top of page

పల్లె పిలిచింది - 36

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #కందం, తేటగీతి

ree

Palle Pilichindi - 36 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 07/08/2025

పల్లె పిలిచింది - 36 - తెలుగు కావ్యము తృతీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


18.

తేటగీతి.


వీరు డట్లు బోధలఁ జేయ వెకిలి నగవు 

తోడ దుర్మతుల్ మదియించి "తొలగిపొమ్ము!

పిల్ల కాకివి నీకింత బింకమేల?

పొగరు నీకేల పల్లెకు పొమ్ము బాల!//


తాత్పర్యము.


వీరేశుడు అలా మంచి మాటలు చెబుతూ ఉంటే ఆ చెడ్డవాళ్ళు అహంకారంతో"ఓ వీరా!నీవు ఇక్కడినుండి వెళ్లిపో!నువ్వు చిన్న పిల్ల వాడవు!పల్లెకు తిరిగి ఫో!నీకు ఇంత ధైర్యం ఎందుకు?//



19.

కందము.


వనములఁ గూల్చిన మేలుగ

ధనసంపదకల్గు వీర తత్తర పడకో!

ఘనమగు కలపను విపణిని 

కొనుగోలును జేయు చుంద్రు గొప్పగ జనులున్.//


తాత్పర్యము.


ఓ వీరా!కంగారు పడకు!అడవులను కూల్చితే డబ్బు చాలా వస్తుంది!మంచి కలపను జనులు ఎక్కువ రేటు పెట్టి కొంటూ ఉంటారు.//


20.

కందము.


దన్నుగ నడుతురు ప్రభువులు 

మన్నుకు కల్గదు విపత్తు మహిలో తరువుల్ 

పున్నెము నీయవు సుమ్మీ!

చిన్నవు నీకీ వయసున చిరుబురులేలా?//


తాత్పర్యము.


మాకు తోడుగా పాలకులు ఉన్నారు. అడవులను కొట్టి వేస్తే భూమికి ఏమీ కాదు!చెట్ల వల్ల పుణ్యం వస్తుందా? నువ్వు చిన్నవాడవు!అయినా నీకు ఇంత కోపం ఎందుకోయి?//


21.

కందము.


ఆడుచు నుండుము!పల్లెను 

వీడుము!నగరంపు దారిఁ వెడలుము బిడ్డా!

మోడుగ జేయుచు తరువులఁ 

వేడుకగా ధనముఁ బడసి వెళ్లెదమోయీ!//"


తాత్పర్యము.


వెళ్లి నీ స్నేహితులతో ఆడుకో!అసలు పల్లెను వదలి పెట్టి నగరానికి పొమ్ము!మా పాటికి మేము అడవులను నరుకుతూ డబ్బు సంపాదించుకుంటాము!"//


22.

తేటగీతి.


అట్లు గెగ్గలు చేసెడి యధముల గని 

"వల్లె!"యనుచు వీరేశుడు పాలకతతిఁ 

గలిసి వనచోర బృందపు కపటములను 

తెలుపుచుండ నా ప్రభువులు పలుకరైరి.//


తాత్పర్యము.


అలా అడవులను నరికే దొంగలు హేళన చేయగా, "సరే!"అని వీరేశుడు పాలకమండలి దగ్గరికి వెళ్లి కలప దొంగలపై ఫిర్యాదు చేశాడు. అయితే వీరేశుడు చెప్పింది విని పాలకమండలి సభ్యులు మొదట ఏమీ మాట్లాడలేదు.//


23.

తేటగీతి.


లంచముల్ తిని పెద్దలు లావుమీరి 

దుష్టమతులకు తోడుగా దొరలుచుండి 

గెంటి వేసిరా వీరుని గేలి చేసి 

పాపమా వీర పుత్రుడు వగచెనపుడు!//


తాత్పర్యము.


ప్రభువులు లంచములు తిని బాగా బలముతో ఉన్నారు. వీరేశుడు చెప్పింది వినకపోగా అతడిని గేలి చేస్తూ అక్కడి నుండి గెంటి వేయగా పాపం!ఆ వీరేశుడు చాలా బాధ పడ్డాడు.//



(సశేషం)


ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page