ఆహ్వానం 2026
- Yasoda Gottiparthi

- 1 day ago
- 1 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఆహ్వానం2026, #Ahvanam2026

Ahvanam 2026 - New Telugu Poem Written By Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 02/01/2026
ఆహ్వానం 2026 - తెలుగు కవిత
రచన: యశోద గొట్టిపర్తి
చిరకాల చీకట్లను చీల్చుకునే
చివరి దీపం వెలుగుమా 2025
నా ఆశలన్నీ అరుదుగా నీచుట్టే ముసిరి పూర్వానికి స్వస్తి, నూతనానికి స్వేచ్ఛగా స్వాగతం 2026
నవోదయ కాంతిలో నవీన సంవత్సరం
నవరాగాల పల్లకిలో ఊరేగుతూ రావడం
నాటి ఆనందాలు మరు నాటికీ మకరందాలవడం
దాటిపోవద్దు దారి మారద్దు
దరి చేరిన ఆశల దీపాలు వెలిగించాలి నూతన వెలుగులా ప్రకాశించాలి
న్యూ ఇయర్ సంబరాల కేరింతలు ప్రపంచమంతా మారు మ్రోగుతూ
పాతకు కృతజ్ఞతలు తెలుపుతూ
కొత్త లక్ష్యాలకు నాంది పలుకుతూ పాత జ్ఞాపకాలకు స్వస్తి చెప్పుతూ సరిదిద్దుకొనే చక్కటి మార్గంలో నడవాలని పొరపాట్లను తలుచుకుని తడబాట్లను
తరిమికొట్టి కడగండ్లను
కడిగివేసి కొత్త ఆశలను మొలకెత్తించే
శ్రమ తోడుగా సాంకేతికత
పాతను విడిపోతూ ధైర్యంతో అడుగులు వేస్తూ
కొత్తదనంతో కలలు కంటూ
శాంతి పెంపొందించాలంటూ
సాంకేతికత సౌఖ్యంలో
సకలం
***

-యశోద గొట్టిపర్తి




Comments