top of page

పల్లె పిలిచింది - 39

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #సీసము, #కందము

ree

Palle Pilichindi - 39 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 16/08/2025

పల్లె పిలిచింది - 39 - తెలుగు కావ్యము తృతీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

33.

సీసము.


ఆ యూరిలో కుఱ్ఱ లావేశ పడుచుండి 

నుద్యమించి రచట నుద్ధతించి 

నూనూగు మీసాల నూతన యౌవన 

లావణ్య వంతులు లావుఁ జూపి 

మెఱయంగ మోములు మించిన దీప్తితోన్ 

భుజములు పొంగగఁ భువిని గెలుచు 

కాంక్షలతిశయించ కదను త్రొక్కుచు వచ్చి 

దొంగల నెదిరించ దూకి రపుడు./


తేటగీతి.


వనము పిక్కటిల్ల నరచి ప్రబ్బుకొనుచు 

వైరిమూకల కెదురేగి వచ్చినపుడు

 వనము నందలి చోరులు బలము తోడ 

త్రోలు చుండిరా కుఱ్ఱలన్ దుడుకుఁ జూపి.//


తాత్పర్యము.


ఆ ఊరిలోని కుర్రవాళ్ళు ఆవేశంగా బయలుదేరారు. వాళ్లంతా చిన్నవాళ్ళు. నూనూగు మీసాలు దువ్వుకొంటూ, సుకుమారులు వీరత్వం చూపిస్తూ, తమకు ఎదురు లేదని, తాము ప్రపంచాన్ని జయించగలమని,తెలియని తనంతో పెద్దగా అరుస్తూ అడవిలోకి వెళ్లారు. పాపం! వాళ్ళను చూచి కలప దొంగలు గట్టిగా ఎదుర్కొని నెట్టి వేశారు.//


34.

కందము.


పట్టిరి యువకుల నత్తఱిఁ

గట్టిరి చెట్లకు తపించఁ గర్రలతోడన్ 

గట్టిగ కొట్టుచు నధములు 

నెట్టిరి మిత్రులఁ గనలుచు నీచపు బుద్ధుల్.//


తాత్పర్యం.


 కలపదొంగలు ఆ కుర్రవాళ్ళను పట్టుకొని చెట్లకు కట్టి కర్రలతో చితకబాదారు.//


35.

కందము.


పాఱిరి యువకులు పల్లెకు 

వైరుల దెబ్బలకట వసి వాడెను మోముల్ 

దారుణమౌ బాధఁ బడసి 

నీరసమొందుచు కుమిలిరి నేటి వివేకుల్.//


తాత్పర్యము.


ఎలాగోలా ఆ దొంగల నుండి తప్పించుకొని నీరసంగా ఊరిని చేరారు మన వీర యువకులు. అయ్యో!వాళ్ళ శరీరాలు దెబ్బలతో కమిలి పోయాయి. వాళ్ళ మొహాలు వాడిపోయాయి.//


36.

కందము.


వచ్చెను వీరునికి రుజము 

నొచ్చెను దేహము బలిమిని నూర్చగ వైరుల్ 

నిచ్చయముగా తలంచిన 

మెచ్చుదురా జనులు భువికి మేలును సలుపన్.//


తాత్పర్యము.


ఆ దెబ్బలకు వీరేశనికి జ్వరం పట్టుకొంది. ఒళ్ళు నొప్పులు, బాధ.ఈ కాలంలో భూమికి మంచి చేయాలనుకుంటే ఎవరైనా మెచ్చుకుంటున్నారా? (మెచ్చుకోరు)//


(సశేషం)


ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page