్లెకు బయలుదేరారు.//


49.

కందం.


తలిదండ్రులఁ గాంచిన తఱి 

పులకించిన బిడ్డ లపుడు ముచ్చటలాడన్ 

దిలకించిరంత పెద్దలు 

వెలుగొందెడి కనుల తోడ బిడ్డలమోముల్.//


తాత్పర్యము.


తల్లిదండ్రులను చూచి పిల్లలు సంతోషంతో ముచ్చటలు చెబుతున్నారు. పిల్లల్ని చూచి పెద్దలు కూడా ఎంతో సంతోషాన్ని పొందారు.//



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page