top of page

పల్లె పిలిచింది - 37

Updated: 5 days ago

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

ree

Palle Pilichindi - 37 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 11/08/2025

పల్లె పిలిచింది - 37 - తెలుగు కావ్యము తృతీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


24.

తేటగీతి.


ఆశ వీడని బిడ్డడై నమ్మ యొడిని 

చేరి విలపించె వీరుడు చింత తోడ 

తండ్రి మల్లయ్య పుత్రుని దరికి చేరి 

శిరముఁ ముద్దాడుచు కురిపించెతన మమత.//


తాత్పర్యము.


వీరేశుడు ఆశను విడువలేదు. కానీ చాలా బెంగతో తల్లి ఒడిలో పడుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు తండ్రి మల్లయ్య వచ్చి వీరేశుని దగ్గరకు తీసికొని ప్రేమగా అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు.//


25.

తేటగీతి.


తండ్రినిగనుచు వీరుండు తలను వాల్చి

"పాలకులు దుష్టులను గూడి వరలుచుండ 

మంచి జరుగదీ కాలంబు మరలిపోవు 

ప్రకృతి కాంతను రక్షింప వలయు తండ్రి!"//


తాత్పర్యము.


తండ్రిని చూచి వీరేశుడు తల దించుకొని "నాన్నా!ఈ కాలంలో ప్రభువులే దొంగలకు తోడుగా ఉన్నప్పుడు మంచి ఎలా జరుగుతుంది? సమయము మించి పోతుంది. మనం ప్రకృతిని ఎలాగయినా రక్షించుకోవాలి కదా నాన్నా!"


26.

తేటగీతి.


ఇట్లు నుడివిన సుతునిపై నిమ్ము జూపి 

"కాల మివ్విధి మహియందు కదులుచుండు!

కలియుగంబున దుష్టులు కాలుదువ్వి 

కదను త్రొక్కుట పరిపాటి కదర పుత్ర!//


తాత్పర్యము.


అలా చెబుతున్న కొడుకుతో ప్రేమగా "ఒక్కోసారి కాలము అలాగే ఉంటుంది. ఇది కలియుగము. చెడ్డవాళ్ళదే రాజ్యం!వాళ్ళు అలా అహంకరించటం సర్వసాధారణ మైన విషయం కదా!"


27.

తేటగీతి.


శాశ్వతంబుగ నిలువదీ జాతి బిడ్డ!

కాలగతిలోన సర్వము కలిసిపోవు 

వనముఁ రక్షింప నీవంటి వాని కిపుడు 

ఘనత యనుటయే తప్పు!వగపును విడుము!"//


తాత్పర్యము.


మనం శాశ్వతం కాదు!అంతా కాలంలో కలిసిపోవాల్సిందే!అడవులను కాపాడాలని నీ వంటి వాళ్ళు అనుకువటమే ఇప్పుడు తప్పుగా కనిపిస్తుంది.బాధ పడకు!"//


28

తేటగీతి.


అనుచు బోధించి యామల్ల నార్యుడపుడు 

సాంత్వన వచనముల్ పల్కి సాధుమతిగ

పిరికి తనమును జూపుచు వెడలి పోవ 

యువకుడైనట్టి యావీరు 'డుస్సు!' రనెను.//


తాత్పర్యము.


అంటూ పిరికి వానివలె ఏదో వేదాంతం బోధించి మల్లయ్య వెళ్లిపోగా వీరేశుడు నిరాశతో నిట్టూర్పులు విడిచాడు.//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page