పల్లె పిలిచింది - 30
- T. V. L. Gayathri
- Jul 19
- 2 min read
Updated: Jul 21
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

Palle Pilichindi - 30 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 19/07/2025
పల్లె పిలిచింది - 30 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
62.
తేటగీతి.
"సంపదల్ గృహ సీమలో శాంతి నిడున?
కొడుకు కోడలు మనమీద కూర్మి చూపి
మసలు కొన్నచో నిల్చును మమత లెపుడు
తెలిసికొనుము సత్యంబును తెలివి కలిగి. //
తాత్పర్యము.
ధనము వలన ఇంటిలో శాంతి వస్తుందా? కొడుకు, కోడలు మనల్ని ప్రేమతో చూసుకుంటే చాలు!ఈ నిజాన్ని తెలిసికోవాలి. //
63.
తేటగీతి.
కట్న కాన్కలు తెచ్చును కలత లింట
స్నేహపూరిత మైనట్టి చిత్తమలర
హైమ పెద్దలన్ బ్రేమగ నాదరించు
లక్ష్మి వంటిదౌ బిడ్డపై లలిని చూపు!//
తాత్పర్యము.
కట్నకానుకలనేవి కలతలు తెస్తాయి. మనసులో స్నేహం ఉండాలి. హైమ చాలా మంచి పిల్ల. పెద్ద వాళ్ళని ప్రేమగా చూస్తుంది. లక్ష్మీదేవి వంటి బిడ్డ మీద ప్రేమ చూపించు!//
64.
తేటగీతి.
మూఢ మతితోడ మన మిట్లు ముచ్చిరుకొన
మంచి జరుగునా? కాలంబు మరలి పోవు
చిన్న బిడ్డల లాలించి చింత విడిచి
పెండ్లి చేయుద మమ్మరో వేడ్కమీర!"//
తాత్పర్యము.
మూర్ఖులమయి మనము ఇలా తగవులాడుకోవటం వలన మంచి జరుగుతుందా? కాలము గడుస్తుంది. చిన్నబిడ్డలను ప్రేమతో దగ్గరికి తీసికొని, వాళ్ళకు సంతోషంగా పెళ్లి చేద్దాము!" అనెను. //
65.
తేటగీతి.
భర్త పల్కుల నాలించి పత్ని యపుడు
"వల్లె!"యనుచుండి విముఖతఁ వదలి సుంత
మదిని నిలువరించుచు వీడి మకుఱు తనము
సుముఖముగ మాట లాడెను సుమతితోడ. //
తాత్పర్యము.
భర్త చెప్పింది విని శ్రీలతమ్మ" సరే!"అని మనసులో కాస్త సర్దుకొని, మొండితనము వీడి, సుమతితో (హైమ తల్లితో ) మాట్లాడింది. //
66.
తేటగీతి.
అరుణగిరి మిత్రునింటికి నాదరముగ
నరుగు దెంచ శ్రీకరుడు తనభిమతమ్ము
తేటతెల్లము చేయగా మాటకలిపి
పెద్ద తనము చూపి వినెనా పెండ్లికబురు. //
తాత్పర్యము.
అరుణగిరి శ్రీకరునింటికి వచ్చాడు. అప్పుడు శ్రీకరుడు పిల్లల పెళ్లి విషయము మాట్లాడి తమ సమ్మతిని తెలియపరిచాడు. //

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments