సుదర్శన రావు గారి పద్యాలు - పార్ట్ 1
- Sudarsana Rao Pochampalli

- 15 hours ago
- 6 min read
#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #SudarsanaRaoGariPadyalu, #సుదర్శనరావుగారిపద్యాలు, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Sudarsana Rao Gari Padyalu - Part 1 - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally Published in manatelugukathalu.com on 21/02/2026
సుదర్శన రావు గారి పద్యాలు - పార్ట్ 1 - తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
[1} కందం
విషమన సుధయును క్షీరం
విషమన జలముయు విషమన వినగను గరళం
విషమన మధువుయు గాగన్
విషమని యనగను రసనము విశ్వము నందున్
సుధ=అమృతము,క్షీరము=పాలు,జలము=నీళ్ళు,గరళం=విషము,మధువు=తేనె,రసనము=బంగారము,విశ్వము=భూమి{లోకము}
[2} కందం--
తెలుగను భాషను తెలియగ
తెలుగుకు కీర్తియు తెలుపుచు తెలుగున దెల్పన్
తెలుగను భాషను ఇచ్చెను
తెలుపగ భగవతి జనముయు తెలుగును పలుకన్
{3}కందం--
కడుపులొ మాడుచు నుండగ
మడియని దలుచుచు తినకను మానుట గనగన్
సడులని సదనము నుండక
అడవిలొ నివసన మనెడును అడిబండనగన్
మడి=ఆచారము,సడులు=ధ్వనులు,సదనము=ఇల్లు,నివసన=నివాసము,అడిబండ=మూర్ఖుడు.
{4} కందం--
కూడుయు గూడుయు గుడ్డయు
తోడుయు లేనగు మనిషికి తొక్కట మనగన్
పోడిమి గలిగిన మనిషికి
చేడియ లిరువురు అయినను చెప్పను లోటే
తొక్కటము=ఇబ్బంది,పోడిమి=సంపద,చేడియ లిరువురు=ఇద్దరు భార్యలు,లోటు=లోపము.
కట్టను బట్టయు నిలువను నీడయు తినగను తిండియు తోడుగ భార్య లేనగు వానికి బతుకు ఇబ్బందికరము--సంపద ఉన్నవానికి భార్యలు ఇద్దరున్నా ఇంకాలోపమంటాడు.
{5}కందం--
పెద్దయు చిన్నయు గనకన్
హద్దులు మీరుచు పలుకగ అవివేకనగన్
రద్దియు జెందును కనగన్
పెద్దలు మనమున సుడిగొను ఫేరవు గనుచున్
పెద్దలు చిన్నలు గనకన్=పెద్ద చిన్న చూడకుండ,హద్దులు మీరుచు=పరిమితిమించుచు ,పలుకహ=మాటాడగ,అవివేకి=బుద్ధిలేని వాడు,రద్దియు జెందు=అబాసుపాలగు,సుడిగొను=బాధపడు,ఫేరవుడు=దుష్టుడు.--
{6} కందం--
అతిగను ఇతవుతొ పెళ్ళని
సతినన జేకొన మగనికి సతతము చిక్కే
సతికో రికనగ దీర్చక
పతికిని నిత్యము తనకలె బతుకున సాంతం
తనకలి=ఇబ్బంది.
{7} కందం--
ఎంతయొ నియమము లేక
స్వంతము బతుకుట కరువయి సానువు దిరుగన్
అంతవ శాయియు దెచ్చియు
సంతోష మనుచు వపనము సరిగను జేయన్.
ఎంతయొ=ఎంతో,నియమము=చెప్పినమాట వినక,లేక=తెలువక,స్వంతము=స్వయముగా,బతుకుట=జీవించుట,కరువై=దొరుకక,సానువు=అడివిలో,తిరుగన్=తిరుగుచుండగా,అంతవశాయి= మంగలివాడు,తెచ్చియు=తీసుకవచ్చి,సంతోష మనుచు=సంతోషంగా,వపనము=క్షౌరము,సరిగను=సరిగా,జేయన్=జేయును.
{8} కందం--
ఆడశిశువనగ బుట్టన్
వేడుకె యింటన్ కుటుంబ వేదన దీరన్
పోడిమి గలుగుట తథ్యం
పాడియు పశువులు సహితము ప్రాప్తించనగన్
ఆడశిశువు=ఆడపిల్ల,వేడుక=సంతోషము,ఇంటన్ వేదన=బాధ,పోడిమి=సంపద,తథ్యం=వాస్తవము,పాడి=పాలు ఈయగలిగే ఆవులు-బర్రెలు,సహితము=కూడా,ప్రాప్తించు=కలుగు,
{9}కందం--
రాతియులిదగుల రాయిలొ
చేతను డుదయించనగను చెప్పగ నుండన్
భాతియు జెందుచు నగరిలొ
ఊతము నిచ్చుచు జనతకు ఉండును స్థిరమున్
రాతిఉలి=శిల్పిరాతిని తొలచే ఉలి,చేతనుడు=భగవంతుడు,ఉదయించు=ఆవిర్భవించు-పుట్టు,భాతియు జెందుచు=ప్రకాశించుచు,నగరిలొ=దేవాలయములో, ఊతము=ఆధారము-పట్టు,జనతకు=ప్రజలకు,స్థిరము=శాశ్వితము.
శిల్పి ఉలి దెబ్బకు రాతినుండి దేవుడు ఉదయించి దేవాలయములో ప్రకాశించుచు ప్రజలకు ఆధారభూతుడై శాశ్వితంగా నిలిచి పోతాడు.
{10}కందం--
కోతిగ రూపము యున్నను
మాతగు అంజని బిలిచెను మనసిడి హనుమన్
ప్రీతితొ సుందరు డనుచు
ఖ్యాతియు బొందెడి నటులను ఖగవతి యందున్
అంజని పుత్రుడు హనుమంతుడు వానరజాతి రూపములో నున్నను తల్లి ప్రీతితో భూమిపై కీర్తి పొందునటుల ఆతనికి సుందరుడను పేరుబెట్టెను
{11}కందం--
తప్పదు చెరసా లందున
చిప్పలొ కూడన హరీతు శిక్షలొ నుండన్
చెప్పను చిప్పలొ కూడుయు
ఒప్పిన దొరకని చెనటులకొనగూడదనన్
చెరసాల-జైలు,హరీతుడు=దోషి,శిక్ష=దండన,ఒప్పిన=సిద్ధపడినా,చెనటులు= దౌర్భాగ్యులు,ఒనగూడు=ప్రాప్తించు
రాజకీయ నాయకులు దోషులుగా నిలిచిన వారికి శిక్షలో భాగంగ జైలులో చిప్ప కూడే ప్రాప్తము అని దెప్పుతారు-- ఆ చిప్ప కూడు కూడా దొరకని {ఏ తప్పు చేయని} దౌర్భాగ్యులెందరో మన దేశములో ఉన్నారు
{12} కందం--
కౄరపు మృగమై యుండియు
కారడవందున వసించి గాదిలి తోడన్
చేరను దీయును సంతును
మారెడు వరకును రతీబు మార్గము వెదకన్
కారడవి= దట్టమైన అడవి,వసించి=నివసించి,గాదిలి=ప్రేమ,సంతు=సంతానము,రతీబు= ఆహారము మార్గము=దారి, వెదకు=అన్వేషించు.
దట్టమైన అడవిలో నివసించెడి కౄరమృగమైనా ప్రేమతో తన సంతు తనంత తాను ఆహార మార్గము వెదకెడి వరకును పెంచుచుండును.
,
{13} కందం--
చెప్పకు చాడీ లనగను
ఎప్పుడు ఇతరుల పయినను ఏగుచు మేలున్
తప్పగు నీనడ తందున
చెప్పగ నీదగు బతుకున చేటుయు గలుగున్
చాడీలు=కొండెములు,ఏగుచు=అతిక్రమించుచు,మేలు=క్షేమము,నడత=ప్రవర్తన-నడవడి,చేటు=అనర్థము-కీడు,
{14}కందం--
పక్షుల రక్షణ దలువగ
అక్షయ పున్నెము గలుగును అవనిన ప్రజకున్
లక్షణ మనగను యుండన్
దక్షత తోడను పెనుచగ ధర్మమె కనగన్
అక్షయ=ఎనలేని,అవనిన=భూమిపైన,లక్షణ=అభిప్రాయము,దక్షత=నేర్పు,పెనుచు=సాదు,ధర్మము=న్యాయము.
{15}కందం-- పిశిసము మెక్కక మరిగియు
సశివుడు మెక్కక బ్రమపదు సగవున కైనన్
పిషితము నిత్యము దిన్నను
కషివుదు మొనరుచ కరుగునె కబురల కైనన్
పిశితము=మాంసము,నశివుడు=అన్నము,బమపడు=భాధపడు,నగవున=నగవుతో,పిషితము=మంసము,నిత్యము=ప్రతితోజు,కశివిదు=అన్నము,మొనరుచ=కదులునె,కబురుల=కొలతల, కైనన్=ఐనను
{16}కందం--
సివ్వ సివ్వ మంటు సివునిని దలచుచు
జింక మంస మెంతొ జిగుటు యనుచు
ఏణి మాంస మెంటొ మేలని యనుచును
దాని మాంస మంట దాగ గోమి
{17}కందం--
అమ్మయె నేర్పును తినుటకు
కమ్మగ మ్రింగగ మధురము కాంచగ నుండన్
ఇమ్ముగ సురసము ఖండము
కమ్మని రుచిగల పులుసుయు కాదన కుండన్
{18}కందం--
అమ్మయు అయ్యయు నేర్పెడి
కమ్మని తెలుగగు భగవతి కడదా ఉండన్
ఇమ్మహి నేర్చిన భాషను
కమ్మని భాషని తలువక ఖాటిక మేలా
{19}కందం--
అమ్మయె నోరును తెరచియు
కమ్మని పాదా లుపలుక కాయము తోడన్
సమ్మత మనుచును పలుకెడి
అమ్మా యనుచును బిలువగ ఆమ్మకు ప్రీతిః
{20}కందం--
కన్నియ గులాబి జూడగ
మన్నిక ఎంతయొ గనపడు మదురపు వలలో
పున్నమి మాదిరి పూచిన
సన్నియ మెడలో తెలుగుయు సవ్యపు మదిలో
{21}కందం--
మనది యయ్యెడు భాషను మరచి పోక
మనది అమ్మయె చెప్పిన మంచి తెలుగు
గునము హీనము గాకను గూర్చి తెలుగు
క్షణము మానక చద్విన క్షమమె వితము
{22}కందం--
తనదగు రాజ్యము నందున
వినదగు చోద్యము తెలుగని వింతగ జూసిన్
తనుయును తమ్ముడు తెలుగును
మినుగొమ వ్రాసిసె ననుచును మితముగ నేర్చెన్
{23}కందం--
అమ్మయె చెప్పును బుద్ధిని
అమ్మయె చెప్పును పఠనపు అమితపు జ్ఞానం
అమ్మయె చెప్పును సారము
అమ్మయె చెప్పును కలయిక అందరి తోడన్
{24}కందం--
మానవ జన్మము లందున
మానన లెన్నియొ ఇమిడిక మానిషి యందున్
ప్రాణము లన్నియు ఒకటై
వీణల మీటిన విధమున విశ్వము నందున్
మానవ జన్మము లందున=మానవ జన్మలో
మానన=గౌరవము,ఎన్నియొ=గొప్పగా,ఇమిడిక=కలసిమెలసి,మానిషి=మనిషి.ప్రాణములన్నియు=ప్రాణాలన్ని,ఒకటై=ఒక్కటై,వీణలు=వీణియ,మీటిన=ఒప్పిన,విధమున=పద్ధతి,విశ్వము=ప్రకృతి, నందున్=అందులో
{25}కందం--
సూర్యు దేవుని కెంతయొ సూర్య తాప
మెంత యున్నను అంతయు మేలు కొరకు
ప్రాణ హితముతొ వారిని ప్రాణ మరయ
నిత్య నూతను దగుచును నీర మేల
{26}కందం--
అంద చందల యవ్వని ఆక్క డుండి
కుంద నంబుగ కురులును కూర్చి యమ్మి
వంపు సొంపులు వయ్యార మింపు గాను
నేడు దేషము అంతట నేర్పు గలిగె
{27}కందం--
మగువయు పిల్లలు లేకున
మగడును ఏరీతి ఒకరు మానస మందున్
విగతము జీవుడ డగుచును
విగతము ఉండడు అదియును విపనిలొ కూడన్
{28}కందం--
కీర్తి శేషులు పెద్దలు కీర్తి నిలుప
భార తావని సాటువ భాగ్య మేను
వీర కంకణ ధారుడు విజయ మొంది
భార తంబుకు బిడ్డడు భాగ్య మేను
కీర్తి=యసస్సు,శేసులు=మిగిల్చినవారు,,పెద్దలు=పోయినోళ్ళు,నిలుప=నిలిపినవాళ్ళు,భారత=భారతదేశము,అవని=భూమి, సాటువ=ప్రసిద్ది,భాగ్యమేను=భాగ్యమే, వీర =శ్రేష్టుడు,కంకణ=ఆభరణము,ధారుడు=ధరించినవాడు,విజయము=మిక్కిలిగెలుపు,మొంది=పొందజేయు, భారతంబు=భరతమాతకు,బిడ్డడు=కొడుకు,భాగ్య=అదృష్టము,మేను=అవును
{29}కందం--
గాలిని కుంభియు నంగ్నియు
మేలిమి స్రుష్థియు తిరుగుట మేధిని నిల్పన్
జాలియు కలిగియు జగమున
తూలము గలిగిన అజరుడు తూష్ణిక మొప్పన్
{30}కందం--
జగమును జూపును అమ్మయె
జగమును పరిచయ మనుటకు జయముతొ అయ్యే
జగుడము వలదను తల్లియె
జగుడము కన్నను హరుసము జయమను తండ్రీ
{31}కందం--
తెలుగును మరువకు ఎప్పుడు
తెలుగుతొ తేజము అధికము తీర్థము లాగన్
తెలుగులొ లేవిని లేవని
తెలుగులొ కలవన విపులము తేనెలు కురియన్
తెలుగును=మన తెలుగు భాష,మరువకు=మరచిపోకు,ఎప్పుడు=ఎల్లప్పుడు,తేజము=ప్రకాశము,తీర్థము=అగ్రోదకము,లాగన్=మాదిరిగ,కలవన=ఉన్నవి,విపులము=అధికము,తేనెలు=తేనీయము,కురియన్=కురువగా.
{32}కందం-- మనకును లేనగు అందము
జనమున కుండగ రవణము జగమే మెచ్చన్
మనమున సంప్రీతి మనకు
కనగను అదియును పరమము కాంచిన వరమే
{33}కందం--
దేవుడు లేడన మూర్ఖమె
దేవుడు నీలో కలడని దేహము నమ్మన్
దేవుని ప్రతిమయె నీలో
దేవుని ఉనికిని ప్రకటిత దేహమె నీవై
{34}కందం--
మనగగు దేవుడు సూర్యుడు
కనగను ఎనుబది వెయిలగు కానగ నాల్గున్
దినదిన ముందున మార్చుతు
జనమున ప్రాతవి విజరము జగముయె నడువన్
మనగగు=మానవులకు,దేవుడు=దైవము,సూర్యుడు=సూర్యభగువానుడు,కనగను=చూడగా,ఎనుబదినాలుగు వేల నాలుగు జీవరాసులు,దినదినమందున=ప్రతిదినము, మార్చుచు=మార్పు కలిగించుచు,జనమున=జనములో,ప్రాతవి=పాతబడిన,విజరము=నవీనము,జగము=ప్రపంచము,నడువన్=నడుచునట్లుగా.
{35}కందం--
ఎనుబది నాలుగు లక్షల
జనముయు కాగను ఇతరము జాగ్రత ఉంచన్
ఇనుడును తానే మేల్కొని
జనమును జాగ్రత పరుచను జయమును చూపున్.
ఎనుబది నాలుగు లక్షల=ఎనుబది నాలుగు లక్షల వేలు,జనము=మంది,కాగను=ఇంక,ఇతరము=ఇతరజీవులు,జాగ్రతగ=జాగరూకతగ,ఉంచన్=ఉండునట్లు,ఇనుదు=సూర్యుడు,తానే=తానుగా,మేల్కొని=లేచి,జయమును=సాఫల్యము,చూపున్=చూపును.
{36}కందం--
కుక్కకు కూడును బెట్టిన
కుక్కయె మొరుగును కలముడు కూడును దోయన్
కుక్కను గాదని అన్నము
కుక్కకు బెట్టక ఇడుకొన కూరిమి కరువౌ
{37} కందం--
సత్యము నిత్యము బలుకుము
సత్యము తోడను అలయిక స్వాంతము తోడన్
నిత్యము నీమది సుగుణము
నిత్యము నియమము నిపుణత నించును సత్యం
సత్యము=నిజము,నిత్యము=ప్రతిరోజు,బలుకుము=బలుకుట,తోడను=వెంబడి,అలయిక=అలసట,స్వాంతము=హృదయము,తోడన్=వెంబడి,నిత్యము=ప్రతిరోజు,నీమది=నీమనసు,సుగుణము=సంతోషము,నిత్యము=ప్రతిరోజు,నియమము= నిశ్చయము,నిపుణత=సౌకర్యము,నించును=సమకూర్చు,సత్యం=నిజము.
{38}కందం--
ఎంతను మంచిగ ఉండ
స్వంతము ముఖముయు జలకము సవరిన్ చకనన్
స్వంతము వారుయు అసహన
మెంతయొ చేతురు మునకయు మెంతయు లేకన్
మనిషి ఎంతటి చక్కగ ఉన్నా స్వంతంగ ముఖముయు ,జలకము,సవరించకన్=సవరించక,స్వంతము వారును=స్వంతపు మనుషులు,అసహన=అసహించుకొనుడు,మెంతయొ=ఎంతనో,చేతురు=చేయుదురు,మునకయు=స్నానము,మెంతయు=ఎంతను,లేకన్=లేకుండా.
{39}కందం--
గాలిను కుంభిని నగ్నియు
నేలన్ నీరును ఖతలము నెరుగగ భవుడున్
బాలలు బాలిక వృద్దులు
వేలన్ జీవుల కదలిక వేశము చూడన్
గాలిన్,కుంభి,నగ్ని=గాలి,భూమి,అగ్ని, నీరు-ఖతలము=నీరు,ఆకాశము,నెరుగగ=చూడగా,భవుడున్=భగవంతుడు,బాలలు-బాలిక-వృద్దులు=బాలలు,బాలికలు,వృద్ధులు,వేలన్=వేలుగా,జీవుల=రకరకాల జీవుల,కదలిక=చలనము,వేశము=నివాసము,చూడన్=చూచుటకు.
{40}కందం--
దేవుడు డెప్పుడు జీవుల
దైవత మాదిరి అనుకృతి దైవము చూడన్
భావము వేరయి జీవులు
దైవుని భాషలు అనుమితి దైవుని భావం
{41}కందం--
పుట్టిన జీవియు మరలను
పుట్టెడు జీవియు తలరుచు పూర్తిగ భేదం
పుట్టిన దెందరొ మరలను
పుట్టెడి దెందరొ జగముకు పూర్తిగ లెక్కే
{42}కందం--
అన్ని జీవ రాశులలో గుర్రము{రత్యం} ఎప్పుడూ పడుకోదు-నిదుర వచ్చినా నిలబడే కాస్తంత కునుకు తీయును-దానికదే సాటి-------
రత్యము పండదు ఎప్పుడు
రత్యము నిలబడి కునుకును రాత్రంతయునున్
నిత్యము నిలుచునె ఉండగ
సత్యము ఏమిటొ ఎవరికి సరిగను దెల్సా
రత్యము= గుర్రము, పండడు = పడుకొనడు,ఎప్పుడు = ఎప్పుడు,రత్యము=గుర్రము,నిలబడి=నిలుచొని,కునుకును=చిన్న నిదుర,రాత్రంతయున్=రాత్రంత,నిత్యము=ప్రతిరోజు,నిలుచునె ఉండగ=నిలుచోనే ఉండగ,సత్యము ఏమితొ=సత్యము ఏమితొ,ఎవరికి=ఎవ్వరికి,సరిగను=సరిగా,తెలుసా=తెలుసునా,
{43}కందం--
మనిషికి జీవికి మనుగడ
కనగను బ్రతుకున ప్రియమగు కారణ మొకటే
వినగను నాలుక రసములు
కనులకు చూపుకు కనబడు కాంతుల మయమై
{44} కందం--
గుర్రము గుడ్డిది ఐనను
గుర్రము తినదా శనగలు గుర్తుకు రాగన్
గుర్రము మాదిరి తినినను
గుర్రము తీరుగ మెలుగగ గురుతెది హరికిన్
{45}కందం--
విష్ణువు మూర్థికి సహజము
విష్ణువు ఎప్పుడు కననగు వింతయు ఏమన
విష్ణువు కోరున దొక్కటె
విష్ణువు ఏపని తలచిన విజ్ఞత తోడన్
కందం--
{46} భార్యయు భర్తయు పిల్లలు
కార్యపు భావము కలిగియు కాతగ నిల్వన్
కార్యపు భారము తగ్గగ
కార్యము దొరకొను వెనుకటి కార్యం వోలెన్
{47}కందం--
తల్లియు పిల్లల ఆదట
తల్లియు పిల్లల శుభమును తక్కువ లేకన్
తల్లియు పిల్లల నేర్పరి
తల్లియు పిల్లల తనరుపు తాలిమి తోడన్
{48}కందం--
మనిషికి కూడా కన్నులు మూడు-అనగా మనిషి నిద్రలో కూడా కలలు పడితే చూడ గలడు-
మనిషికి కన్నులు మూడుయు
మినుసిక దయ్యము విధముగ మించరి జూడన్
మనిషికి కన్నులు రెండై
మనిషియు నిద్రించు సమయ మానక చూడున్
మనిషి=మానసి,కన్నులు మూడు--అదియెట్లన్నన్--మినుసికదయ్యము=శివుడు,విధముగ=ఆ తీరుగా,మించరి=దేవతలు,మనిషికి=మానసికి,కన్నులురెండై=కన్నులు రెండైనా- మనిషి నిద్రించు సమయమున కలలో మూడవ కన్ను చూచును.
{49}కందం--
లోహము లోనున బంగరు
లోహము మెరుగై దుడుకడు లోనగు పడుచున్
దేహము మెరుపుకు లోనయి
దాహము తీరక తలిపిత దాహా బింకన్
లోహము=బంగరు,దుడుకుడు మరియును బాలిక దేహము మెరుగై,తలికి తండ్రికి,దాహము తీరక ఇంకా దాహం-అంటె బంగారానికి అంత ప్రీతి.
{50} కందం--
భూమండ లంబున రవియె
భూమిన పుట్టిన జననము భూయస్సుండన్
భూమికి జలముయు అగ్నియు
భూమికి వాయువు ఖతలము భూరిగ జూడన్
భూమండలము=భూమి,రవి=సూర్యుడు,భూమికి=భూమికి=పుట్టిన=కలిగిన,జననము=జన్మ,భూయస్సు=అతిగ,ఉండను= ఉండగా,భూమికి=భూమికి,జలమును=నీరు,అగ్ని=నిప్పు,భూమికి=భూమికి,వాయువు=గాలి,ఖతలము=ఆకాశము,భూరిగ=అధికముగా.జూడను=చూచు
{51}కందం--
చాయయు కాఫీ పొద్దున
చేయగ లేచియు చవిగొను చేష్టలు జూడన్
చేయగ లేచియు దెచ్చెడి
తోయలి మెప్పును ఇడుకొన తోషము పొంగున్
{52}కందం--
జీవము గలగిన శక్తికి
జీవన తప్పదు అనిశము జీవము సాగన్
ఈవియు ధర్మము చేయను
జీవము ఉండిన వరకును జీవికి పసయే
{53}కందం--
ఎక్కడి కేగిన పిల్లడు
పక్కన జేరుతు తలికిని ప్రాణం అనుచున్
చక్కని బాబును ఎప్పుడు
ఎక్కడ గూడను వదులదు ఏమిటొ ప్రేమా
{54} కందం--
కోడియు కూసిన వేళను
పాడియు పితికెటి సమయము పాడియు గాగన్
ఆడుది గూదను జంటయి
ఆడుది మగడును దుగుణము ఆమడ కైనన్
***
సుదర్శన రావు పోచంపల్లి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.




Comments