top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

మతిమరుపు


'Mathimarupu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'మతిమరుపు' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి


సుషేణ్ పరమ విష్ణు భక్తుడు. తన పేరుకూడ విష్ణువుదే కనుక సదా సంతోషముతో ఉంటాడు. భార్య పేరు వసుంధర. పెళ్ళయి చాలా కాలమైన సంతానము కలుగనందుకు సదా విష్ణువును ప్రార్థిస్తూ ఉంటాడు. విష్ణువు దయనో.. ప్రకృతి విధమో.. తొలుత ఒక కూతురు జన్మిస్తుంది. తన భక్తికి పారితోషికంగా కూతురుని విష్ణువే ప్రసాదించినాడని కూతురు పేరు ‘పారితోషిక’ అని నామకరణము చేసి అల్లారు ముద్దుగా పెంచుతుంటారు సుషేణ్, వసుంధర.


రెండు సంవత్సరాలకు ఒక పుత్రుడు జన్మించుతాడు. ఇదీ ఆ భగవంతుని దయయే అనుకొని కొడుకుకు కేశవ్ అని పేరు పెడుతాడు.


సుషేణ్ కు ఉద్యోగ మేమి లేదు. పూర్వీకులనుం డి సంక్రమించిన ఇల్లు, వ్యవసాయ క్షేత్రము తప్ప. భక్తుడైనందున ఏ దురలవాటులు లేక పెద్దల ఆస్తి కరుగకుండ వ్యవసాయము చేసి ఆ ఫలసాయముతో జీవనము సాగిస్తుంటారు..


సుషేణ్ కు ఒక ఆలోచన వస్తుంది. విష్ణువును సదా తలుచుకొనడానికి ఒక శ్లోకము ఏదేని పండితుని ద్వారా వ్రాయించుకుంటె బాగుండునని తలచి హరిహర శాస్త్రి అనే పండితుని వద్దకు పోయి విష్ణువు మీద ఒక మంచి శ్లోకము వ్రాసీయమంటాడు. హరిహర శాస్త్రికి విష్ణువు శివుడు అను భేదము లేదు. అయినా సుషేణ్ అడిగాడు గనుక శ్లోకము వ్రాయ బూనుకుంటాడు.


ఇటు నాకు శివ కేశవుల మీద భక్తి తగ్గకుండ అటు సుషేణ్ కోరిక తీరేటట్టు అని ఒక శ్లోకము వ్రాసి ఇస్తాడు హరి హర శాస్త్రి. ఆ శ్లోకము ఏమిటంటే..


"గవీశ పాత్రో నగజార్తి హారీ

కుమార తాతాశశి ఖండ మౌళి

లంకేశ సంపూజిత పాద పద్మహః

పాయాదనాది పరమేశ్వరో నః "


ఈ శ్లోకము సుషేణ్ కు ఇచ్చి రోజూ చదువుకొమ్మంటాడు హరిహర శాస్త్రి.


సుషేణ్ ఆ శ్లోకాన్ని ఒకటికి రెండు సార్లు చదువుకొని ‘ఈ శ్లోకము మొత్తము శివుని స్తుతించినట్టే ఉన్నది. ఈ పండితుడు నాకు మోసము చేశాడు’ అనుకొని ఆ శ్లోకాన్ని వేరే పండితునికి చూపిస్తూ “హరిహర శాస్త్రిని విష్ణువు మీద శ్లోకము వ్రాసి ఈయ మంటె ఆ మహానుభావుడు శ్లోకము అంతా శివుని గూర్చి వ్రాసినట్టే ద్యోతక మయితున్నది” అంటాడు సుషేణ్.


ఆ పండితుడు శ్లోకాన్ని చదివి “ఇందులో తప్పేమి లేదు. నీవు అడిగినట్టే విష్ణువు మీదనే వ్రాశాడు. వివరంగా చెబుతాను వినుము” అంటాడు.


“ఈ శ్లోకములో ఏముంది.. పరమేశ్వర నః పాయాత్ అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్థం. తక్కిన పదాలన్నీ పరమేశ్వరునికి విశేషణాలు. అర్థం చూడండి- గవీశ పాత్ర అంటే గవాం ఈశో.. గవీశ అంటే ఆవులకు ప్రభువైన వృషభము. ఇది వాహనంగా గలవాడు- గవీశ పాత్ర అంటే సదా శివుడు.


నగజార్తహారీ- నగజ అంటే పార్వతీ దేవి. ఆమె ఆర్తిని పోగొట్టిన వాడు సాంబశివుడు.. కుమార తాతా {తాత అంటే సంస్కృతములో తండ్రి అని అర్థం} ఇక్కడ కుమార స్వామి తండ్రి అయిన వాడు శివుడే కదా! శశిఖండ మౌళి అంటే చంద్ర వంకను శిరమున ధరించిన వాడు శివుడే.


లంకేశ సంపూజిత పాద పద్మ అంటే లంకాధిపుడైన రావణునిచే పూజింపబడిన పాదపద్మములవాడు. అనాది అంటే ఆది లేనివాడు అంటే ఆది మధ్యాంత రహితుడైన వాడు అటువంటి పరమేశ్వర నః పాయాత్ అంటే మనల కాపాడు గాక అని అర్థం;


వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమారస్వామి తండ్రి, చంద్ర శేఖరుడూ, రావణునిచే సేవింపబడినవాడూ, అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాపాడుగాక అని దాని అర్థం. తాత్పర్యం.


అయితె ఇందులో ఉన్న కిటుకు ఏమిటంటె శ్లోకము చివరలో "పాయాదనాది పరమేశ్వరో నః అంటె ప్రది పాదములో మొదటి అక్షరము తీసి వేసి చదువుకోవాలె.

పరమేశ్వరుడు ఎట్లాంటి వాడంటె అనాది అట అంటే ఆది {మొదలు}లేనివాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరము లేనివాడు ఇప్పుడేమయ్యింది రమేశ్వర అయింది అంటే లక్ష్మీపతి విష్ణువేకద. గవీశ పాత్రో "గ" తీసెయ్యండి వీశపాత్ర అవుతుంది. "వి"అంటే పక్షి అని అర్థం వీనాం ఈశో వీశ- పక్షుల రాజైన గరత్మంతుడు. ఏతావాతా గరుడవాహనుడైన విష్ణువు. నగజార్త హారీ- మొదటి అక్షరము ‘న’ తీసెయ్యండి. అప్పుడు గజార్తి హారీ అవుతుంది. అంటే గజేంద్ర మోక్షము చేసిన విష్ణువు. కుమార తాతా- ఇందులో మొదటి అక్షరము "కు" తీసేస్తె మారతాతా అంటే మన్మథుని తండ్రి అయిన విష్ణువు. శశిఖండ మౌళి మొదటి అక్షరము ‘శ’ లేకపోతె శిఖండ మౌళి అంటె నెమిలి పింఛము ధరించిన విష్ణువు.


లంకేశ సంపూజిత పాద పద్మః- మళ్ళీ మొదటి అక్షరం ‘లం’తిసేయ్యండి. కేశ సంపూజిత పాద పద్మః.. ఇక్కడ ‘క’ అంటె బ్రహ్మ. ఈశ అంటె రుద్రుడు. పూజించిన పాదములు కల విష్ణువు.


గరుడ వాహనుడు, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడు, మన్మథుని తండ్రి, నెమిలి పింఛము దాల్చిన వాడు, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కల వాడు ఐన రమేశ్వరుడు {విష్ణువు}మనలను కాపాడు గాక అని అర్థం,

తాత్పర్యం”.


అప్పుడు సుషేణ్ తృప్తి చెందుతాడు.

కొత్త పండితుడు ఇంకా చెబుతాడు సుషేణ్ కు..

శివ కేశవులలో భేదము లేదని శివుణ్ణి పూజిస్తే విష్ణువును పూజించినట్టే, విష్ణువును పూజిస్తే శివుణ్ణి పూజించినట్టే అని.


శివాయ విష్ణు రూపాయా . శివ రూపాయ విష్ణవే.

శివస్య హృదయం. విష్ణోర్విష్ణోశ్చ హృదయం శివ.


అప్పుడు సుషేన్ సంపూర్ణ తృప్తితో పండితునికి నమస్కరించి ఇంటిదారి పడుతాడు. సుషేణ్ ఇక రోజూ మొదటి పండితుడు వ్రాసి ఇచ్చిన శ్లోకాన్నే చదువ పూనుకుంటాడు.


కొన్నాళ్ళకు సుషేణ్ కు మతి మరుపు వస్తుంది. పక్క పక్కకే ఉన్న శివ కేశవ గుడులలో ఒకసారి విష్ణువు గుడికి ఒకసారి శివుని గుడి పోయి వస్తూ ఉంటాడు. గుడి ఏదైనా గవీశ పాత్రో అనే శ్లోకమే చదువుతాడు. ఆయా గుడులకు వచ్చిన భక్తులు సుషేణ్ ను నిందించ సాగారు. కారణo ఆ శ్లోకము అంతరార్థము పూర్తిగ అర్థము కాక. అది విడమరిచి చెబుదామనుకుంటె సుషేణ్ కు రోజు రోజుకూ మతిమరుపు పెరుగుతూ ఉంటుంది.


తరువాత తరువాత శ్లోకాన్నే మరచిపోతాడు. భార్య పిల్లలు కూడ ఇతడి వాలకానికి బాధ పడుతుంటారు. భక్తి మాత్రము మరువ కుండా రోజూ ఏదో ఒక గుడికి పోయి వస్తుంటాడు సుషేణ్.


రోజు రోజుకు పెరుగుచున్న సుషేణ్ మతిమరుపుకు కుటుంబ సభ్యులు కలత చెందు చుంటారు. ఏ ఉపాయము తోచక సుషేణ్ కు శ్లోకము వ్రాసి ఇచ్చిన పండితుని దగ్గరకు పోయి అతనిని నిలదీస్తారు. అలాంటి శ్లోకము వ్రాయుటలో మీ ఆంతర్య మేమిటి అని.


ఏదో పెద్దమనిషి అని వ్రాసి ఇచ్చిన నాది పొరపాటే. నేను ఇక శ్లోకాలు వ్రాయడమే మానుకుంటాను. మీకు ఎవరైనా తెలిసి ఉంటే ఏ భజనో, కీర్తనో సులువుగా బోధ పడేవి వ్రాయించుకొండి. లేదా పౌరాణిక చిత్రాలలో మీకు అర్థమైన దేదైన ఉంటే వ్రాసుకొని ఆ పెద్ద మనిషిని చదువ మనండి” అని సలహా ఇస్తాడు మొదటి పండితుడు హరిహర శాస్త్రి.


అసలు ఇతని పేరులోనే శివ కేశవులు కలిసి ఉండడము చే అభిమానము చంపుకొన లేక ద్వందార్థ శ్లోకము వ్రాసిచ్చాడు అనుకుంటూ వెళ్ళి పోతారు.


శ్లోకము బాగున్నా అర్థము కానివారితో ఇదే తంటా అనుకుంటాడు హరిహర శాస్రి.


సుషేణ్ భార్య వసుంధర, కూతురు పారితోషిక, కొడుకు కేశవ్ ఎట్లనైన సుషేణ్ మతి మరుపు తగ్గించాలని తలంపుతో వార్తా పత్రికలు, పుస్తకాలు చదివి నివారణోపాయం కనుక్కుంటారు.

మతి మరుపు సమస్య చాలా ప్రమాదకరమైనది. ఇక ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వారిని కూడా ఈ మతి మరుపు సమస్య చాలా ఎక్కువగా వేధిస్తోంది. ఐతే సరైన జీవనశైలితోపాటు ఇంకా అలాగే కొన్ని ఆహార అలవాట్ల ద్వారా బుర్రను బాగు చేసుకోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే మతి మరుపు అనేది అసలు నయం చేసుకోలేని జబ్బుకాదు.


1. పాలకూర: పాలకూర అనేది ఏకాగ్రతను పెంచడంతో పాటు మెదడు పనితీరును కూడా బాగా మెరుగుపరుస్తుంది..


2. కాఫీ ఇంకా టీ: కాఫీ లేదా టీ కూడా మతిమరుపు సమస్యను సులువుగా పోగొడతాయి. ప్రతి రోజూ కూడా రెండు నుంచి మూడు కప్పులకు మించకుండా తాగే కాఫీ లేదా టీ వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. కాఫీ లేదా టీ బాగా చురుకుగా ఉండేందుకు దోహదపడతాయి.


3. చేపలు: ఆహారపుటలవాట్లను బట్టి ఇంకా అలాగే ఇష్టాయిష్టాలను బట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు కనుక చేపలు తింటే మతిమరుపు తగ్గి ఏకాగ్రత అనేది బాగా పెరుగుతుంది..

4. క్యారట్‌: ఇక క్యారెట్ కూడా మతిమరుపు సమస్యకి చాలా మంచిది. ఇది వయసు పెరగడం వల్ల వచ్చే మతిమరుపు సమస్యను సులువుగా తగ్గిస్తుంది..


5. వాల్‌ నట్స్‌: వాల్ నట్స్ అనేవి జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు చురుకుదనం బాగా పెరుగుతుంది. ఇక పండ్లు, కూరగాయలు, హోల్‌ గ్రెయిన్స్, అన్‌సాచురేటెడ్‌ ఫ్యాట్స్ ఇంకా అలాగే తక్కువ మొత్తంలో తీసుకునే రెడ్‌ మీట్‌ మతిమరుపు అనే వ్యాధిని నిరోధిస్తాయని

తెలువగానే ఆ తీరుగనే క్రమం తప్పకుండ తెలిసుకొన్న ఆహార పదార్థాలను సుషేణ్ కు పెడుతూ కొంతవరకు సఫలీకృతులౌతారు. ఇక సుషేణ్ మునుపటి మాదిరిగనే ఉండి, భక్తి తత్పరతతో మెలుగుతుంటాడు.


సమాప్తం.


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.



82 views0 comments

Comments


bottom of page