top of page

పల్లె పిలిచింది - 33

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #కందం

ree

Palle Pilichindi - 33 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 31/07/2025

పల్లె పిలిచింది - 33 - తెలుగు కావ్యము తృతీయాశ్వాసము ప్రారంభము.

రచన: T. V. L. గాయత్రి


గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


(*వసుధ యందు గ్రీష్మఋతువు*)

1.

కందము.

ఉక్కిరి బిక్కిరి యగుచును 

చిక్కిరి జనులెల్ల నుష్ణ స్వేదము తోడన్ 

నిక్కుచు గ్రీష్మము వచ్చెను 

వెక్కుచు నుండిరి శిశువులు వేదన కలుగన్.//

తాత్పర్యము.

ఎండాకాలం వచ్చింది.ఉక్కపోతవలన ప్రజలు బాధ పడుతున్నారు. చెమటలు కారిపోతున్నాయి. చిన్న బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు.//

2.

కందము.

భగభగ మండుచు భానుడు 

సెగలను పుట్టింప గాలి జివ్వున వీచెన్ 

మగువలు వంటలఁ జేయగ

వగచిరి వహ్నిఁ వెలిగించ భారము తోడన్.//

తాత్పర్యము.

సూర్యుడు భగభగ మండుతూ ఉంటే, వడగాలి రివ్వుమంటూ వీస్తోంది. మహిళలు ఆ వేడిమిలో వంట చేయటానికి జంకుతున్నారు.//

3.

కందము.

బావులలో నీరమెచట?

జీవులకేవిధిగ తీరు చింతలు వసుధన్ 

ద్రావగ జలములు కరువయె

కావగ రారే ప్రభువులు కష్టములందున్?//

తాత్పర్యము.

బావులలో నీరు లేదు. జీవరాశికి దిగులు ఎలా తీరుతుంది? త్రాగటానికి నీళ్లు లేవు. ఈ స్థితిలో ప్రజల కష్టాలు తీర్చటానికి పాలకులు వస్తారా? ( 'రారు 'అని భావము).//

4.

కందము.

వెలవెల బోయెను పల్లెలు 

నలుదిక్కుల నీటి కొఱకు నడిచిరి జనులా 

జలధారలు గాంచరకట!

కలతల మెయిఁ బౌరు లెల్ల గడిపిరి ఘడియల్.//

తాత్పర్యము.

కళకళలాడే పల్లెలు వెలవెలబోయాయి. ప్రజలు నీటి కోసం ఎంతో దూరం తిరుగుతున్నారు.నీళ్లు ఎక్కడా లేవు. దానితో ప్రజలు బాధపడుతూ కాలాన్ని గడుపుతున్నారు.//

5.

కందము.

అరయగ గ్రీష్మర్తువచట

కరువున మున్గిరి మనుజులు గాడ్పులు వీచన్ 

దెఱవెది?పసులును పుల్గులు 

వెరపున ద్రిమ్మరుచు నుండి విలవిలలాడెన్.//

తాత్పర్యము.

ఎండాకాలం వచ్చేసరికి కరువు వచ్చి పడింది. వడగాలి వీస్తూ ఉంది. ఇంకో మార్గం లేదు. మనుషులే కాదు ఆ ఎండకు పశువులు, పక్షులు కూడా భయంతో తిరుగుతున్నాయి.//

6.

కందము.

అగ్గగ్గ లాడె జీవులు 

తగ్గెను జవసత్త్వములునుదప్పికతోడన్

భగ్గున మండించుచు రవి

యగ్గివిధంబున జెలంగె నాకసమందున్//

తాత్పర్యము.

భీతి చెందిన ప్రాణులకు నీరసం వస్తోంది. దేహంలో శక్తి లేదు. సూర్యుడు మాత్రం ఆకాశంలో మండిపోతూ నిప్పులు చెరుగుతున్నాడు.//


(సశేషం)


ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page