పల్లె పిలిచింది - 27
- T. V. L. Gayathri
- Jul 7
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #వసుపదమంజరి

Palle Pilichindi - 27 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 07/07/2025
పల్లె పిలిచింది - 27 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
50.
తేటగీతి.
పల్లెయందు వీరేశుడు ప్రతిభ జూపి
పొలము కడకేగి దున్నెను హలముపట్టి
మల్లనార్యుడు హర్షించి మమత తోడ
తనసుతుని వెంట నడిచెను ధైర్యమీయ.//
తాత్పర్యము.
పల్లెలో వీరేశుడు ప్రతిభతో పోలము దున్ని సేద్యము చేయటానికి రావటం చూచి మల్లనార్యుడు ఎంతో సంతోషంతో కొడుకుకు ధైర్యమీయగా వెంటకదిలాడు.//
51.
వసుపదమంజరి.
గణములు -న. జ. భ. జ. జ. ర.
యతి -13.
చెలిమిగ శ్రీనివాసుడును హైమ స్థిరంబుగా వెసన్
గలిమిని మించి కీర్తిబడయంగ కఠోర దీక్షతోన్
విలువగు సేవగన్ దలచి సీమఁ విశాలమౌ మదిన్
నిలకడతోడ వైద్యులుగ సాగ నివాసులైరటన్ //
తాత్పర్యము.
శ్రీనివాసుడు, హైమ వైద్యులుగా పల్లె ప్రజలకు సేవచేయటం మొదలు పెట్టారు.వాళ్ళు ఎంతో విశాలహృదయాలతో పల్లె కోసం అక్కడే నివసించారు.//
52.
తేటగీతి.
శ్రీనివాసుని తల్లి యా శ్రీలతమ్మ
కినుక వహియించె సుతునిపై ధనము కోరి
"పనికి మాలిన యట్లుండి పల్లెయందు
వైద్యవృత్తిని సలుపంగ పరువుకాదు!//
తాత్పర్యము.
శ్రీనివాసుని తల్లి శ్రీలతమ్మకు ఇది నచ్చలేదు. ఆమెకు కొడుకు మీద కోపం వచ్చింది.ఆమె కుమారునితో "పనికిమాలిన వాడిలాగా పల్లెలో ఎందుకు ఉంటావు?మన పరువు ఏమవుతుంది?//
53.
తేటగీతి.
లోకరీతికి భిన్నమౌ లుప్తమైన
బుద్ధితో నీవు మెల్గగ పొసగుటెట్లు?
ఘనుడ వీవని తల్చుట కర్మ కర్మ!
మరలి పొమ్మిక పట్టణమార్గమునకు!//
తాత్పర్యము.
లోకంలో ఇలా ఎవ్వరూ ఉండరు. బుద్ధిలేకుండా నువ్వు మెలుగుతుంటే ఎలాగా? నువ్వేదో గొప్పవాడవని అనుకున్నాను. ఖర్మ!ఖర్మ!వెంటనే పట్టణానికి వెళ్ళిపో!//
(తరువాతి భాగముతో అన్వయం)
(సశేషం)

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments