పల్లె పిలిచింది - 32
- T. V. L. Gayathri
- Jul 23
- 2 min read
Updated: Jul 31
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #కందం

Palle Pilichindi - 32 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 23/07/2025
పల్లె పిలిచింది - 32 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
70.
కందము.
వండిరి భక్ష్యములెన్నో
దండిగ భోజ్యములఁ జేసి దాలిమి తోడన్
గుండిగ లందున సర్దిరి
పెండిలి వేళకు మురియుచు విందులు సేయన్.//
తాత్పర్యము.
పెళ్లివాళ్ళు చాలా రకాలైన పిండివంటలను చేసి గుండిగల్లో (పెద్ద పెద్ద గిన్నెల్లో )సర్ది విందుకు సిద్ధం చేశారు.//
71.
తేటగీతి.
ఇరుకుటుంబము లివ్విధి హృష్టిమెయిని
మంగళంబుగ చెలిమితో మసలుచుండ
వరుడు వధువుకొసంగెను పసిడి నగలు
వధువు తండ్రి తాన్ వరునకు వస్త్రములిడె.//
తాత్పర్యము.
ఈ విధంగా రెండు కుటుంబాలవాళ్ళు సంతోషంతో స్నేహంగా ఉండగా సంప్రదాయము ననుసరించి వరుడు వధువుకు బంగారు నగల నీయగా, వధువు తండ్రి వరునికి వస్త్రములను చదివించాడు.//
72.
కందం.
కట్టెను మంగళ సూత్రముఁ
జుట్టును మ్రోగంగ నచట సుమధుర రవముల్
పట్టెను వధువుకరంబును
గట్టిగ వరుడు కురిపించి గాఢపు వలపుల్ //
తాత్పర్యము.
చుట్టూ మంగళవాయిద్యములు మ్రోగుచూ ఉండగా వరుడు వధువు మెడలో మంగళసూత్రమును కట్టాడు. వధువు చేతిని ప్రేమతో పట్టుకొన్నాడు. (పాణిగ్రహణం ).//
73.
కందం.
గణగణ మ్రోగెను గంటలు
చెణుకులతో పౌరులెల్ల చిందులు వేయన్
గుణవతియగునా హైమను
ప్రణయముతో శ్రీనివాసు పరిణయమాడెన్.//
తాత్పర్యము.
ఆ సమయంలో దేవాలయంలోని గంటలు గణగణమని మ్రోగాయి. జనులంతా పరిహాసాలు ఆడుకొంటున్నారు. గుణవంతురాలైన హైమను శ్రీనివాసుడు ప్రేమతో వివాహం చేసుకున్నాడు.//
'పల్లె పిలిచింది'కావ్యములోని ద్వితీయాశ్వాసము సమాప్తము.
తరువాతి భాగములో 'పల్లె పిలిచింది' కావ్యములో తృతీయాశ్వాసము ప్రారంభమవుతుంది.

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments