top of page

రసస్పందన


'Rasaspandana' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'రసస్పందన' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

నగధర్ మధ్యతరగతి కుటుంబీకుడు. ఆదాయము అంతంత మాత్రమే. భార్య పేరు వైదర్భి. వర్ణించే అంత అందము కాకున్నా అనాకారి కాదు. కాకపోతె అందరూ సహనశీలి అంటుంటారు. వారికి ముగ్గురు కొడుకులు. కూతుర్లు లేరు.


కొడుకులు వరుసగా రామనాథ్, రంగనాథ్, శ్రీనాథ్. రామనాథ్ డిగ్రీకొస్తె రంగనాథ్ జూనియర్ కాలేజ్- శ్రీనాథ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. నగధర్ పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలలోనే చదివిస్తున్నాడు. పిల్లలు బుద్ధిమంతులే. చదువులో ముందంజలోనే ఉంటారు ముగ్గురు. అదొక్కటె తల్లి వైదర్భికి కలిగే సంతోషము.


ఇక నగధర్ కు ఆర్థిక స్థోమత లేకున్నా బయట శాలిని అనే సర్వవల్లభ ఒకతుంది. ఆదాయములో పావుభాగము ఆమెకు సమర్పిస్తుంటాడు నెలనెల- రసస్పందనాలోలుడై. వైదర్భికి భర్త సంగతి తెలుసు. అప్పుడప్పుడు మందలించినా విలోమవాలమే. గుణము మానడు. అతని రసపిచ్చి అటువంటిది.


సర్వవల్లభ గర్భం దాల్చినందున ఒక మగశిశువు జన్మిస్తాడు. ఆమె చెంతకు వచ్చిన వారందరిని నీకొడుకే అంటే నీ కొడుకు అని దబాయిస్తుంది శాలిని. పైగా ఆ శిశువు పోషణకు అధిక సొమ్ము అడుగుతుంది. నగధర్ కు ఎటూ తోచక ఇంట్లో తన అర్రలో కూర్చొని ఏడుస్తుంటాడు.


నన్ను కోరు పడతి నాచెంత నుండగ

అతిగ రసము పిచ్చి అంధు జేసె

వార కాంత చెలిమి వద్దని వారించ

భార్య మాట వినక భ్రష్టు పడితి


అనుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు నగధర్. విధిలేక భార్యయే తనకీ పరిస్థితిలో రక్షకురాలనుకొని మనసులో సిగ్గు పడుతూ ఐనా భార్యకు జరిగిన వ్యవహారమంతా చెబుతూ భార్య కాళ్ళమీద పడుతాడు నగధర్.


అటు తనకు జరిగిన అన్యాయానికి, ఇటు భర్తకు కలుగుచున్న అవమానానికి. ఎదిగిన పిల్లలకు తెలిస్తే కలుగబోయే పరిమాణానికి మనసు మథన పడుచూ తానూ ఏడుస్తుంది వైదర్భి ఏ యోచన స్ఫురించక.


మొదటినుండి భర్తను ఎదిరించి ఎరుగని మనస్తత్వము ఆమెను ఇంకా కృంగదీస్తుంది. ఆమెకు ఒక ఆలోచన తట్టి భర్తతో అంటుంది.


“కాలిన మచ్చ ఎన్నటికీ పోదు. కాకపోతె మంట మాత్రము ఏదో ఉపచారముతో ఉపశమనం కలుగుతుంది. మీరు నెలనెలా ఆ మిటారికి తగలేసే సొమ్ముకు కొంత అధికము జోడించి దానితో ఒక కాగితము వ్రాయించుకొండి.

"వారకాంత వృత్తితో బ్రతుకుచున్న శాలిని అనే నేను చాలా మందితో యుక్తము నగధర్ అనునతనితో సావాసము చేసినందున నాకు కలిగిన ఈ మగశిశువు పోషణ భారము వహించ వలసినదిగా కోరగా తనబాధ్యత కాదంటూ అయినా నగధర్ గారు నాకు అడిగినంత సొమ్ము చెల్లించినాడు. కృతజ్ఞతలు. ఇకముందు ఆయన ప్రతిష్టకు భంగము కలుగకుండా నాతో సావాసము వదులుకొమ్మని హృదయపూర్వకముగా కోరుచున్నాను.


ఇట్లు శాలిని, వారకాంత.


అని వ్రాసి దాని తో సంతకము తీసుకొండి. సాక్షులుగా మీ సోదరుల సంతకము కూడా తీసుకొండి” అంటుంది వైదర్భి.


“సోదరులు అంటె ఎవరు?” అని అడుగుతాడు నగధర్.


“అదేనండి మీ సహచరులు. {తొత్తులమారులు }” అంటుంది వైదర్భి.


నగధర్ కు బయటకంటె భార్య చూపిన అంగీకార పత్రమే నిలువునా సిగ్గుతో దహించేస్తుంది.


విధిలేక పోయి శాలినికి సొమ్ము చెల్లించి ఆమె సంతకము. సాక్షుల సంతకము తీసుకొని వస్తాడు నగధర్.

సర్వ వల్ల భంటు సరిగను దెలియక

కాలు జారె నాది కలన లేక

భంగ పడితి నేను భార్యకు దెలియగ

రసము పిచ్చి యెంతొ రట్టు జేసె


అనుకుంటు మనసులో కృశించి పోతాడు నగధర్. ఇంత సాధ్వి దొరికినా నేనంటే ఆమెకు జుగుప్స కలిగే పరిస్థితి తెస్తిగదా అని విలపించుతాడు నగధర్.


ఆనాటినుండి నగధర్ కు ఉల్లాసమంటే ఏమిటో తెలువకుండ కాలం గడుపుతుంటాడు వివర్ణ ముఖం తో. జరిగిన సంఘటణ కొడుకులకేమాత్రము తెలియనీదు వైదర్భి.


పతివ్రతకు పడుపు కోమలికి మధ్య ఉన్న భేదమేమిటో అప్పుడు తెలిసొస్తది నగధర్ కు.


ధర్మ భాగి నుండ ధర్మము వదలుచు

ఆట వెలది యింట అడుగు ఇడగ

పరువు పోవు చుండు పదుగురి ముందట

చేయ రెవరు సేవ చేవ జావ


ఉన్న సొమ్ము అంత ఊడ్చుక తినగను

సాని కేను జూడ సాధ్య మగును

జాని మాత్ర మెరుగు జాగ్రత యింటను

ఆపు చుండు ఎపుడు అధిక వెయము


అనుకుకుంటు బాధ పడుచుంటాడు నగధర్. ఇక ఇంట్ల గొర్రెలా తలదించుకొని నడుస్తుంటాడు పశ్చతాప పడుచు.

తండ్రి వాలకము కొడుకులను ఆశ్చర్యపరుస్తుంది కాని తండ్రి ఘనకార్యాలు తెలువవు. అదే పెద్ద ఉపశమనము నగధర్ కు.


వైదర్భి మాత్రము భర్తను సదా కనిపెడుతూ ఉంటది. అయినా ఇంకా బుద్ధి రాకుండా ఉంటదా ఈ మనిషికి అని భార్యగా జాలిపడుతు. ఇల్లాలిగా ఇంకా జాగ్రత్తగానే ఉంటూ ఉంటది. రసపిచ్చి నగధర్ ను నీరస పరుస్తది. భర్త దగ్గర డబ్బులు లేకుండా జాగ్రత పడుచుంటది- అతని కదలికలు కూడా సదా కనిపెడుతూ వైదర్భి.


తండ్రి పోలిక కొడుకులకు రాకుండా కాకిమీద పిట్టమీద కథలల్లి చెబుతుంటది, వారైనా బుద్ధిమంతులు కాగలరని ఆశతో వైదర్భి.

సమాప్తం.

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


47 views0 comments
bottom of page