top of page

పల్లె పిలిచింది - 41

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #కందము

ree

Palle Pilichindi - 41 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 21/08/2025

పల్లె పిలిచింది - 41 - తెలుగు కావ్యము తృతీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


46.

వచనము.


మణివికాస,శ్రీనివాస,జగదీశుల మిత్రులు, వాణి, మంజరి, చిత్ర, హైమల మిత్రులు, గోవిందుడును పాచకుడగు శంభుని బంధువులును కలిసి రాజుపాలెమునకు వచ్చిరి. ఇంతమంది యొక సమూహముగా పల్లెకు తరలుట గాంచి పాత్రికేయులు, దూరదర్శన్  విలేకరులు వచ్చిరి. ఆ సంరంభమును గాంచి ప్రక్కన గల పల్లెజనులు వారివెంట పరుగులు పెట్టుచు వచ్చిరి. చూచువారల కదియొక పెద్దసైన్యమువలెనగుపించెను.//


భావము సులభగ్రాహ్యము.


47

కందము.


కదిలెను యువకుల సైన్యము 

'పదపద'మనుచుండి జనులు పంతముతోడన్ 

వెదకుచు వనచోరులకై 

నదలించుచు నరచుచుండ్రి నావేశముగన్.//


తాత్పర్యము.


"పదపద!" మంటూ పెద్ద సైన్యంలాగా జనులందరూ అడవికి పరిగెత్తారు. పంతము పట్టి జనమంతా కలప దొంగల కోసం వెదుకుచూ,ఆవేశంతో కేకలు పెడుతూ వెళుతున్నారు.//


48.

కందము.


గుంపును జూడగ భయపడి 

చంపుదురేమోయటంచు శత్రువులు క్రుంగన్ 

బెంపుగ  యువత చెలంగగఁ

దంపులఁ వీడంగ దుష్టతతి శోకించెన్.//


తాత్పర్యము.


ఆ పెద్ద గుంపును చూడంగానే కలప దొంగలు భయపడ్డారు. తమని చంపటానికి జనమంతా వచ్చారేమోనని తగాదా పెట్టుకొనే సాహసం చెయ్యలేదు.//


49.

కందము.


"ఓడితిమయ్యా!వనమును 

వీడిచరించెదముమాకుబింకము సడలెన్ 

దోడుగ వత్తుము మీకిట 

పాడుపనులఁజేయమెపుడుప్రార్థనఁవినరో!"//


తాత్పర్యము.


భయంతో ప్రజల వద్దకు వచ్చి"మేము ఓడిపోయాము!మాకు ధైర్యం లేదు. మీరు చెప్పినట్లుగా వింటాము!మా ప్రార్ధన విని మమ్మల్లి వదలి పెట్టండి!మీకు తోడుగా వస్తాము!"//


50.

తేటగీతి.


అట్లు పల్కిన చోరుల నాదరించి 

తరువులన్ బెంచు మనుచుండి తగిన విధులఁ

జెప్పి వెడలంగ జనులెల్ల చింత వీడ 

వనము నందలి సాలముల్ పరిఢవిల్లె.//


తాత్పర్యము.


ఇలా బ్రతిమిలాడుకొన్న కలప దొంగలను ఆదరించి,"అడవిలో చెట్లను పెంచమని"జనమంతా చెప్పగానే వాళ్ళు (ఆ దొంగలు) అడవిలో చెట్లు పెంచటం మొదలుపెట్టారు. అలా అడవిలో చెట్లు చాలా  చక్కగా పెరుగుతున్నాయి.//


51.

తేటగీతి.


తరువులు గిరులు నదులును దైవసములు 

విలువ నెరుగుచు కాపాడ వలయు సతము 

గ్రామపౌరులైక్యతతోడ నీమముమెయిఁ

మెల్గుచుండిన ధరణికి మేలు పొసగు.//


తాత్పర్యము.


చెట్లు, నదులు, పర్వతాలు దైవాల వంటివి. వాటి విలువను గ్రహించి కాపాడుకోవాలి. అప్పటి నుండి రాజుపాలెపు ప్రజలు పర్యావారణాన్ని కాపాడుతూఉన్నారు.//


52.

కందం.


మరలిరి యువకులు దండుగ 

గిరులను రక్షింప వారు కెరలుచు త్రుళ్లన్ 

వెరపున పాలకులత్తఱిఁ 

బరుగున వచ్చిరట కావ పర్వతసీమన్ //


తాత్పర్యము.


ఆ గ్రామస్తుల చొరవ చూడగానే పాలకులకు భయం వేసి,వెంటనే ఆ గ్రామానికి  వచ్చారు. అక్కడ ఉండే పర్వతాన్ని, అడవిని చూశారు.//


53.

కందం.


వరముల నిచ్చిరి ప్రభువులు 

సరియగు పాలనముతోడ జాతికి మేలున్ 

సరగున సల్పెద మంచును 

స్థిరమతులయి పల్కి రపుడు సేవకుల వలెన్ .//


తాత్పర్యము.


ప్రభువులు ఆ గ్రామాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు నిధులనిచ్చి, ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు.//


(సశేషం)


ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page