top of page

పల్లె పిలిచింది - 45

Updated: 7 days ago

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #తోవకము, #చంపకమాల

ree

Palle Pilichindi - 45 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 23/09/2025

పల్లె పిలిచింది - 45 - తెలుగు కావ్యము చతుర్థాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




1.

తోవకము 

న,జ, జ, య.

యతి -8.

అరయగ పశ్చిమ ప్రాంతమునందున్ 

వరలిరి నూతన వాంఛలు తీరన్ 

నిరతము సల్పిరి నిష్ఠగ సేవల్ 

కరువు జయించగఁ గాంచిరి ధీరుల్.//

తాత్పర్యము.

భారతీయ ఉద్యోగులు భూమికి పడమర దిక్కుగా ఉండే దేశానికి  మనవాళ్ళు వలస వచ్చారు. ధన సంపాదన కోసం నిరంతరము ధైర్యంతో ఆ దేశానికి సేవ చేస్తున్నారు.//

2.

తేటగీతి.

అమెరికాఖండ ప్రాంతంబు నడుగుమోపి 

నూతన వధూవరులు చిరు వేతనములఁ

బొంది యచ్చోట నివసించి పొదుపు తోడ 

గడుపుచుండిరి శ్రమఁ జేసి ఘడియ ఘడియ.//

తాత్పర్యము.

అమెరికా ఖండమునకు నూతన వధూవరులు వచ్చారు. వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, నిమిషనిమిషం ఎక్కువ శ్రమ చేస్తూ చాలా పొదుపుగా జీవిస్తున్నారు.//

3.

తేటగీతి.

ధనము కైవడి పరువెత్తి జనము నేడు 

పరుల దేశమునందున పడిరి బాధ 

కలలు తీరెడి మార్గముఁ గానలేని 

యువత నీరసంబున బడి యుస్సురనిరి.//

తాత్పర్యము.

ధనము కోసం పరువెత్తి మనవాళ్ళు పరాయి దేశంలో బాధలు పడుతున్నారు. కలలు తీరే మార్గం కనిపించటంలేదు. భారతీయ యువత నీరసంతో నిట్టూర్పులు విడుస్తోంది.//

4.

తేటగీతి.

భారతీయులు ప్రతిభతో వరలు చుండ 

నీసు చెందెడి స్థానికు లింగితంబు 

మరచి చోరులై వీడుచు మానవతను 

నీచకార్యముల్ సల్పుచు నిగుడుచుండ్రి.//

తాత్పర్యము.

భారతీయులు ప్రతిభావంతులని ఆ దేశస్థులలో కొందరు ఈర్ష్యతో మర్యాద మరచి, చోరులగుచు హింసాప్రవృత్తితో చెలరేగుచున్నారు.//

5.

తేటగీతి.

నిత్యమొక ఘర్షణంబట నెగడువోలె 

రాజుకొనుచుండె నా పర రాజ్యమందు 

భారతీయుల కేవిధి భద్రమనుచు 

బెంగపడుచుండ్రి మనవారు భీతి మెయిని.//

తాత్పర్యము.

ఆ దేశంలో నిత్యం మన వాళ్ళ మీదకు ఏదో రకంగా గొడవలు వస్తున్నాయి. ఇలా ఉంటే ఆ దేశంలో ఉండే మన వాళ్లకు భద్రత ఎక్కడుందని మనవాళ్ళు బెంగ పడుతున్నారు.//

6.

చంపకమాల.

తరతమ భేదముల్ కనరె? దాడుల జేయుచు నుద్యమించుచున్ 

పరులను దూరుచుందురట పశ్చిమవాసులు క్రోధపూరితుల్ 

దెఱవెది? జీవనంబిచట తీరుగ సాగుట లేదె!కాలమున్ 

వెఱపున నెట్టుచుండిరట భీతిగ నేడ్చుచు భారతీయులున్.//

తాత్పర్యము.

కోపంతో ఉన్న అమెరికా వాళ్ళు మన దేశస్థుల మీద దాడులు చేస్తూ, ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. అక్కడ జీవించటమెట్లు? భయంతో మనవాళ్ళు తమ కాలాన్ని భారంగా గడుపుతున్నారు.//

7.

తేటగీతి.

ఇటుల బాధలు పడుచుండి హృదయమందు 

మిగుల చింతతో మనవారు మెలగచుండ 

వచ్చెనా శిశిరఋతువు పశ్చిమమున 

తరులు పర్ణముల్ రాల్చుచు తలలు వంచె //

తాత్పర్యము.

ఇలా మనవాళ్ళు బాధతో అక్కడ జీవిస్తూ ఉంటే అమెరికా ఖండమున శిశిరఋతువు వచ్చింది.చెట్లు ఆకులను రాలుస్తూ ఉన్నాయి.//





ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page