పల్లె పిలిచింది - 34
- T. V. L. Gayathri
- Aug 2
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #కందం

Palle Pilichindi - 34 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 02/08/2025
పల్లె పిలిచింది - 34 - తెలుగు కావ్యము తృతీయాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
7.
కందం.
మును ధరణీ విధముగ తాన్
గణకణ మండుటను గనని కాలము గడిపెన్
జనుదెంచెను భూమాతకు
పెనుభారము నేడు వేడి పెరుగుట తోడన్.//
తాత్పర్యము.
పూర్వం భూమి ఇలా వేడితో మండుతూ ఉండేది కాదు. ఇప్పుడు భూమాత మీద ఎంతో భారం పడింది.//
8.
కందము.
తరువులఁ గూల్చుచుఁ ధరలో
తెరలుచు నీ మనుజులు తమ తెలివిని జూపన్
వరముల నొసంగు భువి కటు
తరముగ ద్రిమ్మరుచు గాంచి దండన జేయున్.//
తాత్పర్యము.
తాము తెలివిగా ప్రవర్తిస్తున్నా మనుకొంటూ జనులు చెట్లను కొట్టివేస్తూ ఉన్నారు. చివరకు ఈ భూమి ఈ తెలివితక్కువగా తిరిగే జనులకు బుద్ధి చెప్తుంది.//
9.
కందము.
నరకములో పడి జీవులు
వెరపున బ్రతుకంగ సతము వేదన మిగులున్
దరమా? మానవ జాతిని
సరిదిద్దుట? నేడు భువికి సాంత్వన మెటులో?//
తాత్పర్యము.
జీవులన్నీ నరకంలో పడినట్లు బ్రతుకుతూ ఉంటాయి. మానవ జాతిని సరిదిద్దటం సాధ్యమవుతుందా? భూమికి మంచి ఎలా జరుగుతుంది?//
10.
వచనం.
వీరేశుడు పల్లెలోని పరిస్థితులను గాంచి, కరువుకు కారణము వనములోని తరువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవటాన్ని గుర్తించాడు. దానికి కారణం కొందరు దుష్టులు చుట్టు ప్రక్కల యున్న అరణ్యములను విచక్షణారహితంగా నరికివేస్తున్నారు.//
11.
కందము.
ఘనుడగు వీరేశు డపుడు
వనమును గాంచి విలపించి వడివడి వెడలెన్
మునువారించుచు కుమతులఁ
ఘనమగు కార్యంబు సలుప కదిలెను ధిషణన్.//
తాత్పర్యము.
గొప్పవాడైన వీరేశుడు వనమును చూచి బాధపడి కన్నీరు కార్చాడు. వనములను కొట్టి వేస్తున్న దుర్మార్గులను వారించటానికి వెళ్ళాడు.//
(సశేషం)

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
コメント