top of page

మూడు ముక్కలాట


'Mudu Mukkalata' - New Telugu Story Written By Pitta Gopi

'మూడు ముక్కలాట' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


దానయ్య ఈలోకం విడిచి మూడు రోజులయ్యింది. ఇంటి ముందు శవం మాత్రం ఐస్ బాక్స్ లో అలాగే ఉంది.


ఇంట్లో తనకు తన దగ్గర, దూరపు బంధువులు కోకొల్లలుగా వచ్చారు అంతేనా.. చాలా మంది పోలీసులు కూడా వచ్చారు.


చిన్న చితక అందరూ చివరి చూపునకు వచ్చారు.


ఎటు చూసిన ఏదో మాటలే తప్పా.. కన్నీరు కార్చే నాథుడు ఒకడు లేడు. ఎక్కడో ఒకరో ఇద్దరో మనసున్నోళ్లు మాత్రం పగవారికి కూడా ఈ పరిస్థితి రాకూడదని అంటూ నిట్టూర్చే వారు లేకపోలేదు.


సుందరమైన ఆ ఇంటి ముందు సువిశాల ప్రదేశం జనంతో కళకళలాడుతూ ఉంది.


అక్కడ హడావుడి ఎలా ఉందంటే.. ఒక శుభకార్యంలా బంధు మిత్రులు గుంపులు గా మాట్లాడుకునేలా అచ్చం అలాగే ఉంది. కొంతమంది పోలీసులు కూడా బంధుమిత్రులతో మాట్లాడుతున్నారు.


ఏం జరుగుతుందా అని చూసేవాళ్ళు కొందరు, ఎప్పుడు అంత్యక్రియలు జరగుతాయా.. అని మరికొందరు మనసులో అనుకోక మానరు.


కారణం..


దానయ్య పెద్ద వ్యాపారవేత్త. ఆయన తన పని తాను చేసుకోవటమే తప్పా తనకు ఇంత గుర్తింపు ఉండాలని, అంత గౌరవం ఉండాలని ఎప్పుడు అనుకోని మనిషి. మంచివాడు. అతనికి తన గ్రామంలో ఇళ్ళు, వేరే చోట పొలాలు, ప్యాలెస్ లు, పరిశ్రమలు ఉన్నాయి.


మరియు కష్టమో, సుఖమో.. బతికున్నంత కాలం మనకు నచ్చినట్లుగా బతకటమే మేలని అలోచించే మనిషి. అందుకే ఒకరి పొట్ట కొట్టకుండా బతకలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు వారిని బాగానే చూసుకున్నాడు. దానయ్య కు ఇద్దరు కొడుకులు. వారికి ఏడు, తొమ్మిది వయసు ఉండగానే భార్య శ్యామలమ్మ తో విభేదాలు వచ్చాయి. అప్పటి నుండి శ్యామలమ్మ, దానయ్య కు దూరంగా ఉంటుంది.



భార్య ఎప్పటికీ తన దగ్గరకు రాననటంతో శ్యామలమ్మ కు విడాకులు ఇవ్వకుండానే భారతమ్మ అనే మహిళను పెళ్ళి చేసుకున్నాడు.


దానయ్య పై కోపం తగ్గని శ్యామలమ్మ వాడేలా పోతే నాకెందుకు అనుకుందో ఏమో.. ఏనాడూ దానయ్య రెండో పెళ్ళి ని వ్యతిరేకించలేదు.


దానయ్య భారతమ్మల కాపురం బాగానే సాగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటు బతుకుతున్నారు.


కాలం ముందుకెళ్ళగా


భారతమ్మ కు కొడుకు, కూతురు పుట్టారు.

వారు కాస్త పెరిగాక భారతమ్మ అనారోగ్యం బారిన పడింది.


ఎంత డబ్బు ఉన్నోడైనా.. తన ప్రాణాన్ని కొనుక్కోలేడు, భద్రంగా దాచుకోలేడు కదా.. దానయ్యను విషాదం లోకి నెట్టి భారతమ్మ కన్ను మూసింది. దీంతో దానయ్య మూడో పెళ్ళికి సిద్దమయ్యాడు.


మూడో పెళ్ళి చేసుకున్న దానయ్య తన మూడో భార్య,

భారతమ్మ పిల్లలను బాగా చూసుకోదని బావించి భారతమ్మ తల్లిదండ్రులు సహయం తో భారతమ్మ తమ్ముడు తీసుకుని వెళ్ళి పోషిస్తున్నాడు.


మూడో పెళ్ళి తో దానయ్య ఇంట్లో సుగుణమ్మ వచ్చింది.

కొంత కాలానికి సుగుణమ్మ కు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు.


వారిని, సుగుణమ్మను జాగ్రత్తగా చూసుకుంటు వస్తున్నాడు దానయ్య.


ఒకవైపు తన పనులు, మరో వైపు కుటుంబం బాగానే ఉన్నా.. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు బాధపడటం కంటే ఎప్పుడు పోతామో తెలియని రోజుల్లో ప్రశాంతంగా బతకాలనే ఆలోచన గల దానయ్య తనకు నచ్చే విధంగా బతుకుతున్నా

గత కొంత కాలంగా ఎక్కడో వెలితిలా నెట్టుకొస్తున్నాడు.


శ్యామలమ్మ, భారతమ్మ, ఇప్పుడు సుగుణమ్మల వలన తనకు జీవితం మూడు ముక్కల్లా గుర్తులు పెట్టింది కదా మరీ..


తన గ్రామానికే కాదు, చుట్టుపక్కల గుర్తింపు ఎరిగిన దానయ్య మూడు ముక్కల జీవితం గూర్చి కూడా అందరికీ తెలుసు.


అయితే ఈ మూడు ముక్కల జీవితంలో తనది తప్పు కాదు. శ్యామలమ్మ ది.


ఏ సంసారంలో అయినా చిన్నపాటి గొడవలు ఉంటాయి. సర్ధుకుపోకుండా దానయ్యను దూరం పెట్టడంతో ఈ ముక్కలాట ఇక్కడికి వచ్చింది.


అయితే పిల్లలు పెద్ద వాళ్ళు అవటం, దానయ్య వయసు పెరగటం జరిగిపోయాయి.


చాలా కాలంగా దానయ్య ఇంటికే పరిమితము అయ్యాడు. చూడ్డానికి శ్యామలమ్మ పిల్లలు కానీ.. , భారతమ్మ పిల్లలు కానీ.. వారి తరఫు బంధుమిత్రులు కానీ రాలేదు.


ఆ తర్వాత మంచం పట్టి ఏ రాత్రో ప్రాణాలు వదిలాడు దానయ్య.


తెల్లావారి సుగుణమ్మ ఈ విషయం దండోర వేయించగా దానయ్య అభిమానులు, తోటి వ్యాపారస్తులు, చిన్న వ్యాపారులు, ఇంకా తెలిసిన వాళ్ళు ఇంటికి చేరుకున్నారు.


మరికాసేపట్లో అంత్యక్రియలు కి ఏర్పాట్లు అవుతాయనగా..


శ్యామలమ్మ పిల్లలు, వారి బంధువులు,

భారతమ్మ పిల్లలు, వారి బంధువులు కూడా వచ్చారు.


దానయ్య పై ప్రేమతో కాదు, వారసులు గా తమకు రావాల్సిన ఆస్తులు కోసం.


అవును మరి.. మూడు రోజులు గా దానయ్య శవం ఇంటి ముందరే ఉండటానికి కారణం ఇదే.


“సుగుణమ్మ అంత్యక్రియలు చేయటానికి వీల్లేదు, ఆమె తో పాటు మా తల్లి కూడా ఇతనికి భార్యే కాబట్టి ఆస్తులు పంపకం తేలాకే అంత్యక్రియలు జరుగుతాయని తేల్చి చెప్పటంతో, చేసేది లేక సుగుణమ్మ పోలీసులను తెచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.


పోలీసులు కలుగజేసుకుని శ్యామలమ్మ బంధువులకు, భారతమ్మ బంధువులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చాకనే అంత్యక్రియలకు ఒప్పుకున్నారు.


దానయ్య అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ రాలేదు కానీ.. ఆస్తుల కోసం మాత్రం వచ్చారని అక్కడ గుమిగూడిన వారందరూ మాట్లాడుకుంటున్నా.. సిగ్గు లేని సమాజానికి, సిగ్గు లేని మనుషులు దొరికినట్టు శ్యామలమ్మ పిల్లలు, బంధువులకు, భారతమ్మ, ఆమె పిల్లలు, బంధువులకు బుర్రకు ఎక్కితే కదా..


ఇలా దానయ్య మూడు ముక్కలు జీవితంలో ఆయన ఆస్తుల పంపకం మొదలెట్టారు పోలీసులు.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం






31 views0 comments
bottom of page