పల్లె పిలిచింది - 40
- T. V. L. Gayathri
- 20 hours ago
- 3 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #మత్తకోకిల

Palle Pilichindi - 40 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 19/08/2025
పల్లె పిలిచింది - 40 - తెలుగు కావ్యము తృతీయాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
37.
తేటగీతి.
ఘనుడు వీరేశు కివ్విధిఁ గల్గబెంగ
పరుగుఁ బెట్టుచు వచ్చెనా వాణి యటకు
చెలిమికాని నోదార్చగ జెంత చేరి
కనుల బాష్పముల్ కురిపించి కాంతపలికె.//
తాత్పర్యము.
వీరేశునికి ఇలా కష్టం వచ్చిందని తెలిసి పట్టణము నుండి అతడి స్నేహితురాలు వాణి పరుగుపెడుతూ వచ్చింది. స్నేహితుడిని ఓదార్చుచూ కళ్ళనీళ్లు పెట్టుకుంది.//
38.
తేటగీతి.
"ఎందుకోయి!నీ విట్టుల నెత్తికొనుట?
వసుధకొఱకు తాపత్రయ పడకు సఖుడ!
మిన్నకుండిన చాలులే మేలుకలుగు!
తనువుడయ్యను చాలించు తగని పనులు!//
తాత్పర్యము.
"ఈ ప్రపంచం కోసం నీకు ఎందుకు ఇంత తాపత్రయం? నీ శరీరం చూడు!ఎంత దెబ్బ తినిందో? నీలాగా ఎవరైనా ఉన్నారా? చాలించు వీరా!ఇటువంటి పనులు!"
39.
మత్తకోకిల.
నిన్ను నమ్మిన చిన్నదానను నెమ్మిఁ జూపుమ వీరుడా!
కన్నవారిని కష్టపెట్టిన కాలమెట్టుల సాగునో!
విన్నపంబుల నాలకించుమ!ప్రేమమీర చరించుమా!
తన్నుమాలిన ధర్మమెందుకు? తాహతున్ గమనించుమా!"//
తాత్పర్యము.
నేను నిన్ను నమ్ముకొన్నాను. నువ్వు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నావు! నీ తాహతు ఎంత? తల్లిదండ్రులను కష్ట పెట్టి, నన్ను బాధ పెట్టి నువ్వు సాధించే దేమిటి? మంచిగా ఉండలేవా? "//
40.
తేటగీతి.
అట్లు నుడివిన జవ్వని నాదరించి
పలికె వీరేశు డీవిధిఁ బాధమరచి
"నష్టముల్ కల్గు ధరణికి నాశనంబు
పొంచి యున్నది ప్రక్కన ముప్పు మనకు!//
తాత్పర్యము.
అలా చెబుతున్న వాణితో ఆదరంగా వీరేశుడు ఇలా పలికాడు.
"భూమికి నష్టం కలుగుతోంది. దాని వలన మనకు ముప్పు పొంచి ఉంది."//
41.
తేటగీతి.
పొగలు గ్రక్కుచు భూమాత పొరలి పొరలి
యేడ్చుచుండగ నీ జనులెఱుగరైరి.
చెట్టులన్గొట్టి పెంచుచున్ బట్టణములు
గగన హర్మ్యముల్ కట్టుచు కాంచలేరు//
తాత్పర్యము.
భూమాత మండుతూ ఉంది.చెట్లను కొట్టి, పట్టణాలను పెంచుతూ భవనాలను కడుతూ ఉండి, ప్రజలు అసలు నిజాన్ని గ్రహించటం లేదు.//
42.
తేటగీతి.
కీడుగారేడియేషను కిరణములిల
వ్యాప్తి చెందగా విషమాయె వాయువిచట
జంతు జాలము మిగులక చచ్చిపోవ
పక్షి జాతులు నశియించె ప్రాణముడిగి//
తాత్పర్యము.
రెడీయేషను వలన గాలి విషంగా మారింది. జంతువులు చచ్చి పోతున్నాయి.పక్షి జాతులు నశించి పోతున్నాయి.//
43.
తేటగీతి.
నీచ సంస్కృతిన్ జేకొని నీతి మరచి
ప్రజలు పెంచుట మానిరి వనము లిపుడు
తరువు లు గిరులును నదీనదంబు లెపుడు
భువికి రక్షణ నిడుచుండి పొలయుచుండు //
తాత్పర్యము.
నీచమైన నాగరికతతో ప్రజలు నీతిని మరచిపోయారు. ప్రజలు అడవులను పెంచటం మానివేశారు. చెట్లు, పర్వతాలు, నదులు భూమికి రక్షణ నిస్తాయి.//
44
తేటగీతి.
ప్లాస్టికను భూతమున్ బెంచి వసుధ కిపుడు
హాని తలపెట్టి యీజనులదరిపడగ
భావి మిగలక నీధర భస్మమగును
తెలిసికొను వాణి !నిజమును తెలివితోడ."//
తాత్పర్యము.
భూతంలాంటి ప్లాస్టిక్కును వాడుతూ,ఈ భూమికి చేటు చేస్తున్నారు. చివరకు ఈ భూమిలో భస్మరాసులే మిగులుతాయి!కాస్త తెలివితో నువ్వయినా తెలుసుకో వాణీ!"//
45.
తేటగీతి.
వీరు డట్టుల నుడువంగ వెలది మదిని
భీతి పొడసూప నతనిపై ప్రేమపొంగ
"నీకు తోడుగా జరియింతు నిక్కమిదియె "
ననుచు ముద్దాడె నా వాణి యతని వలచి.//
తాత్పర్యము.
వీరేశుడు ఇలా చెప్తుంటే వాణికి మనస్సులో భయం వేసింది. వీరుడు చేస్తున్నది మంచి పని యని గ్రహించి, అతని మీద ప్రేమతో ముద్దుపెట్టి "నీకు తోడుగా నడుస్తాను!సత్యము చెబుతున్నాను! "అని చెప్పింది వాణి.//
(సశేషం)

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments