పల్లె పిలిచింది - 46
- T. V. L. Gayathri
- 6 days ago
- 3 min read
Updated: 3 days ago
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #తోవకము, #చంపకమాల

Palle Pilichindi - 46 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 27/09/2025
పల్లె పిలిచింది - 46 - తెలుగు కావ్యము చతుర్థాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
8.
తేటగీతి.
మిహిక బిందువుల్జారగా మిలమిలనుచు
మార్గముల్ కనుపించవీ మాసమందు
వాహనంబులు కదలవా వసతినుండి
జనులువణుకుచుగడిపిరాసమయమందు.//
తాత్పర్యము.
భూమి మీద మంచు బిందువులు జారుతూ మిలామిలా మెరుస్తున్నాయి. రహదారులు మంచుతో కప్పబడి కనిపించటం లేదు.దాంతో వాహనాలు ఇళ్ల నుండి కదలటంలేదు. చలికి జనాలు వణుకుచున్నారు.//
9.
తేటగీతి.
ఎదురు చూచి యా కమలంబు లెఱ్ఱబడగ
భానుదేవుండు తరలెను బద్ధకముగ
నూహుహూయని జనులు నిట్టూర్పు విడచి
దుప్పటుల్ బిగియించుచు దొరలుచుంద్రు.//
తాత్పర్యము.
సూర్యుడి కోసం చెరువుల్లోని తామరపూలు ఎదురు చూసి చూసి కోపంతో ఇంకా ఎఱ్ఱబడ్డాయట.సూర్యుడు చాలా బద్ధకంగా ఆలస్యంగా వస్తున్నాడు. తెల్లవారినా కూడా జనాలు 'ఊహుహు'అంటూ దుప్పట్లు బిగించి మంచాల మీద దొర్లుతున్నారు.//
10.
కందము
చీకటి రాత్రులు పెరిగెను
వేకువ జామున మిహికము పృథ్విని జుట్టన్
దేకువ వీడిరి మనుజులు
ప్రాకటమౌ సూర్యరశ్మి వాంఛితమయ్యెన్.//
తాత్పర్యము.
ఆ చలికాలంలో చీకటి పెరిగింది. పొద్దున్నే పొగమంచు అంతటా చుట్టుకోవటంతో జనులు బయటకు రావటానికి భయపడుతున్నారు. అందరూ తమకు హాయి కలిగించే సూర్యరశ్మి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.//
11.
కందము.
గూడుల వీడవు పక్షులు
మోడుగ మారిన తరువుల పోకడ గనుచున్
పాడవు కిలకిలయని తా
రాడవు గగనంబులోన రమణీయముగన్ //
తాత్పర్యము.
పక్షులు తమ గూళ్లను వదిలి తిండి కోసం వెళ్ళటం లేదు. చెట్లు మోడుగా మారిపోయాయి. పక్షులు కిలకిలా రావాలు చేయటం లేదు. ఆకాశంలో తిరగటం లేదు. అలా ఉంది చలికాలం!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments