top of page

పల్లె పిలిచింది - 42

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #కందము

ree

Palle Pilichindi - 42 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 08/09/2025

పల్లె పిలిచింది - 42 - తెలుగు కావ్యము తృతీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


54.

వచనము.


మణివికాస, జగదీశులు స్వదేశమునకు మరలి వచ్చుట.//


55.

తేటగీతి.


మణివికాసుడు సీమకు మరలివచ్చి 

విషయమంతయు నెరిగెను బ్రీతిమీర 

ఘనుడు జగదీశు డెలమిని గాంచుచుండి 

కౌగిటన్ జేర్చె వీరుని కథలు వినుచు.//


భావము.

మణివికాసుడు, జగదీశుడు స్వదేశానికి వచ్చి పల్లెలో జరిగిన విషయాలన్నింటిని తెలుసుకున్నారు. జగదీశుడు ప్రేమతో చూస్తూ ఉండగా వేరేశుడి అన్న మణివికాశుడు కౌగిలించుకొన్నాడు.//


56.

తేటగీతి.


"భళిర! భళిర నా వీరుడా! బాగు బాగు! 

నెదిగి పోతివి తమ్ముడా! హృదయ మిపుడు 

పొంగుచున్నది నిన్ జూడ! పుణ్య నిధివి 

పల్లె ఋణమును దీర్చెడి బలమునీదె."//


భావము.


"తమ్ముడా! నీవు చాలా గొప్ప వాడివి అయ్యావునువ్వు ఎంతో ఎదిగిపోయావు. పల్లెఋణమును తీర్చేంత గుణము కలవాడివి. నిన్ను చూస్తే ఆనందం కలుగుతోంది"//


57.

తేటగీతి.


అన్న పల్కులన్ బ్రేమతో నాలకించి 

యిట్లు నుడివెను వీరేశు డిరవుగాను 

"నదులలో ప్లాస్టికును ద్రోల నడుము కట్టి 

నడుప వలయునన్న! మనది నవ్య శకము"//


భావము.


అని అన్న చెబుతుంటే ప్రేమతో విని వీరేశుడు ఇలా అన్నాడు.

"అన్నయ్యా! నదులలో ఉన్న ప్లాస్టిక్కును తొలగించాలి. //


58.

తేటగీతి.


బుద్ధిమంతులమగుచుండి భువికి ముప్పుఁ

దొలగగా కార్యమంతయుఁ గలిసి మెలిసి 

జీవపాళికల్ బ్రతుకంగ చేవతోడ 

మార్గమున్ జూపు చుండుటే మేలు మనకు. "//


భావము.


ఈ భూమికి ప్రమాదం కలిగించే విషయము గురించి ఆలోచించాలి. జీవరాసులు అన్నీ శక్తితో బ్రతకటానికి మనము మార్గమును వెదకితే మనకు మేలు కలుగుతుంది.//" 


పాళికల్ = సమూహములు.


59.

తేటగీతి.


సోదరుని మూర్ధమున్ బట్టి సొగయు నొంది 

"యంత్రమొక్కటి తెచ్చితి యాతనలను 

తరుగు చేయు నాధునికమౌ పరికరమ్ము "

మణివికాసుడు పల్కెను మాన్యుడగుచు.//


భావము.


తమ్ముడి ముఖాన్ని పట్టుకొని ముద్దుగా చూస్తూ

"నేను ఒక యంత్రమును తెచ్చాను. అది కష్టమైన పనులను సులభంగా చేస్తుంది."అని చెప్పాడు మణివికాసుడు.


సొగయు = పారవశ్యము.


60.

కందము.


మురికిని ద్రోలెడి యంత్రము

నిరవుగ దెచ్చెను వికాసు డింపుగ నదిలో 

బిరబిర తిరుగుచు యంత్రము 

మురికిని ద్రోలంగ నపుడు మురిసిరి మిత్రుల్.//


భావము.


నదులలో మురికిని తొలగించే యంత్రమది. అది బిరబిరా తిరుగుచూ నదిలో మురికిని తీసి వేస్తుంటే మిత్రులంతా సంతోషించారు.


61.

తేటగీతి.


ఆహ! ఏమాయువతకునత్యంత ధిషణ! 

శాస్త్ర విజ్ఞానమున్ బొంది జనులు నేడు 

గెలువ వచ్చునీ పృథ్విని తలచినంత 

మనుజులకెదురేది? భువిని ఘనులు సుమ్మి! //


భావము.


ఆహా! ఈనాటి యువతకు ఎంత మేధావిత్వము! చక్కగా శాస్త్రములు చదువుకొని ప్రపంచాన్ని జయించగలరు.ఈ తరం వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్లకు ఈ భూమి మీద ఎదురులేదు.//


(సశేషం)


ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page