సుదర్శన రావు గారి పద్యాలు - పార్ట్ 2
- Sudarsana Rao Pochampalli

- 38 minutes ago
- 5 min read
#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #SudarsanaRaoGariPadyalu, #సుదర్శనరావుగారిపద్యాలు, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Sudarsana Rao Gari Padyalu - Part 2 - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally Published in manatelugukathalu.com on 22/02/2026
సుదర్శన రావు గారి పద్యాలు - పార్ట్ 2 - తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
{55}కందం--
భారత దేశము మనిషికి
భారము లేనుగు ధరణము భవితకు అదియే
భారత భాగ్యము పెక్కున్
భారత రాజ్యము మనకది భాగ్యము జూడన్
{56}కందం--
ప్రాణము పోయుట తెల్సి
ప్రాణము తీయుట తగదని ప్రాణులు చెప్పన్
ప్రాణము దేవుడు ఇవ్వన్
ప్రాణియు గనుకను అసువులు ప్రాప్తము ఎపుడున్
{57}కందం--
దేవుడు గూర్చిన సంతతి
కావున బంధువు ననిశము కాదన కుండన్
నీవును వారితొ ఎప్పుడు
దేవుని వరముగ దొరకొన దేవుడు మెచ్చన్
{58}కందం--
చిలుకల పలుకులు అందము
తొలకరి సూడుయు చెలువము తోషము అందం
కలవా పందము లాసిక
చెలియయు పకపక ప్రహసము చెప్పిన అందం
{59}కందం--
కోరిక గలిగిన గోరుము
కోరిక కలుగని వనితను కోరుట తగదున్
మారిన కాలము విధమున
మారుట కంగొని ప్రణయితొ మాటలు శ్రేయం
{60}కందం--
భుజముల యందున పొత్తము
సుజనులు జూడను కురులును సొంపుగ నుండన్
సుజనులు అక్కయు చెల్లెలు
భుజములు చెయ్యే చదువను భురిగను నడువన్
{61} కందం--
సాకే తపురము నందున
సాకే తపురము రఘుపతి స్తానము నేలన్
సాకే తొమొక్క టియనక
సాకే తపురము పిదపను సాయము లేకన్
సాకేతపురము=అయోధ్య,నందున=అందులో,రఘుపతి-రాముడు,స్థానము=ప్రదేశము,ఏలన్=ఏలెను,సకేతమొక్కటి యనకను=సాకేతమొక్కటి యనక,సాకేత పురము =సాకేతపురము,పిదపను-ఏలాంటి,సాయము=సహాయము,లేకన్-లేకుండ.
{62}కందం—
నీకయి దాసులు ఎందరొ
నీకును సేవలు జరుపను నిల్చిరి బయటన్
నీకును దయతో రాముడ
నీకగు వారును కరుణతొ నిజముగ సేయన్
{63}కందం--
సూర్యుడు చుక్కలు విశ్వము
ఆర్యులు చెప్పిన విధమున ఆకా శమునన్
అర్యులు మాదిరి నిల్చొని
ధార్యుమ గలిగియు గృహపతి ధవ్వున నిల్వన్
{64}కందం--
మనుషుల సృష్టించె రవియు
ధనమును ధాన్యము నిగుడుచు దాతగ నిల్వన్
క్షణమును తీరిక లేకను
వినయము తోడను మనుగడ విశ్వం బెరుగన్
{65}కందం--
రఘుపతి భారత దేశము
అఘమని లేకను విరివిగ అందరి ముందున్
రఘురా డేలెను రాజ్యము
విఘటిత లేకను అఖిలము విజయపు మార్ఘం
65}కందం--
మతమన మనుజుని యిస్టము
మతమన ఏదియు అయినను మంచిని బెంచన్
మతమన పొత్తుయు గాదన
మతమన జీవికి అభిరతి మనిషిగ బ్రతుకన్
{67} ఉదయము లేచియు అరుణిని
పెదవులు విప్పుచు నమసము పేర్కొన జేయన్
హృదయపు భారము తగ్గగ
ఉదయపు రవియే మనకును ఉండగ క్షేమం
{68} అరుణిని జూడగ కాంతులు
శరణని వేడగ మనకును శత్వరి వరకున్
కఋణతొ జ్యోతియు వెలుగగ
వరుణుడు నిత్యము వరుసగ వాసిగ నీయన్
{69} ఎవ్వరు కవులును చేసిన
సవ్వడి ప్రకృతికి కవనమె సాగుచు ఉండన్
జవ్వని అందులొ ఇరుకుచు
కవ్వము మాదిరి తిరుగుచు కమనీయంబై
{70} ఆకా శమునను సూర్యుడు
ఆకా శమునను సహితము అందరు సూర్యుల్
మాకే దిక్కగు భాముడు
కాకా రాయన జగమున కర్మము సాక్షే
{71} భారత భాగవ తంబులు
కారణ జన్ములు రచనము కాంచగ ఎంతో
సూరుడు చదువుచు చెప్పగ
ధారణ చేసెడి మనుషులు ధర్మము నిలుపన్
{72} ముద్దుగ పిల్లలు ఉన్నను
ముద్దుగ పిల్లలు అగపడ ముద్దుగ లేకన్
ముద్దుతొ పిల్లల చూచుచు
పొద్దుయు పగలును ముదముతొ పోషన అదియే
{73} వంటల శాలలు శుబ్రత
కంటికి ఇంపగు అశనము కానగ ఉండన్
ఇంటిది భోజన మేలని
దంటగ హితవరి వెనుకల దరిమిల తినుడే
{74} పెసలును శనగలు బొబ్బర
అసలగు లశునము దరిమిల అనగను కొన్నిన్
విసుగన లేకను నిత్యము
పొసుగను తిన్నది అరుగుడు పొసగుట సుఖమున్
{75} అన్నము తొక్కుయు కూరయు
తిన్నను పెట్టుచు ఉదముర తీరగ క్షుత్తున్
అన్నియు బట్టలు బాతలు
ఉన్నవి బెట్టుము ఖిదిరుడు ఉత్తము డనగన్
{76} దేవుడు లేడని అనినను
దేవుడు కెన్నియొ అదనము దేవుల పేర్లన్
జీవుడు పెట్టుచు అర్పణ
జీవుని కెప్పుడు కనబడ జియ్యయు లేడే
{77} దేవుడు జీవుడు ఒకటై
దేవుని కొరకై భవకుడు దేవుని కొలువన్
జీవుని ఆత్మకు శరణము
దేవుడు ఉండును నగరులొ దేశం ఒప్పన్
{78} శివుడును విష్ణువు బ్రహ్మయు
అవనిలొ దేవత లనగను అందరు దెలియన్
కువలయ మందున సూర్యుడు
మువురికి కంటెను అజరము ముఖ్యము జూడన్
{79} అమ్మకు కోపము వచ్చిన
కమ్మని భావము మనసున కలిగియు ఉండన్
అమ్మకు కుమారు కూతురు
అమ్మకు మ్రొక్కుచు పనివిన అదియే మేలున్
{80} హారము రమ ఉమ శారద
జారగ వేసియు జగమున జాగ్రత పడగన్
హారము తీసెడు భామలు
హారితొ మనసున కనుమిక హారపు విలువన్
{81} మానవ శ్రేష్టుడు శ్రేష్ట
త్రాణము బొందను సమయము తానే శ్రుష్తిన్
మోనకొనురాత్రి పగలును
ప్రాణము పోయెటి వరకును ప్రాప్తము బొందన్
{82} ఏమీ తెలియని మాతలు
తామే సంతుకు అమృతము తక్కువ గాకన్
తామే పోషన భారము
ఏమేరకయిన ప్రకృతిలొ ఏవము లేకన్
{83} దేవుడు లేడని ఎందరొ
దేవుని గుర్చియె పలుకుట దేనికి ఒప్పున్
కావున దేవుడ కనపడు
జీవుల మదిలో మెలుగుచు జీవన మార్గం
{84} దేవుడ నేనని రాముడు
జీవిత మందున దెలుపక జీవన యాత్రన్
జీవిత సారము ఏమిటొ
భావిత ప్రజకును దెలుపుచు భాసిలు మదిలో
{85} దరణము బుట్టిన జనముయు
మరణము వరకును ఒకపరి మారుచు ఉంటున్
నిరతము జనములొ ఒకరయి
దరుమము తప్పుట తగవును ధాతయి ఖలమై
దరణము= భూమి,బుట్టిన= ఉద్భవించిన,జనముయు=జనము,మరణము= చావు,వరకును=వచ్చెవరకును,ఒకపరి=ఒకసారి,మారుచు=మార్పుతొ,ఉంటున్=ఉండగా, నిరతము=ఎల్లప్పుడు,జనములొ=ప్రజలలొ,ఒకరయి=ఒకరిగా ఉంటూ,దరుమము=న్యాయము,తప్పుట,తగవును=యుక్తము,=ధాతయి=న్యాయాధికారై,ఖలమై=లేఖిని.
{86} ఇది యొక జీవిత సత్యం.
నిత్యము వేడుక లుండగ
సత్యము నాసతి అసువులు సాగిన పిదపన్
నిత్యము ఎవరును గానగ
సత్యము నాబ్రతు కెపుడును సాగిల పడగన్
{87} మనుషులు లేనిది దేవుడు
కనుమరు గగునన పుడమిన కాంచగ లేకన్
వినగను దేవుడు నిలుచును
మనమున ఎంచగ బలకర మనగను భాగ్యం
మనుషులు=మానవులు,లేనిది=లేకపతె,దేవుడు=భగవంతుడు,కనుమరుగు=కానక పోవడము,పుడమిన=భూమిలో,కాంచగ=చూడగ,లేకను=లేకుండ,వినగను=వినగా,దేవుడు=భగవంతుడు,నిలుచును=ఉండును,మనమున=మనసులో,ఎంచగ=ఊహించగ,బలకరము=బలవంతమైన,భాగ్యము=అదృష్టము.
{88} దేవుడు నీవై ఉండగ
జీవుడు దురితము సుకృతము జీవన మేలా
జీవుని తలలో మెలికలు
దేవుడు పెట్టుట తగనిది దేహం బేలా
{89} అన్నము బెట్టిన మనిషిని
ఎన్నడు మరువకు ఉదరము ఎరుగగ చూడన్
అన్నము బెట్టుట అనగను
తిన్నను లేకను అటుఇటు తిండికి లేకన్
{90} భార్యయు భర్తయు నిత్యము
కార్యము ఎదయిన మరిమరి కలిగిన చోటన్
క్రౌర్యము వీడరు మదినను
కార్యము విడవరు సవితృడు కాదని చెప్పన్
{91} పూర్వపు భారత దేశము
పూర్వపు మాదిరి అధికము పూర్తిగ లేకన్
పూర్వపు మాదిరి గుంచను
పూర్వపు ఘనతను తెలియగ పూర్తిగ కలిమే
{92} మహా శివ రాత్రి సందర్భముగా
శిరమున ఎముకల పేరూ
కరములొ శూలము అమరుచు కాంతులు ఈనన్
శిరమున చంద్రుడు ఉండగ
వరాల వేలుపు మనకును వరములు వసగన్
{93} చూడను శృంగారముయును
మాడను ద్రువ్వుట కనుగొన మామక యననన్
తోడుగ బట్టలు సహితము
వేడుక గుండగ మనిషికి వేసము చూడన్
{94} మణులును మాణిక మేలన్
జనమున వచ్చెడి ఇడుముడి జాగ్రత జూడన్
ఘనమగు కీర్తియు గలుగగ
కనగను రత్నము మణులకకన్నను శుభమున్
{95} తల్లిది ప్రేమయు మరియున్
పిల్లల పట్లను కనుకలి పిచ్చిగ నుండన్
తల్లియు నేర్పిన భాషగు
ఉల్లము రంజిలు తెలుగుయె ఉపకృతి ఇలలొన్
{96} తల్లి ప్రేమతొ తండ్రియు తగుల మన్న
పిల్ల లబవిత పెరుగుచు ప్రీతి గలుగ
తల్లి నేర్పిన భాషకు తండ్రి ఒప్ప
పిల్ల లెంతనొ నేర్చుచు పెరిమి గలుగ
{97} షికమీ చేసే కోకిల
టికాన ఎక్కడొ తెలుపవ టింగుయు టింగని
పికబనుధువునును చూపెద
సకలము నీకై కరకము సాయము జేయన్
{98} మలము మూత్రము తల్లియె మాన కుండ
కొడుకు బిడ్డల క్షేమమె కోరు కుంటు
తనకు ఏదైన దోషము తగుల నుండ
వారి బాగును గోరుచు వారి లెస్స
{99} దేవుడు పుస్తక మోలెను
దేవుని కన్నము గొనకొన దేవుడు చూడన్
జీవుడు పెట్టిన అన్నము
దేవుడు తినినటు నటనతొ దేహికి ఇచ్చున్
{100} చేతికి గాజులు కుంకుమ
నాతికి పూవులు ముఖమున నగవుతొ వరమున్
నాతికి మెడలో సొమ్ములు
నాతికి లేనగు మినుకులు నాథుడు గట్టన్
చేతికి=చేయికి, గాజులు=చేతికి పెట్టుకునే గాజులు,కుంకుమ=బొట్టు,నాతికి=స్త్రీకి,పూవులు=పూలు,ముఖమున=ముఖమునకలంకారము,నగవుతొ=నవ్వుకుంటు,వరమున్=కాటుక,నాతికి=స్త్రీకి,మెడలో=మెడలో,సొమ్ములు=నగలు,నాతికి=స్త్రీకి,లేనగు=లేనటుంటవి,మినుకులు=పుస్తెలు,నాథుడు=భర్థ=మొగడు,కట్టన్=కట్టగా.
{101} గలగల మురిపెము కనబడ
తళతళ ఉరుకుచు జననియు తన్మయ మొందన్
మిలమిల మెరిసెడి తీయని
వలపుతొ ప్రహరము పొనరుచు వస్తువు గరుజున్
{102} సృష్టిలొ నేనును హరిగ
స్రష్టయె సృష్టించె పుడమి సమహితు డనగన్
పృష్టము నందున జీవన
కష్టము అనకను బ్రతుకను కాలపు మహిమన్
{103} మాటకు ప్రాణం బిచ్చెడి
మాటలు ఎన్నో వెనుకటి మాటున ఉండగ
నేటికి కాగిత మొక్కటి
సూటిగ వ్రాసిన విధముకు సూత్రం బేదీ
{104{ చుక్కలు సూర్యుడు చంద్రుడు
చక్కని నీడలొ దిరుగుచు చాయయు నీడన్
మిక్కిలి ఈయగ మనకని
చక్కని దేవుని శరణము చల్లగ ఉండన్
{105} పిల్లలు పుట్టిన మొదలును
తల్లికి చేరువ అగుచును తాగును పాలున్
మెల్లెగ పెరిగిన కొలదిని
తల్లిని కాదని చవిగొను తాతగ ఐనన్
{106} బిడ్డలు బుట్టుట కొరకని
పడ్డడి ఆరడి జననియు ప్రసవము కొరకున్
ఎడ్డము లెన్నియొ పడుతును
బిడ్డడు బుట్టగ మరిచెను బీరము లోనై
బిడ్డలు=కొడుకు లేదా
కూతురు,బుట్టుట=జనించుట,కొరకని=కారణాన,పడ్డది=కస్టపడ్డతి,ఆరడి=ఇక్కట్లు,జననియు=తల్లి,ప్రసవము=ప్రసూతి,కొరకున్=కారణాన,ఎడ్డెము=అసౌఖ్యము,ఎన్నియొ=చాలా,పడుతును=అనుభవించుచు,బిడ్డడు=కొడుకు లేదా కూతురు,బుట్టగ=జననము పొందగా,మరిచెను=మరిచిచిపోయింది పడ్డకష్తాలు,భీరము=ధైర్యము,లోనై=పుట్టగా
{107} ఎన్నియొ సారులు చెప్పిన
అన్నము తినకను స్వజనుడు అభిరతి జేయన్
విన్నను వినకను అక్కడె
అన్నము తినగను తహతహ అరుసము గనగన్
{108} బారెడు జుట్టుయు గలిగియు
చారెడు పూలకు సరిపడ చామన్ తైనన్
కోరెడు భామను చూచిన
కోరుట దీర్చన్ కుసుమము కోకొల్ల నగన్
***
సుదర్శన రావు పోచంపల్లి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.




Comments