సూక్తులు
- Eruvanti Naga Durga Madhuri Devi

- Feb 18
- 2 min read
#Nagini, #నాగిని, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Sukthulu - New Telugu Poem Written By Nagini
Published in manatelugukathalu.com on 18/02/2026
సూక్తులు - తెలుగు కవిత
రచన: నాగిని
సైనికులకు ప్రణతి గౌరవంబు నీయవలయు సతము
మానకుండ రైతుకైన మమతనీయ వలయు సతము
సమసమాజమునకు సేవ చేయు వారు బంధువులుర!
వేనవేల వందనములు ప్రేమనీయవలయు సతము
కాసులెట్లు బరువు నవియు లేక కాచ లేము బ్రతుకు!
మోసపోయినట్లె నమ్మి లేమి కాచ లేము బ్రతుకు!
మనుగడుకవిమూలమనుౘు మనుజులార! నడువ వలయు
వీసమెత్తు గాదు విత్తు లేక కాచ లేము బ్రతుకు!
పూజ వ్యర్థమనక భక్తి శ్రద్ధ యున్న మేలు కలుగు!
జాజి మల్లె మాల సౌరభములు యున్న మేలు కలుగు!
నిత్య కర్మలివిర నిర్మలమగు మనసు సాధనములు!
వ్యాజనింద నుతుల తోడ స్తవములున్న మేలు కలుగు!

Viswa Santhi - New Telugu Poem Written By Nagini
Published in manatelugukathalu.com on 17/02/2026
విశ్వశాంతి - తెలుగు కవిత
రచన: నాగిని
విశ్వమంతయు నిండిన వైరి గురఘురాముడు నడయాడిన పుడమిన
ఆలుమగల బంధము అంతమాయె!
ప్రళయకాలమందైన నిలచు కాశి లోన
పండిత వర్గమిక్కట్ల పాలయ్యె
ఉమ్మడి కుటుంబాల ఔన్నత్యం
ఓరిమి కరవై యొరిగి పోయె!
రైతు పాదం రామ పాదం అన్న ౘోట
కర్షకుడు కొలిమిలో దూకుౘుండె
ౘుట్టు ప్రక్కలా తగాదాలు
ౘుట్టాలతోటీ పోరాటాలు
శాస్త్రవేత్తల జ్ఞానమునకు మెౘ్చుకోలు లేదు!
భావి తరమునకు జ్ఞాన బోధ కుదరదు!
భరత వేదమున లేని దురాచారాలు
మన భరతమును పట్టుౘుండె!ణము
శాంతి నాశనము చేసి సంతు ద్రుంచె
ఏమి చేయవలయు వీని నిలువరింౘ!
ఏటికెదురు నడుౘు తెగువ వలయు!
==============================

Nava Rathnalu - New Telugu Poem Written By Nagini
Published in manatelugukathalu.com on 13/02/2026
నవ రత్నాలు - తెలుగు కవిత
రచన: నాగిని
హారతి గొనుమమ్మ వాణి! బ్రహ్మ పత్ని! రక్షనీవె
చేరదీయమనవి నన్ను! విష్ణు పత్ని! రక్షనీవె!
ప్రార్థనిదియె మువ్వురమ్మలకు ప్రణామమిడెద మదిని
భారమంత దింప రావె! రుద్ర పత్ని! రక్ష నీవె.
ఆదిభిక్షువయ్య నీవు ఆదుకొనవ నీవె దిక్కు
నాదు మొరల వినుమ బ్రహ్మ! చేదుకొనవ నీవె దిక్కు
మాటరానిదాననన్ను మన్ననగను గనుమ విడక
వేదనలను వినుమ విష్ణు!దరికి కొనవ! నీవె దిక్కు.
కష్టములను దీయు సుముఖ! నీకు భక్తి వందనములు.
నష్టమంటనీయవయ శరవణ! నీకు భక్తి వందనములు.
వేరు రీతి గొల్వలేని జ్ఞానశూన్యనయ్య నేను!
యిష్టదైవమైన హనుఁమ! నీకు భక్తి వందనములు//
***
నాగిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు: ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి
కలము పేరు: నాగిని
ఊరు: హైదరాబాద్
వృత్తి: సాఫ్ట్వేర్ రంగము
పరిచయ వాక్యాలు: వృత్తి ఇష్టమైన సాఫ్ట్వేర్ రంగము, ప్రవృత్తి ప్రాణప్రదమైన పద్య సాహిత్యము, ఇతర ప్రక్రియలలైన కథలు, నానీలు, కవితలు, పరిమిత సంఖ్యలో గౙల్స్ రచనలు.




Comments